Jio Prepaid Plans: భారతీయ టెలికం రంగంలో జియో ప్రవేశం నిజంగా విప్లవాత్మకం. ఒకప్పుడు తక్కువ ఖర్చుతోనే అపరిమిత కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ సౌకర్యాలు అందించి కోట్లాది మంది వినియోగదారుల హృదయాలను గెలుచుకుంది. కానీ రాను రాను పరిస్థితులు మారాయి. ఇప్పుడు ఆ ప్రారంభ దశలో అందుబాటులో ఉన్న అనేక తక్కువ ధర ప్లాన్లు పూర్తిగా కనపడకుండా పోయాయి.
దీంతో జియో కస్టమర్లు మాత్రం షాకింగ్ లో వున్నారు. తక్కువ ధర ఉంటుందని జియో సిమ్ వాడుతుంటే, రాను రాను తక్కువ బడ్జెట్ లో వున్న ఆఫర్లు సైలెంట్ గా తొలగించడం పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు జియో ఎన్ని ప్లాన్స్ తొలగించిందో తెలుసుకుందామా?
మొదటగా రూ.98 ప్లాన్. ఇది 28 రోజుల వాలిడిటీతో 2 జిబి డేటా, జియో టు జియో కాల్స్ ఉచితం అందించేది. ఇతర నెట్‌వర్క్‌లకు మాత్రం ఐయూసి చార్జీలు ఉండేవి. ఈ ప్లాన్ 2020లో నిలిపివేశారు. కొంతకాలం 14 రోజుల వాలిడిటీతో తిరిగి వచ్చినా, చివరికి పూర్తిగా తొలగించారు.
తరువాత ప్లాన్ గురించి మాట్లాడుకుంటే రూ.149 ప్లాన్. రోజుకు 1 జిబి డేటా, 24 రోజుల వాలిడిటీతో వినియోగదారులకు అందించబడింది. 2021–22 మధ్యకాలంలో ఇది చాలా పాపులర్ అయ్యింది. కానీ డేటా డిమాండ్ పెరగడంతో, జియో ఈ ప్లాన్‌ను కూడా నిలిపివేసింది.
రూ.209 ప్లాన్ విషయానికి వస్తే, రోజుకు 1 జిబి డేటా, 22 రోజుల వాలిడిటీ ఉండేది. తక్కువ ఖర్చుతో డేటా వాడే వారికి ఇది చక్కగా సరిపోయేది. కానీ 2025 ఆగస్టులో ఈ ప్లాన్ ఆన్‌లైన్ రీఛార్జ్ ఆప్షన్‌ల నుండి తొలగించబడింది.
Also Read: Realme P3 5G Launched: రియల్ మీ పి3 5జి.. ఫోటోలు, గేమ్స్, బ్యాటరీ అన్నీ సూపర్!
రూ.249 ప్లాన్ కూడా అదే పరిస్థితి. రోజుకు 1 జిబి డేటా, 28 రోజుల వాలిడిటీతో దీన్ని చాలామంది తక్కువ ధర కావడం, నెల అంతా ప్లాన్ రావడంతో దీనిని వాడుకుంటున్నారు. కానీ సెప్టెంబర్ 2025లో ఇది కూడా ఆగిపోయింది. ఇప్పుడు కనీసం రూ.299 ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఒకప్పుడు ఎక్కువమందిని ఆకట్టుకున్న రూ399 ప్లాన్ కూడా మాయం అయింది. దీని మొదటి వెర్షన్ 84 రోజుల వాలిడిటీతో 1 జిబి డేటా ఇచ్చేది. తరువాత అదే ధరకు రోజుకు 2.5 జిబి డేటా, కానీ కేవలం 28 రోజుల వాలిడిటీ ఇచ్చే కొత్త ప్లాన్ ప్రవేశపెట్టబడింది.
రూ.799 ప్లాన్ విషయంలో మాత్రం కొంత గందరగోళం ఉంది. ఇది 84 రోజుల వాలిడిటీతో రోజుకు 1.5 జిబి డేటా ఇచ్చేది. కొన్ని ప్రాంతాల్లో ఆపేసారని వార్తలు వచ్చినా, జియో కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతోందని స్పష్టత ఇచ్చింది.
ఈ మార్పుల వెనుక ఉన్న అసలు కారణం, ప్రారంభ దశలో తక్కువ ధర ప్లాన్లతో వినియోగదారులను ఆకర్షించిన జియో, ఇప్పుడు డేటా వినియోగం విపరీతంగా పెరగడంతో పాటు, 5జి పెట్టుబడులను కూడా దృష్టిలో పెట్టుకుంది. అందుకే తక్కువ ధర ప్లాన్‌లను తగ్గించి, ఎక్కువ ఆదాయం వచ్చే ప్లాన్‌లను ప్రోత్సహిస్తోంది.
మొత్తం మీద, ఒకప్పుడు అందుబాటులో ఉన్న రూ.98, రూ.149, రూ.209, రూ.249, పాత రూ.399 ప్లాన్‌లు ఇప్పుడు జ్ఞాపకాలకే పరిమితం అయ్యాయి. జియోలో బేసిక్ ప్లాన్ ఇప్పుడు రూ.99 నుండి మాత్రమే వాడుకలో ఉంది . తక్కువ ఖర్చుతో డేటా వాడే అవకాశాలు క్రమంగా తగ్గిపోతుండటంతో వినయోగదారులు మాత్రం జియో సిమ్ అంటే అమ్మ బాబోయ్ అనే స్థాయికి వచ్చేసారు. కొద్దిరోజులు ఇలానే కొనసాగితే, జియో కస్లమర్లు తగ్గిపోవడం మాత్రం పక్కా అనిపిస్తుంది.