BigTV English

Jio Offer: జియో అదిరిపోయే ప్లాన్.. ఏకంగా మూడు నెలలు వాలిడిటీ.. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితం!

Jio Offer: జియో అదిరిపోయే ప్లాన్.. ఏకంగా మూడు నెలలు వాలిడిటీ.. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితం!

Jio Offer: జియో ఎప్పటికప్పుడు తన వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త రీచార్జ్ ప్లాన్‌లు మార్కెట్‌లోకి తీసుకొస్తూనే ఉంటుంది. అలాంటి వాటిలో ఎక్కువ కాలం వాలిడిటీ ఉండే, డేటా, కాల్స్, మెసేజింగ్, అలాగే ఎంటర్‌టైన్‌మెంట్ సౌకర్యాలను ఒకే ప్యాక్‌లో అందించే ప్లాన్ తీసుకువచ్చింది. అదే రూ.999. ఈ ప్లాన్‌ ప్రధానంగా ఒకసారి రీచార్జ్ చేస్తే దాదాపు 98 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు. అంటే మూడు నెలలకంటే ఎక్కువ కాలం మరోసారి రీచార్జ్ చేయాలనే ఇబ్బంది లేకుండా మొబైల్ వాడుకోవచ్చు. ఎక్కువ రోజులు ఉపయోగపడే రీచార్జ్ ప్లాన్‌లు కావాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం.


సూపర్ డేటా బాసూ..

ఇక డేటా విషయానికి వస్తే, ప్రతి రోజూ 2 జీబీ ఇంటర్నెట్ లభిస్తుంది. అంటే రోజూ యూట్యూబ్ చూడొచ్చు, సోషల్ మీడియా వాడొచ్చు, వీడియో కాల్స్ చేయొచ్చు. కానీ ఆ రోజు లిమిట్ అయిపోయిన తర్వాత కూడా అవసరం ఉంటే, జియో యాడ్, ఆన్ డేటా ప్లాన్ రీచార్జ్ చేసుకుని మరింత ఇంటర్నెట్ పొందవచ్చు. మీ దగ్గర 5జీ స్మార్ట్‌ ఫోన్ ఉండి, మీ ప్రాంతంలో జియో 5జీ సర్వీస్ అందుబాటులో ఉంటే, ఈ ప్లాన్‌తో మీరు ఎలాంటి పరిమితులు లేకుండా అన్‌లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్ వాడుకోవచ్చు. డేటా మాత్రమే కాదు, మెసేజింగ్ సౌకర్యం కూడా ఇందులో భాగమే. ప్రతి రోజూ సుమారు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పంపే అవకాశం కూడా ఉంది. అవసరమైనప్పుడు అదనపు ఖర్చు లేకుండా మెసేజ్ పంపించుకోవచ్చు.


Also Read: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో కొత్త కాన్సెప్ట్.. తక్కువ ధరకే తాగునీరు! ఎంతో తెలుసా?

జియో హాట్‌స్టార్ మొబైల్ టీవీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

ఇదే కాదండోయ్.. ఎంటర్‌టైన్‌మెంట్‌ను కూడా జియో ఇందులో చేర్చింది. ఈ ప్లాన్ రీచార్జ్ చేస్తే 90 రోజులపాటు జియో హాట్‌స్టార్ మొబైల్ టీవీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు. అంటే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, షోలు, ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్‌లు అన్నీ మీ మొబైల్‌లో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా చూసుకునేందుకు అవకాశం కల్పించింది జియో.

ఎఐ క్లౌడ్ స్టోరేజ్

ఇంకా ఒక ప్రత్యేకమైన సౌకర్యం ఏమిటంటే జియో ఎఐ క్లౌడ్ స్టోరేజ్. ఇందులో 50 జీబీ స్టోరేజ్ అందుతుంది. అంటే మీ ఫోటోలు, వీడియోలు, ముఖ్యమైన ఫైళ్లు అన్నీ కూడా సురక్షితంగా జియో క్లౌడ్‌లో సేవ్ చేసుకోవచ్చు. దీంతో మీ మొబైల్ మెమరీ ఫుల్ అయిపోతుందని టెన్షన్ ఉండదు. ఎక్కడైనా, ఎప్పుడైనా మీ ఫైళ్లు సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు.

జియో రూ.999 ప్లాన్ – ఆల్ ఇన్ వన్ ప్యాక్

జియో రూ.999 ప్లాన్ ఒకే సారి అన్ని అవసరాలను తీర్చగల ప్యాక్. వాలిడిటీ ఎక్కువ, డేటా ఎక్కువ, రోజూ మెసేజింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ సబ్‌స్క్రిప్షన్, క్లౌడ్ స్టోరేజ్ అన్నీ ఒకే చోట లభించడంతో ఇది జియో వినియోగదారులకు మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా యువత, స్టూడెంట్స్, ఎక్కువగా మొబైల్ డేటా వాడేవారు, ఎప్పుడూ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలని కోరుకునేవారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ఒక రీచార్జ్‌తో మూడు నెలలకు పైగా ఇన్ని సౌకర్యాలు లభించడం వల్లే ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులను ఆకర్షిస్తోంది. అందుకే దీనిని “ఆల్ ఇన్ వన్ ప్యాక్” అని పిలవవచ్చు.

Related News

Tata New Curvv: టాటా నుంచి సరికొత్త కారు.. రూ.10 లక్షలకే అదిరిపోయే లుక్‌తో!

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. కస్టమర్లకు పండగే!

DMart: డిమార్ట్ సొంత బ్రాండ్ రేట్లు అంత తక్కువా? మిగతా బ్రాండ్ల ధరలతో ఉన్న తేడా ఏంటీ?

Flight Ticket: విమాన ప్రయాణికులకు సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే టికెట్‌లో భారీ రాయితీ

Tesla Car: భారత్‌ మార్కెట్‌లో టెస్లాకు ఏమైంది? అంచనాలను అందుకోవడం లేదా?

Big Stories

×