Param Sundari Controversy: బాలీవుడ్ వర్సెస్ సౌత్ వివాదం గురించి తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా పేరుతో ఏ భాష చిత్రమైన అన్ని భాషల్లో రిలీజ్ అవుతున్నాయి. వివిధ భాషలకు చెందిన నటీనటులు ఒక సినిమాలో భాగం అవుతున్నారు. ప్రస్తుతం ఒక సినిమాకు ఈ భాష ఆ భాష చిత్రమనే భేదం లేకుండ ఇండియన్ సినిమా అన్నట్టుగా మారింది. కానీ, సౌత్, నార్త్ అనే వివాదం ఇంకా అలాగే ఉంది. బాలీవుడ్‌కి దక్షిణాది పరిశ్రమ అంటే చిన్న చూపు. ఎంతోమంది బాలీవుడ్ నటులు ఆయా సందర్భాల్లో దక్షిణాదిని కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తరచూ ఈ వ్యవహరం వివాదంలో నిలుస్తోంది.
మలయాళీలపై బాలీవుడ్ ద్వేషం
తాజాగా మరోసారి బాలీవుడ్-సౌత్ వివాదం తెరపైకి వచ్చింది. దీనికి కారణం జాన్వీ కపూర్ నటించిన పరం సుందరి మూవీ. ఇందులో మలయాళీలను అవమానపరిచారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న విమర్శలు వస్తున్నాయి. మలయాళీలపై బాలీవుడ్ ఇంకా విషం చిమ్ముతూనే ఉందంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకి అసలు సంగతేంటంటే.. జాన్వీ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రాలు జంటగా నటించిన లే టెస్ట్ మూవీ ‘పరం సుందరి’. ఆగస్టు 29న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది. క్రాస్ కల్చర్ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. రోటిన్ కథ, విసిగించే కామెడీ, ఊహించునట్టుగా ఉండే ట్విస్ట్‌లు మూవీకి మైనస్. దీంతో పరం సుందరి బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
పరం సుందరి వివాదం
తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా ఉత్తరాది అబ్బాయిగా.. జాన్వీ కపూర్ మలయాళి అమ్మాయిగా కనిపించింది. రెండు విభిన్న సంప్రదాయ కుటుంబాలకు చెందిన వీరిద్దరు పెళ్లి చేసుకుంటే ఏమౌతుంది.. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పరం సుందరి కథ సాగుతుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రంలోని ఓ సన్నివేశం మలయాళీలను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. సినిమాలోని ఓ సన్నివేశంలో ఆగ్రహంతో ఉన్న జాన్వీ కపూర్ కొబ్బరి చెట్టు ఎక్కినట్టు చూపించారు. దీనిపై మలయాళి ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది.. కానీ, ఇంకా బాలీవుడ్ తన తీరు మార్చుకోవడం లేదు.
సౌత్‌ని వారు ఇంకా చిన్నచూపు చూస్తూనే ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఓ ట్విటర్ యూజర్ జాన్వీ కొబ్బరి చెట్టు ఎక్కిన ఫోటోని షేర్ చేస్తూ గతంలో తనకు ఎదురై చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. 2014లో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఓ గ్రూప్ పీపుల్ నన్ను వేధించారు. నేను మలయాళిని కాబట్టి.. కొబ్బరి చెట్టు ఎక్కు అంటూ ఎగతాళి చేశారు. ఇది 2014లో జరిగింది. కానీ, ఇలాంటి సినిమాలు 2025లో కూడా మనల్ని అక్కడే ఉంచుతున్నాయి. బాలీవుడ్ ఎప్పుడు మలయాళిని, దక్షినాదిని కించపరడం, ఎగతాళి చేయడమే పనిగా పెట్టుకుంది. మరోసారి పరం సుందరి చిత్రంలో మలయాళిలపై బాలీవుడ్ విషం చిమ్మింది అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ సన్నివేశం వివాదంలో నిలిచింది.
i was bullied by a bunch of people when i was in delhi and they mocked me asking to climb on the coconut tree because i’m a malayalee . this was on 2014 and because of movies like this WE’RE STILL HERE in 2025 ? This movie cannot get more worse atp . https://t.co/8RkbKPnUNf
— suryaaa 🍉 (@blankspacenaah) September 1, 2025