BigTV English

Kawasaki Ninja 650 Discount: రైడింగ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. కవాసాకి బైక్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. సమయం లేదు మిత్రమా..!

Kawasaki Ninja 650 Discount: రైడింగ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. కవాసాకి బైక్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. సమయం లేదు మిత్రమా..!

Kawasaki Ninja 650 Discount: ప్రముఖ ఖరీదైన బైక్‌ల కంపెనీగా కవాసాకి ప్రపంచ మార్కెట్‌లో పేరొందింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన బైక్‌లు అధిక ధరను కలిగి ఉంటాయి. అయినా ప్రపంచ, దేశీయ మార్కెట్‌లో దీనికి మంచి డిమాండ్ ఉంది. చాలా మంది రైడింగ్ ప్రియులు ఈ కంపెనీ బైక్‌లను ఎంతగానో ఇష్టపడతారు. ఇందులో భాగంగానే ఈ కవాసాకి బైక్‌లను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ధర ఎంతున్నా.. బైక్ పై ఇష్టంతో కొనేందుకు ముందుంటారు. ఇక బైక్ ప్రియులను ఆకట్టుకునేందుకు కంపెనీ కూడా అదిరిపోయే డిస్కౌంట్‌లను అందిస్తూ వస్తుంది.


ఇప్పటికే తమ బైక్‌లపై చాలా ఆఫర్లు ప్రకటించింది. ఇక ఇప్పుడు మరొక కొత్త డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. జూలై 2024 కోసం అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కవాసాకి నింజా 650 బైక్‌పై కళ్లుచెదిరే తగ్గింపును అందిస్తోంది. ఈ బైక్‌కి సంబంధించి పూర్తి విషయానికొస్తే.. కవాసాకి హై పెర్ఫార్మెన్స్ బైక్‌లలో అత్యంత ఇష్టమైన బ్రాండ్‌లలో ఒకటి. ఈ కంపెనీ తమ బైక్‌లపై డిస్కౌంట్లు ప్రకటించినప్పుడల్లా సేల్స్ భారీ స్థాయిలో ఉంటున్నాయి.

Also Read: రూ.60 వేలకే హీరో బైక్.. 65 కిమీ మైలేజ్.. 11 రంగుల్లో కొనుగోలు చేయవచ్చు!


ఇటీవల అంటే ఈ ఏడాది మార్చిలో కంపెనీ నింజా 400, నింజా 650, వెర్సిస్ 650, వల్కన్ ఎస్‌ వంటి నాలుగు మోడళ్లపై వరుసగా.. 40,000, రూ.30,000, రూ.40,000, రూ.60,000 డిస్కౌంట్లను ప్రకటించి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఇప్పుడు అదే ప్లాన్‌తో వచ్చింది. ఇందులో భాగంగానే ఇప్పుడు కవాసాకి కంపెనీ జూలై 2024లో తన నింజా 650పై రూ.30,000 వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ డిస్కౌంట్‌ను ‘గుడ్ టైమ్స్ వోచర్స్’ రూపంలో అందిస్తుంది.

నింజా 650 బైక్ కొనుక్కోవాలని అనుకునే కొనుగోలుదారులు ఈ వోచర్‌ను చెక్ అవుట్ వద్ద రీడీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.16 లక్షలు ఉండగా.. రూ.30,000 గుడ్ టైమ్ వోచర్‌ను పొందడం ద్వారా కేవలం రూ.6.86 లక్షల ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్టాక్ అయిపోయాక ఈ ఆఫర్ వర్తించదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు సమీపంలోని డీలర్‌షిప్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. కాగా ఈ బైక్ 649 సిసి ప్యారలల్-ట్విన్ లిక్విడ్-కూల్డ్ మోటారును కలిగి ఉంటుంది. ఇది 68 పిఎస్ గరిష్ట పవర్, 64 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

Tags

Related News

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

Big Stories

×