BigTV English

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షకాల సమావేశాలు.. ఆరు కొత్త చట్టాల ప్రవేశపెట్టబోతున్న మోదీ ప్రభుత్వం సిద్ధం..

Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షకాల సమావేశాలు.. ఆరు కొత్త చట్టాల ప్రవేశపెట్టబోతున్న మోదీ ప్రభుత్వం సిద్ధం..

Parliament Monsoon Session| ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్వరలో జరగబోయే వర్షాకాల సమావేశాల్లో ఆరు కొత్త చట్టాలకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టబోతోంది. లోక్ సభ సెక్రటేరియట్ గురువారం సాయంత్రం విడుదల చేసిన పార్లమెంట్ బులెటిన్ లో మరో నాలుగు రోజుల తరువాత జరుగబోయే సమావేశాల్లో ప్రవేశబట్టబోయే బిల్లుల లిస్టు ప్రచురించబడింది.


పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు కొనసాగునున్నాయి. మంగళవారం, జూలై 23న అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి కేంద్ర ఆర్థిక బడ్జెట్ 2024-25ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సంవత్సరం జరిగిన లోక్ సభ ఎన్నికల తరువాత పూర్తి స్థాయి జరిగే పార్లమెంట్ సమావేశాలు ఇవే.

Also Read: ‘మీ ఇల్లు అని తెలీక దొంగతనం చేశాను.. సారీ’.. లెటర్ రాసి సొమ్మును తిరిగి ఇచ్చేసిన విచిత్ర దొంగ!


పార్లమెంట్ సెషన్‌లో ప్రవేశబెట్టబోయే ఆరు బిల్లుల వివరాలు:
1. విపత్తు నిర్వహణ సవరణ బిల్లు (డిజాస్టర్ మెనేజ్ మెంట్ సవరణ బిల్లు)
2. ఫైనాన్స్ బిల్లు
3.1934 ఎయిర్ క్రాఫ్ట్ చట్టాన్ని తొలగించి దాని స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్ 2024 బిల్లు
4. స్వాతంత్రం ముందు ఉన్న చట్టానికి బదులుగా బాయిలర్స్ బిల్లు
5. కాఫీ ప్రొమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు
6. రబ్బర్ ప్రొమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు

బిజినెస్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసిన లోక్ సభ స్పీకర్

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ ఎంజెడా నిర్ణయించడానికి లోక్ సభలో ఒక బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఎసి)ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో 15 సభ్యులున్నారు. వీరిలో ఎక్స్ అఫీషియో చెయిర్ పర్సన్ గా స్వయంగా లోక్ సభ స్పీకర్ ఉంటారు. ఈ సభ్యులందరూ స్పీకర్ ద్వారా నామినేట్ చేయబడ్డ వారే. పార్లమెంట్ లో జరిగే ప్రతి సెషన్‌కు ముందు ఈ కమిటీ సభ్యలు సమావేశమవుతారు. ఆ తరువాత అవసరమైతే ప్రత్యేక సమావేశాలకు హాజరవుతారు. ఈ కమిటీ సభ్యుల్లో చైర్మెన్ గా స్పీకర్ సహా మొత్తం ఏడుగురు బిజేపీ సభ్యలున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఇద్దరు, జెడియు నుంచి ఒకరు, తెలుగుదేశం పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకె, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, సమాజ్ వాదీ పార్టీల తరపున ఒక్కొక్కరు సభ్యులుగా ఉన్నారు. భారత దేశంలో 1952, జూలై 14 నుంచి ఈ బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్వహణ జరుగుతూనే ఉంది.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×