BigTV English

Virat Kohli A Fan of Chiranjeevi: మెగాస్టార్ మామూలోడు కాదురోయ్.. చిరంజీవి డ్యాన్స్ అంటే విరాట్ కోహ్లికి పిచ్చంటా!

Virat Kohli A Fan of Chiranjeevi: మెగాస్టార్ మామూలోడు కాదురోయ్.. చిరంజీవి డ్యాన్స్ అంటే విరాట్ కోహ్లికి పిచ్చంటా!

King Kohli dances to Mega Star Chiranjeevi’s Songs: మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే. మెగాస్టార్ యాక్టింగ్, డ్యాన్స్‌లను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. మొదటి నుంచి విశ్వంభర సినిమా వరకు క్రమశిక్షణతో నటిస్తూ వస్తున్నాడు. స్వయంకృషితో ఎదిగిన ఆయన టాలీవుడ్ మెగాస్టార్ అయ్యాడు. తెలుగు అభిమానులతో పాటు ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే, తాజాగా, చిరంజీవికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్ రన్ మెషీన్ విరాట్ కోహ్లికి చిరంజీవి అంటే అభిమానమని చెప్పిన మాటలు హాట్ టాపిక్‌గా మారాయి.


సినీ ఇండస్ట్రీలో చిరంజీవి మెగాస్టార్ ఎలానో క్రికెట్‌లో విరాట్ కోహ్లి కూడా మెగాస్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. క్రికెట్‌లో అడుగుపెట్టినప్పటినుంచి మూడు పార్మాట్‌లలో స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న తర్వాత పొట్టి పార్మాట్‌లకు కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇందులో భాగంగా విరాట్‌కు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, కోహ్లి మిత్రుడు తెలంగాణకు చెందిన క్రికెటర్ రవితేజ.. కోహ్లి గురించి పలు విషయాలు పంచుకున్నాడు.

క్రికెటర్ ద్వారక రవితేజ గతంలో అండర్ 15 సమయంలో కోహ్లితో కలిసి ఆడాడు. ఇద్దరు ఓకే రూంలో ఉండేవాళ్లని చెప్పుకొచ్చాడు. అయితే రవితేజ గతంలో డెక్కన్ చార్జర్స్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఆయన హెచ్‌సీఏకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా, జరిగిన ఓ ఇంటర్వ్యూలో కోహ్లిపై పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.


‘అండర్ 15 ఆడుతున్న సమయంలో కోహ్లితో కలిసి ఓ రూంలో ఉండవాళ్లం. ఆట ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో నేను ఎక్కువగా చిరంజీవి పాటలు వినడంతోపాటు డ్యాన్స్ చేసేవాడిని. ఈ సమయంలోనే కోహ్లికి చిరంజీవి సాంగ్స్ అంటే ఇష్టం పెరిగింది. తను కూడా చిరంజీవి పాటలకు డ్యాన్స్ చేసేవాడు. అప్పటినుంచి మేము ఇద్దరం ఒకరినొకరం ఏం చిరు అని సరదాగా పిలుచుకునేవాళ్లం. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది.

Also Read: నటాషాతో విడాకులు ప్రకటించిన హార్దిక్ పాండ్యా

సరిగ్గా ఆరేళ్ల తర్వాత కలిసినపుడు చిరంజీవి ఎలా ఉన్నారని నన్ను కోహ్లి అడిగాడు.’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో కోహ్లికి కూడా చిరంజీవి అంటే ఇష్టమా? చిరంజీవికి ఎవరైన అభిమాని అవుతారా? అంటే మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×