BigTV English

Crocodile on UP Roads: ఉత్తర్ ప్రదేశ్ రోడ్డుపై దర్శనమిచ్చిన 10 అడుగుల మొసలి.. చూసేందుకు భారీగా వచ్చిన జనం!

Crocodile on UP Roads: ఉత్తర్ ప్రదేశ్ రోడ్డుపై దర్శనమిచ్చిన 10 అడుగుల మొసలి.. చూసేందుకు భారీగా వచ్చిన జనం!

Crocodile on Uttar Pradesh Roads: నీటిలో ఉండాల్సిన మొసలి రోడ్డుపై దర్శనమిచ్చింది. ఒక్కసారిగా రోడ్డుపై మొసలి దర్శనమివ్వడంతో చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో వెలుగుచూసింది. 10 అడుగుల పొడవున్న మొసలి రెయిలింగ్‌ ఎక్కేందుకు ప్రయత్నించింది. పక్కనే ఉన్న ఓ కాలువలో నుంచి మొసలి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది.


ఈ తరుణంలో తిరిగి కాలువలోకి ప్రవేశించేదుకు ప్రయత్నించింది. ఈ తరుణంలో పొడవున్న రెయిలింగ్ ను ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ తరుణంలో జారీ కింద పడుతూ ఉన్న దృశ్యాలను అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

రంగంలోకి అటవీశాఖ అధికారులు


ఈ ఘటనపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మోహిత్ చౌదరి, మొసళ్ల రెస్క్యూ నిపుణుడు పవన్ కుమార్ స్పందించారు. స్థానికుల అటవీ శాఖకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ టీమ్ మొసలి తలపై గుడ్డను కప్పి, దాని నోరు, కాళ్ళను తాళ్లతో కట్టేశారు. తర్వాత ఆ మొసలిని సురక్షితంగా కాలువలోకి వదిలిపెట్టారు.

Also Read: Python Attacked Man: 14 అడుగుల అనకొండతో వ్యక్తి ఫైటింగ్.. వీడియో వైరల్!

దీంతో ఈ ఘటన తెలిసిన స్థానికులు మొసలిని చూసేందుకు భారీ మొత్తంలో తరలివచ్చారు. మొసలిని రెస్క్యూ చేయడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రోడ్డుపైకి మొసలి రావడం చూసి పలువురు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం అటవీశాఖ మొసలిని సంరక్షించి పరిస్థితిని చక్కబెట్టారు. ఏది ఏమైనా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.

Related News

Google map: గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని సముద్రంలోకి వెళ్లారు.. కారులో ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులు

Water Found in Petrol: బురద నీళ్లు పోసి పెట్రోల్ అన్నారు.. ఆ బంకులో ఘరానా మోసం!

Ongole Bar Attack: మద్యం మత్తులో.. పొట్టు పొట్టు కొట్టుకున్న మందుబాబులు

Jackal Attack: చీర కొంగుతో నక్కను చంపేసిన మహిళ.. అరగంట పోరాడి..

Viral video: బస్సు డ్రైవర్, మహిళ రప్పా రప్పా కొట్టుకున్నారు భయ్యా.. వీడయో వైరల్

Nano Banana Photo: నెట్టింట వైరల్ అవుతున్న నానో బనానా 3D పిక్స్, సింపుల్ గా మీరూ క్రియేట్ చేసుకోండిలా!

Video Viral: పట్టపగలు దొంగలతో ఆ మహిళ ఫైట్.. యాక్షన్ మూవీ మాదిరిగా, చివరకు ఏం జరిగింది?

Forest Officials: గ్రామస్తులకు తిక్కరేగింది.. పులికి ఎరగా ఫారెస్టు అధికారులు, బోనులో పెట్టి మరీ..

Big Stories

×