Big Stories

Maruti Suzuki Recalls Cars: 16 వేల కార్లను రీకాల్ చేసిన మారుతీ సుజుకీ.. ఏ మోడల్స్ అంటే..?

Maruti Suzuki recalls
Maruti Suzuki recalls

Maruti Suzuki Recalls Wagon R And Baleno Cars: ప్రముఖ వాహనతయారీ కంపెనీలు తరచూ తమ వినియోగదారులకు మెరుగైన సేఫ్టీ అందించేందుకు కృషి చేస్తుంటాయి. అయితే కొన్ని సార్లు ఆ ఉత్పత్తుల్లో సాంకేతిక లోపాల కారణంగా వాటిని మళ్లీ సరిచేస్తూ ఉంటాయి. అలాంటిదే తాజాగా ఓ ప్రముఖ కార్ల కంపెనీకి ఎదురైంది.

- Advertisement -

ప్రముఖ కార్ బ్రాండ్‌లలో ఒకటైన మారుతి సుజుకి.. దాని మోడళ్లకు చెందిన దాదాపు 16,000 లకు పైగా వాహనాలను రీకాల్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా మారుతి సుజుకి వ్యాగన్ ఆర్, బాలెనో ఫ్యూయల్ పంప్ మోటార్‌లో కొన్ని లోపాలు ఉండటాన్ని గుర్తించి ఆ కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా తాజాగా వెల్లడించింది.

- Advertisement -

దీని కారణంగా 30 జూలై 2019 నుంచి 1 నవంబర్ 2019 మధ్య తయారైన కార్లను రీకాల్ చేస్తుంది. అందులో బాలెనో 11,851 వాహనాలు, వ్యాగన్ఆర్‌కి సంబంధించి 4,190 వాహనాలను రీకాల్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ రెండు కార్ల ఫ్యూయల్ పంప్ మోటార్‌లో లోపం ఉందని కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ లోపం ఉన్న వారి కారును కంపెనీ ఉచితంగా రిపేర్ చేయనుంది.

మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్, బాలెనో యూనిట్లపై రీకాల్ నిర్ణయం తీసుకుంది కంపెనీ. ఇంధన పంప్ మోటార్ లోపం ఉన్న వాహనాలను ఉచితంగా తనిఖీ చేస్తామని, వాహనాన్ని ఉచితంగా మరమ్మతులు చేస్తామని కంపెనీ తెలిపింది.

Also Read: కొత్త డిజైన్, ఫీచర్లతో మారుతి స్విఫ్ట్, డిజైర్..!

అయితే దీనిని ఎలా గుర్తించాలని చాలా మంది అనుకుంటుంటారు. ఈ మోడల్ కార్ల ఫ్యూయల్ పంప్‌లో సమస్యను ఎలా గుర్తించాలో మారుతి సుజుకి ఇంకా చెప్పలేదు. కానీ ఛాసిస్ నంబర్ ద్వారా కారు ఎప్పుడు తయారు చేయబడిందో, అది రీకాల్ చేయబడిందో లేదో తెలుసుకోవచ్చు.

కాగా బాలెనో, వ్యాగన్ఆర్ కార్లు మారుతి సుజుకి అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాలలో ఒకటి. కొన్ని నివేదికల ప్రకారం.. ఫిబ్రవరి 2024లో మారుతి సుజుకి 19,412 వ్యాగన్ఆర్ యూనిట్లను విక్రయించింది. అదేసమయంలో బాలెనో 17,517 యూనిట్లు అమ్ముడుపోయాయి. గత నెలతో పోలిస్తే వెగన్ ఆర్ అమ్మకాలు 15 శాతం పెరిగాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News