BigTV English

Buy Maruti Swifts Car @ Rs 6.60 Lakhs: కొత్త డిజైన్, ఫీచర్లతో మారుతి స్విఫ్ట్ డిజైర్.. ధర కూడా తక్కువే!

Buy Maruti Swifts Car @ Rs 6.60 Lakhs: కొత్త డిజైన్, ఫీచర్లతో మారుతి స్విఫ్ట్ డిజైర్.. ధర కూడా తక్కువే!
Maruti Cars
Maruti Cars

Maruti New Designed Swift Car in Just Rs 6.60 Lakhs: మారుతి కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కంపెనీ ఎప్పుడూ కూడా సెల్లింగ్‌లో అగ్రస్థానంలో ఉంటుంది. మీరు గమనించినట్లయితే కారు కొనాలనుకునే వారికి మారుతి కార్లు బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయి. కంపెనీ తయారు చేసే కార్లు తక్కువ ప్రైజ్‌లో బెస్ట్ ఫీచర్లు అందిస్తాయి. వీటి ప్రైజ్ కూడా మిడిల్ క్లాస్ ప్రజలకు అంబాటులో ఉంటుంది.


అయితే మారుతి నుంచి గతంలో వచ్చిన పాత మోడల్ కార్లు స్విప్ట్, డిజైర్‌లు ఇప్పటికీ అమ్మకాల్లో రికార్డులు స‌ృష్టిస్తున్నాయి. స్విప్ట్ గత ఫిబ్రవరి నెలలో టాప్ పొజిషన్లో ఉంది. కంపెనీ ఇది ద‌ృష్టిలో ఉంచుకొని 2024 సంవత్సరానికి అనుగుణంగా కొత్త తరహా స్విప్ట్‌ను తీసుకురానుంది. దీనితో పాటు డిజైర్ కూడా కొత్త మోడల్ తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ క్రమంలో మారుతి స్విప్ట్, డిజైర్‌లో ఎటువంటి మార్పులు ఉండనున్నాయి, ఫీచర్లు, ధరలు వివరాలు తెలుసుకోండి.

Also Read: గాలితో తయారైన హ్యాండ్ బ్యాగ్.. ప్రపంచంలోనే లైట్ వెయిట్ బ్యాగ్‌గా రికార్డ్


మారుతి కార్లపై వినియోగదారులకు ప్రత్యేకమైన నమ్మకం ఉంటుంది. అందుకే ఈ కంపెనీ నుంచి ఎలాంటి మోడల్ కార్లు వచ్చినా కొనుగోలుదారులు ప్రత్యేకమైన ఆసక్తి చూపుతారు. అయితే ఇప్పటికే కొత్త స్విప్ట్ 2024 మోడల్‌ను జపాన్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. పాత స్విప్ట్ మోడల్‌తో పోలిస్తే కొత్త స్విప్ట్ బాడీలో ఎలాంటి మార్పులు కనిపించవు. కానీ డిజైన్ ఐకానిక్‌గా ఉంటుంది. కొత్త స్విఫ్ట్‌లో బంపర్లు, లైట్లు, అలాయ్ వీల్స్, రేర్ డోర్ హ్యాండిల్స్‌ మంచి లుక్స్‌తో కనిపిస్తాయి. ఈ కారులో బూట్ స్పేస్ పాత మోడల్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొత్త డయల్స్, అప్డేటెడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. సన్‌రూప్ కూడా ఉండే అవకాశం ఉంది.

స్విఫ్ట్ న్యూ మోడల్‌లో ఇంజిన్ గరిష్టంగా 80 బీహెచ్ పీ పవర్, 108 ఎన్ ఎం టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది లీటర్‌కు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. కారులో Suzuki Z12E పేరుతో మూడు కొత్త
సిలిండర్లను అమర్చారు. ఈ మూడు సిలిండర్లు నేచురల్ అస్పిరేటెడ్ యూనిట్‌‌గా పనిచేస్తాయి. డిజైర్‌కు సంబంధించిన ఇంజిన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి ఈ సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది.

Also Read: యూజర్లకు బ్యాడ్‌ న్యూస్.. భారీగా పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ ధరలు

2024 న్యూ మోడల్ ధర విషయానికి వస్తే చాలా స్వల్ప మార్పులు మాత్రమే ఉండే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. కొత్త స్విప్ట్‌ను రూ.6.60 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్‌లో లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త డిజైర్ మోడల్ కూడా రూ.6.60 లక్షలు ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి పాత స్విప్ట్, డిజైర్ మోడళ్లు ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే లేటేస్ట్‌గా అప్డేట్ చేసిన మోడళ్లు కూడా మారుతీ లవర్స్‌ను అట్రాక్ట్ చేస్తాయని సంస్థ భావిస్తోంది. అతి త్వరలో ఇవి మార్కెట్లోకి రానున్నాయి.

Related News

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

Big Stories

×