BigTV English

Women’s Asia Cup 2024: జులై 21న ఇండియా – పాక్ మధ్య మ్యాచ్.. సమ్మర్ లో మరింత హీటేక్కనున్న వాతావరణం!

Women’s Asia Cup 2024: జులై 21న ఇండియా – పాక్ మధ్య మ్యాచ్.. సమ్మర్ లో మరింత  హీటేక్కనున్న వాతావరణం!
Women's Asia Cup 2024
India Vs Pakistan on July 21 in Women’s Asia Cup 2024: 2024 సెప్టెంబరు-అక్టోబర్‌ నెలలో జరిగే మహిళా టీ 20 ప్రపంచ కప్‌నకు ముందు మహిళా ఆసియా కప్ జరగనుంది. జులై 19 నుంచి 28 వరకు శ్రీలంకలోని దంబుల్లాలో మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోతగిన విషయం ఏమిటంటే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జులై 21న ఇండియా మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ లో కూడా భారత్-పాక్ మద్య జరిగే మ్యాచ్ పై ఇప్పటి నుంచే అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. అంతకుముందు అంటే జులై 19న టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్ ను యూఏఈతో ఆడనుంది.

2024 జులైలో జరగనున్న మహిళల ఆసియా కప్‌నకు సంబంధించిన షెడ్యూల్ ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. టోర్నీ చరిత్రలో తొలిసారిగా 8 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూప్ లుగా విభజించారు. గ్రూప్‌-ఎలో భారత్‌, పాకిస్థాన్‌లు కలిసి ఉన్నాయి. వీటితో పాటు యూఏఈ, నేపాల్ ఉన్నాయి. గ్రూప్ బి లో  శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ మలేషియా ఉన్నాయి.


ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జులై 26న సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అక్కడ నుంచి ఫైనల్ కు చేరిన జట్లు జూలై 28న తలపడతాయి. టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఏడు టైటిల్స్‌తో భారత్  విజయవంతమైన జట్టుగా నిలిచింది.

Also Read: మళ్లీ రోహిత్ శర్మకి కెప్టెన్సీ?


మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి మాకెంతో సంతోషంగా ఉందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జైషా పేర్కొన్నారు. 2018లో ఆరు జట్లతో మొదలై, 2022లో ఏడు జట్లకు చేరింది. 2024లో ఎనిమిది జట్లు ఆడటం నిజంగా గొప్ప విషయమని అన్నారు. పురుషుల క్రికెట్ కి దీటుగా మహిళా క్రికెట్ ను కూడా తీర్చిదిద్దాలనేది మా సంకల్పం అని జైషా తెలిపారు. ఆసియా కప్ లో విశేషం ఏమిటంటే ఈసారి టోర్నమెంట్ లో మహిళా అంపైర్లు పాల్గొంటున్నారు.

Related News

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Big Stories

×