BigTV English

Jio Cinema Shut Down: ‘జియో సినిమా’ క్లోజ్? ముఖేష్ అంబానీ సంచలన నిర్ణయం!

Jio Cinema Shut Down: ‘జియో సినిమా’ క్లోజ్? ముఖేష్ అంబానీ సంచలన నిర్ణయం!

Jio-Hotstar: రిలయన్స్‌, డిస్నీ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రెండు సంస్థలు త్వరలో విలీనం కానున్న నేపథ్యంలో రెండు సంస్థలకు వేర్వేరుగా ఉన్న ఓటీటీ సంస్థలను ఒకే ఓటీటీ సంస్థగా మార్చాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా డిస్నీ +హాట్ స్టార్ లో జియో సినిమాను విలీనం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెండు సంస్థలను కలిపి జియో హాట్ స్టార్ గా మార్చాలని భావిస్తున్నట్లు సమాచారం.


అతిపెద్ద ఓటీటీ సంస్థగా అవతరణ

వయకామ్‌ 18, స్టార్‌ ఇండియా విలీనం కానున్న నేపథ్యంలో ఈ రెండు సంస్థలకు చెందిన ఓటీటీలను ఏం చేస్తారోనని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. అప్పట్లో హాట్ స్టార్ ఓటీటీని జియో సినిమాలో కలిపేస్తారనే టాక్ వినిపించింది. ఆ తర్వాత స్పోర్ట్స్ కోసం ఒక ఓటీటీని, ఎంటర్ టైన్ మెంట్ కోసం మరో ఓటీటీని కొనసాగించే అవకాశం ఉన్నట్లు చర్చ జరిగింది. చివరకు జియో సినిమాను డిస్నీ +హాట్ స్టార్ లో విలీనం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జియో సినిమాతో పోల్చితే, హాట్ స్టార్ పరిధి మరింత విస్తృతంగా ఉండటంతో ఈ డెసిషన్ తీసుకున్నారట. జియో యాప్ కు 100 మిలియన్ డౌన్ లోడ్స్ ఉండగా, డిస్నీ + హాట్ స్టార్ కు 500 మిలియన్ డౌన్ లోడ్స్ ఉన్నాయి. రెండు విలీన అయ్యాక అతి పెద్ద ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా మారే అవకాశం ఉంటుంది.


ఇకపై మ్యాచ్ లు అన్నీ అక్కడే!

జియో సినిమా, డిస్నీ+ హాట్ స్టార్ విలీన్ అయిన తర్వాత వచ్చే క్రికెట్ టోర్నమెంట్స్ అన్నీ డిస్నీ+ హాట్‌ స్టార్‌ లోనే చూసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025తో పాటు క్రికెట్, స్పోర్ట్స్ ఈవెంట్స్ జియో సినిమాలో అందుబాటులో ఉండనున్నాయి. ఐపీఎల్ సహా ఇండియాలోని క్రికెట్ మ్యాచ్ లకు సంబంధించి డిజిటల్ రైట్స్ జియో సినిమా కొనుగోలు చేసింది. ఐసీసీ టోర్నమెంట్స్ కు సంబంధించిన రైట్స్ ను హాట్ స్టార్ కలిగి ఉంది. ఇకపై అన్ని మ్యాచ్ లను జియో హాట్ స్టార్ లో చూసే అవకాశం ఉంటుంది. త్వరలో ఈ అంశానికి సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది.

ఫిబ్రవరిలో రిలయన్స్, డిస్నీ ఇండియా విలీన ఒప్పందం

రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ ఇండియాకు సంబంధించిన విలీన ఒప్పందం ఈ ఏడాది (2024) ఫిబ్రవరిలో జరిగింది. రెండు కలిపి కొత్త ఏర్పాటు అయిన సంస్థలో 120 టీవీ ఛానెళ్లు, జియో సినిమా, డిస్నీ+ హాట్‌ స్టార్ అనే రెండు ఓటీటీ సంస్థలు ఉన్నాయి. ఇప్పటికే డిస్నీ స్టార్ ఇండియా సంస్థను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు అన్ని ఫార్మాలిటీస్ ను కంప్లీట్ చేసింది. రెగ్యులేటరీ పర్మిషన్స్ కూడా తీసుకున్నది. ఈ ఒప్పందం పూర్తి అయ్యాక  స్టార్-వయాకామ్ 18 రిలయన్స్ సంస్థ కంట్రోల్ లో ఉంటుంది.

Read Also:  అదిరిపోయే కెమెరా, సూపర్ డూపర్ ఫీచర్లు, రూ. 10 వేల లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!

Related News

Real Estate: సెకండ్ సేల్ ఫ్లాట్ కొంటున్నారా..ఇలా బేరం ఆడితే ధర భారీగా తగ్గించే ఛాన్స్..

BSNL Rs 1 Plan: వావ్ సూపర్.. రూ.1కే 30 రోజుల డేటా, కాల్స్.. BSNL ‘ఫ్రీడమ్ ఆఫర్’

Wholesale vs Retail: హోల్‌సేల్ vs రిటైల్ మార్కెట్.. ఏది బెటర్? ఎక్కడ కొనాలి?

Salary Hike: అటు ఉద్యోగుల తొలగింపు, ఇటు జీతాల పెంపు.. TCSతో మామూలుగా ఉండదు

Gold Rate: వామ్మో.. దడ పుట్టిస్తున్న బంగారం ధరలు.. రికార్డ్ బ్రేక్.

D-Mart: డి-మార్ట్ లోనే కాదు, ఈ స్టోర్లలోనూ చీప్ గా సరుకులు కొనుగోలు చెయ్యొచ్చు!

Big Stories

×