BigTV English

Ola First Electric Bike: ఓలా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్.. ఆగస్టు 15న లాంచ్.. ఫీచర్లు సూపర్!

Ola First Electric Bike: ఓలా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్.. ఆగస్టు 15న లాంచ్.. ఫీచర్లు సూపర్!

Ola First Electric Bike: దేశ వ్యాప్తంగా ఉన్న టూవీలర్ కంపెనీలు రవాణా రంగాన్ని పర్యావరణ అనుకూల వ్యవస్థగా మార్చేందుకు సిద్ధమయ్యాయి. ఈవీ రంగంపై  ఫోకస్ చేసి అనేక బైకులు, స్కూటర్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయనుంది. ఓలా తన తన తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను ఆగస్టు 15న తీసుకురానుంది.


అయితే బుకింగ్, డెలివరీలు తర్వాత ప్రారంభించవచ్చు. కంపెనీ తాజాగా అఫిషియల్  టీజర్ విడుదల చేసింది.  ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ తన అధికారిక X ప్లాట్‌ఫామ్‌లో దాని టీజర్ వీడియోను షేర్ చేశారు. ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ షేర్ చేసిన ఈ చిన్న వీడియోలో బైక్ డిజైన్ గురించి పెద్దగా తెలియనప్పటికీ కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవచ్చు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

Also Read: Bajaj Chetak Sales: చితక్కొట్టిన చేతక్.. సేల్స్‌లో రికార్డులే రికార్డులు!


Ola First Electric Bike Design
ఓలా ఎలక్ట్రిక్ కొత్త బైక్ నేక్డ్ మోటార్‌సైకిల్‌గా కనిపిస్తుంది. ఇది పట్టణ డ్రైవింగ్‌కు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. అదనంగా బైక్‌పై ఫుట్‌రెస్ట్‌లు కొద్దిగా ముందుకు ఉంటాయి (మిడ్-సెట్ ఫుట్‌పెగ్‌లు), హ్యాండిల్‌బార్ వెడల్పుగా ఉంటుంది. రాబోయే Ola ఎలక్ట్రిక్ బైక్ స్పోర్టి రైడింగ్ పొజిషన్‌ను కలిగి ఉంటుంది. రైడింగ్ పొజిషన్ యమహా ఎఫ్‌జెడ్ సెగ్మెంట్ బైక్‌లను పోలి ఉంటుంది.

Ola First Electric Bike Features
ఓలా ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్లలో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుకవైపు మోనో-షాక్ ఉంటాయి. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆల్-ఎల్‌ఈడీ లైటింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. బైక్‌లో మందపాటి టైర్లను అందించలేదు. దీని కారణంగా దాని రేంజ్ పెరిగే అవకాశం ఉంది. ఇది 4kWh నుండి 6kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది 180km నుండి 280km డ్రైవింగ్ రేంజ్ అందిస్తోంది. ఇది దేశంలోని 150cc, 160cc బైక్‌లతో పోటీపడగలదు. దాదాపు 130km/h వేగాన్ని అందుకోగలదు.

Ola First Electric Bike Price
ఓలా ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ ధర గురించి మాట్లాడినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ మొదటి బైక్ ధర రూ. 2 లక్షల కంటే తక్కువ ఉంటుంది. అదనంగా ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ నుండి కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్‌లను పొందొచ్చు. పండుగల సీజన్‌లో ఓలా ఎలక్ట్రిక్ ఈ కొత్త బైక్‌ను లాంచ్‌ చేసే అవకాశం ఉంది. బైక్ త్వరలోనే సేల్‌కు రానుంది.

Related News

Dasara Offers: ఫ్లిప్‌ కార్ట్ కళ్లు చెదిరే దసరా ఆఫర్లు, ఎథ్నిక్ వేర్ పై ఏకంగా 85 శాతం తగ్గింపు!

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Big Stories

×