BigTV English

Boda Kakarakaya: వర్షాకాలంలో దొరికే బోడ కాకరకాయతో ఆరోగ్యానికి నమ్మలేని ప్రయోజనాలు..

Boda Kakarakaya: వర్షాకాలంలో దొరికే బోడ కాకరకాయతో ఆరోగ్యానికి నమ్మలేని ప్రయోజనాలు..

Boda Kakarakaya: సీజన్‌ను బట్టి కూరగాయలు, పండ్లు లభిస్తుంటాయి. ఇలా సీజన్ బట్టి దొరికే కూరగాయలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో మాత్రమే దొరికే బోడ కాకరకాయలో చాలా పోషకాలు ఉంటాయి. ఈ సీజన్ లో దొరికే బోడకాకరకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. కేవలం కిలో బోడ కాకరకాయ రూ. 300 నుంచి రూ. 400గా పలుకుతుంది. చికెన్, మటన్ ధరల కంటే బోడ కాకరకాయకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీనిని కూర లేదా రసం చేసుకుని తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే బోడకాకరకాయ కేవలం ఆహారంగా మాత్రమే కాకుండా దీంతో ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి.


బోడ కాకరకాయలో ఉండే పోషకాలతో చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే విటమన్ సి, కె, ఏ వంటి పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యతో బాధపడే వారికి కంట్రెల్‌లో ఉంచుతోంది. అంతేకాదు చర్మ సౌందర్యానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ముఖంపై మొటిమలు, మచ్చలు వంటి చాలా రకాల సమస్యలను తొలగించేందుకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారికి కూడా బోడకాకరకాయ సహాయపడుతుంది. బరువు తగ్గాలని చూసే వారు ఆహారంలో బోడకాకరకాయను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వర్షాకాలంలో సాధారణంగా జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఈ తరుణంలో బోడకాకరకాయను తీసుకోవడం వల్ల రక్షణనిస్తుంది.


తలనొప్పితో బాధపడేవారికి కూడా ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు బోడకాకరకాయను తీసుకుంటే ఇందులో ఉండే ఫైబర్ కారణంగా మేలు చేస్తుంది. క్యాన్సర్ వంటి సమస్య ఉంటే ఫ్రీ రాడికల్స్ ను తొలగించేందుకు బోడ కాకరకాయ సహాయపడుతుంది. బోడ కాకరకాయలో ఉండే బీటా కెరోటిన్, జాంక్సెథిన్, లుటీన్, ఫ్లెవోనైట్ వంటి పోషకాలు చర్మాన్ని కూడా ముడతలు రాకుండా, వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండేలా చూస్తాయి.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×