E-Paper
Advertisement

EPF Withdrawal : పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!

EPF Withdrawal : పీఎఫ్ ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement

EPF Withdrawal : ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ఈ పీఎఫ్ ఉండాలి. ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెల కంట్రిబూషన్ కూడా కట్ అవుతుంది. అది ఉద్యోగి పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా బలపడేందుకు పీఎఫ్‌లో పెట్టుబడి పెడతారు. పీఎఫ్ అనేది ఒక రకమైన ఫండ్. ఉద్యోగితో పాటు కంపెనీ ఇద్దరూ ఇందులో పెట్టుబడి పెడతారు. పీఎఫ్ ఫండ్ మెచ్యూర్ అయినప్పుడు ఉద్యోగి మొత్తం నెలవారీ పెన్షన్ ప్రయోజనాన్ని పొందుతాడు.

కానీ, ఉద్యోగి అనారోగ్యం లేదా ఇల్లు నిర్మించడం వంటి ప్రయోజనాల కోసం మెచ్యూరిటీకి ముందే పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును తీసుకోవచ్చు. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలి. అయితే మనలో చాలా మంది ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రా పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలియదు. పీఎఫ్ ఖాతా నుంచి విత్‌డ్రా పన్నుకు సంబంధించిన నిబంధనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి.

Advertisement

Also Read : పీఎం కిసాన్ యోజన.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు!

ఒక ఉద్యోగి వరుసగా 5 సంవత్సరాలు ఈపీఎఫ్‌కి విరాళం ఇస్తే అతను పీఎఫ్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవడంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ 5 సంవత్సరాలలో పీఎఫ్ హోల్డర్ ఒక కంపెనీలో లేదా ఒకటి కంటే ఎక్కువ కంపెనీలలో పని చేసారా అనేది కూడా పట్టింపు ఉండదు.

Advertisement

ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ సభ్యుడు ఉద్యోగం నుంచి బయటకు వచ్చినప్పుడు అతను ఒక నెలలో పీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తంలో 75 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. సభ్యుడు 2 నెలలకు పైగా నిరుద్యోగిగా ఉంటే అతను పీఎఫ్ ఖాతా నుంచి మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాలో జమ చేయబడిన మొత్తంలో 4 భాగాలు ఉంటాయి. ఉద్యోగి కంట్రిబూషన్, యజమాని కంట్రిబూషన్, యజమాని కంట్రిబూషన్‌పై వడ్డీ, ఉద్యోగి కంట్రిబూషన్‌పై వడ్డీ. నాలుగు వడ్డీలు కూడా పన్ను పరిధిలోకి వస్తాయి.

ఉద్యోగి తన కంట్రిబ్యూషన్‌పై ఆదాయపు పన్ను చట్టం 1961లోని 80C కింద పన్ను మినహాయింపును పొందినట్లయితే పీఎఫ్ సహకారం జీతంలో భాగంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో ఉద్యోగి 80C కింద పన్ను మినహాయింపును పొందకపోతే ఆ సహకారం పన్ను నెట్‌లో చేర్చబడదు. అయితే ఉద్యోగి చేసిన సహకారం, దానిపై పొందిన వడ్డీ అతని జీతంలో భాగంగా పరిగణించబడుతుంది. కంట్రిబ్యూషన్‌పై వచ్చే వడ్డీ ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం కిందకు వస్తుంది.

మీరు పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకున్నప్పుడు సంవత్సరంలో పీఎఫ్ విత్‌డ్రాపై పన్ను విధించబడుతుంది. మీరు 5 సంవత్సరాల కంటే ముందు పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేస్తే మీరు పన్ను చెల్లించాలి. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇది పన్ను మినహాయింపు ఉంటుంది. ఉద్యోగి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతే అటువంటి పరిస్థితిలో పీఎఫ్ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేయడంపై పన్ను ఉండదు. ఇది పూర్తిగా పన్ను మినహాయింపు.

Also Read : అల్ట్రావయోలెట్ మ్యాక్ 2 బుకింగ్స్ స్టార్ట్.. ఈ బైక్ రెండు ట్రక్కులను లాగగలదు!

ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతాను పాన్ కార్డ్‌కి లింక్ చేసినట్లయితే, అప్పుడు 10 శాతం TDS చెల్లించాలి. పీఎఫ్ ఖాతాలో పాన్ నంబర్ అందుబాటులో లేకుంటే గరిష్ట మార్జిన్ రేటు/34.608 శాతం ప్రకారం TDA చెల్లించాలి. ఈపీఎఫ్‌లో డిపాజిట్ రూ. 50,000 కంటే తక్కువగా ఉంటే దానిపై TDS చెల్లించాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు ఫారమ్ 15G లేదా 15Hని సమర్పించడం ద్వారా TDSని ఆదా చేసుకోవచ్చు.

Tags

Related News

స్టాక్‌మార్కెట్‌లో బ్లాక్ మండే.. కొంప ముంచిన ఆ రంగాల షేర్లు, 4 లక్షల కోట్ల సంపద ఆవిరి

భారీ ఖర్చు చేశాక పెళ్లి వాయిదా లేదా రద్దు అయిందా.. ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ ఉందిగా

ఆస్తులు బోలెడున్నా చేతిలో నగదు ఉండదు.. రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక కష్టాలను నివారించడానికి ఇలా చేయండి

పెళ్లిలో లభించిన బహుమతులుపై ట్యాక్స్ కట్టాలా? ఆదాయపు పన్ను నిబంధనలు ఇవే..

ఎన్ని ఈఎంఐలు చెల్లించకపోతే ఇల్లు సీజ్ చేస్తారు? బ్యాంకు రూల్స్ ఏం చెబుతున్నాయ్!

అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

అవినీతి ఆరోపణలపై ఉద్యోగి తొలగింపు.. పెన్షన్ కోసం 37 ఏళ్ల పోరాటం.. మరణం తరువాత న్యాయం

జీతం చేతికి రాగానే ఖర్చయిపోతోందా? ఈ 9 చిన్న మార్పులతో.. భారీగా డబ్బులు ఆదా!

Big Stories

Advertisement
×