Big Stories

Ultraviolette F77 Mach 2 : అల్ట్రావయోలెట్ మ్యాక్ 2 బుకింగ్స్ స్టార్ట్.. ఈ బైక్ రెండు ట్రక్కులను లాగగలదు!

Ultraviolette F77 Mach 2 : బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఎఫ్77 మ్యాక్ 2ని దేశంలో విడుదల చేసింది. ఇది F77 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా కంపెనీ వెల్లడించింది. ఈ బైకులో పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ ఇంజన్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఏకకాలంలో రెండు ట్రక్కులను లాగగలదని కంపెనీ పేర్కొంది. ఈ ఇ-బైక్ చాలా స్పోర్టి డిజైన్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఎలక్ట్రిక్ బైక్. ఈ బైక్ ధర, ఫీచర్లు, తదితర విషయాల గురించి తెలుసుకోండి.

- Advertisement -

కంపెనీ F77 ప్రామాణిక మోడల్‌లో 27kW మోటార్‌ను ఇన్‌స్టాల్ చేసింది. అయితే Reconలో 30kW మోటార్ ఉపయోగించారు. ఈ ఇ-బైక్‌లో స్టాండర్డ్ మోడల్‌లో 7.1kWh కెపాసిటీ బ్యాటరీ ఉంది. రీకాన్‌లో 10.3kWh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఇది ఇప్పటివరకు టూ-వీలర్‌లో ఇన్‌స్టాల్ చేయని అతిపెద్ద బ్యాటరీ. ఈ బ్యాటరీ‌తో ఈ -బైక్ 323కిమీల ఛార్జ్ రేంజ్ అందిస్తుంది. ఈ  బైక్‌లోని పవర్‌ఫుల్ ఇంజన్ కారణంగా కేవలం 7 సెకన్లలో 100 kmph వేగాన్ని అందుకుంటుంది.

- Advertisement -

Also Read : ఓ మాస్టారు ఇది విన్నారా.. ఈ బైక్‌కి క్లచ్ ఉండదంటా!

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో పవర్‌ఫుల్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో మూడు రైడ్ మోడ్‌‌లు ఉన్నాయి.  5-అంగుళాల TFT డిస్‌ప్లే, ఆటో డిమ్మింగ్ హెడ్‌లైట్ హిల్ హోల్డ్, ABS, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ముఖ్యమైన ఫీచర్లు బైక్‌లో అందించబడ్డాయి.

బైక్‌లో USD ఫ్రంట్ ఫోర్క్‌తో ప్రీ లోడ్ అడ్జస్ట్‌మెంట్, వెనుక మోనోషాక్, 320mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ బైక్‌ను 1,00,000 కిలోమీటర్లు నడిపినప్పటికీ, దాని బ్యాటరీ 95 శాతం వరకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. అదే సమయంలో ఈ ఇ-బైక్ 15,000 కిలోల బరువును కూడా లాగగలదు. కొన్ని నెలల క్రితం ఈ బైక్‌ను రెండు ట్రక్కులను కలిపి లాగడం ద్వారా దాని టోయింగ్ కెపాసిటీని పరీక్షించారు.

Also Read : మీరు సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటే.. టాప్ 5 ఇవే

Ultraviolette F77 Mach 2 స్టాండర్డ్, రీకాన్ అనే రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. దీని ధర రూ. 2.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే ఈ ధర మొదటి 1000 మంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని తర్వాత బైక్ ధర రూ.3,99,000 వరకు పెరుగుతుంది. కస్టమర్లు ఈ బైక్‌ను 9 రకాల కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. F77 మ్యాక్ 2 డిజైన్ దాని ముందు వెర్షన్ నుండి తీసుకోబడింది. అయితే బైక్ బ్యాటరీ, భాగాలు అనేక భాగాలను కొత్తగా రూపొందించారు.  ఈ-బైక్ బుకింగ్ ఈ ఏప్రిల్ 24న కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతుంది. ఇక్కడ దీనిని రూ. 5,000తో బుక్ చేసుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News