E-Paper
Advertisement

కొత్తగా హోంలోన్ తీసుకుంటున్నారా? ఈ రూల్ ఫాలో అవ్వండి?

కొత్తగా హోంలోన్ తీసుకుంటున్నారా? ఈ రూల్ ఫాలో అవ్వండి?
Advertisement

Home Loan Rule: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. సామాన్యులు లోన్ లేకుండా సొంతిల్లు కట్టుకోవడం చాలా వరకు అసాధ్యం. పక్కా ప్లానింగ్ లేకుండా ముందుకెళ్తే అప్పుల ఊబిలో చిక్కుకునే సమస్య ఉంది. అందుకే ఆర్థిక నిపుణులు హోంలోన్ విషయంలో 3/20/30/40 రూల్‌ పాటించాలని సూచిస్తున్నారు. 1980-90లలో మోర్టగేజ్‌ సెక్టార్ లో ఈ రూల్ ఫాలో అయ్యేవారు. ఆర్థిక రంగంలో వచ్చిన మార్పులతో ఈ రూల్ ఓల్డ్ అయింది. కానీ సామాన్యులకు మాత్రం ఉపయోగపడుతుంది. 3/20/30/40 రూల్‌ ఫాలో అయితే చిన్న ఇల్లే కట్టుకోవచ్చు కానీ, అందులో ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా గడిపే అవకాశం ఉంది. ఇంటి కోసం చేసిన అప్పు మీకు భారం కాకుండా ఉంటుంది.

3 – మీ ఇంటి మొత్తం ఖర్చు

మీ ఇంటి ఖర్చు వార్షిక ఆదాయానికి మూడు రెట్లకు మించకూడదు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఏడాదికి రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడనుకుందాం. అతడు కట్టుకునే ఇంటి ఖర్చు రూ.15 లక్షలకు మించొద్దు. ఇంత తక్కువ ఖర్చులో పట్టణాలు, నగరాల్లో ఇల్లు కట్టడం లేదా కొనుగోలు చేయడం అసాధ్యమే. అలాంటప్పుడు మీ సేవింగ్స్ లేదా ఏదైనా ఆస్తులు, షేర్లు ఉంటే వాటిని అమ్మి ఇంటిని నిర్మించుకుంటే బెటర్. మీరు ఇల్లు కొంటున్న లేదా కట్టుకుంటున్న ప్లేస్ లో ఆస్తి విలువ ఎంతో ఎంక్వైరీ చేసి ముందుకెళ్లాలి.

20 – లోన్ పీరియడ్

Advertisement

హోంలోన్ తిరిగి చెల్లించే వ్యవధి 20 ఏళ్లకు మించకూడదు. లోన్ పీరియడ్ తగ్గితే.. బ్యాంకుకు కట్టే వడ్డీ మొత్తం కూడా తగ్గుతుంది. కానీ ఈఎంఐ పెరుగుతుంది. టైమ్ పీరియడ్ ఎక్కువ కాలం పెట్టుకుంటే ఈఎంఐ తక్కువ ఉండొచ్చు కానీ తిరిగి చెల్లించే మొత్తం ఎక్కువ అవుతుంది. ఈఎంఐలోని కాస్త అమౌంట్ స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేసి ఎక్కువ సంపాందించగలిగితే తప్ప.. మిగిలిన సందర్భాల్లో లోన్ పీరియడ్ ను 20 ఏళ్లు మించకుండా చూసుకోవాలి.

30- ఈఎంఐ మొత్తం

ఈఎంఐల మొత్తాన్ని రూల్‌లోని మూడో నెంబర్ 30తో సూచిస్తుంది. ఏడాదికి మీరు చెల్లించే ఈఎంఐ వార్షిక ఆదాయంలో 30 శాతాన్ని మించకూడదు. ఉదాహరణకు మీరు ఏటా రూ.5 లక్షలు సంపాదిస్తున్నారనుకుందాం. మీ అన్ని లోన్ల ఈఎంఐల మొత్తం ఏడాదికి రూ.1,50,000 దాటొద్దు. అంటే మీ నెలవారీ ఈఎంఐల మొత్తం రూ.12,500 కంటే ఎక్కువ ఉండకూడదు.

Advertisement

Also Read:  హోం లోన్ కు ఇన్సూరెన్స్.. తీసుకోవాలా? వద్దా?

40- కనీస డౌన్‌పేమెంట్

ఇల్లు కొనేటప్పుడు లేదా కట్టేటప్పుడు మొత్తం ఖర్చులో 40 శాతం మీ సొంత డబ్బు అయితే మేలు. పూర్తిగా లోన్ పై ఆధారపడితే.. లాంగ్ టర్మ్ లో భారం కావచ్చు. లోన్ తక్కువగా ఉంటే..త్వరగా తీరిపోతుంది. సొంతింటి కల తక్కువ టైంలో నెరవేరుతుంది.

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×