E-Paper
Advertisement

Porsche Macan EV Two New Variants: భారత్‌లో పోర్స్చే కొత్త ఎలక్ట్రిక్ కార్లు లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ వివరాలివే..!

Porsche Macan EV Two New Variants: భారత్‌లో పోర్స్చే కొత్త ఎలక్ట్రిక్ కార్లు లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ వివరాలివే..!
Advertisement

Porsche Macan EV Two New Variants: దేశీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. అందువల్లనే ప్రముఖ కంపెనీలు సైతం స్టైలిష్ లుక్ అండ్ అదిరిపోయే ఫీచర్లతో కొత్త కొత్త వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. అందులో ఎలక్ట్రాక్ కార్లకు ప్రత్యేక డిమాండ్ ఉంది. అందుల్లనే ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్‌లో కొత్త కార్లు లాంచ్ అవుతూ ఉంటాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీ పోర్స్చే దేశీయ మార్కెట్‌లో కొత్త కార్‌ను లాంచ్ చేసింది.

మకాన్ ఎలక్ట్రాక్ వెహికల్‌లోని రెండు కొత్త వేరియంట్లను లాంచ్ చేసింది. ఈ రెండు వేరియంట్లలో ఒకటి రియర్ వీల్ డ్రైవ్ మకాన్ ఎలక్ట్రి వెహికల్. ఇది దాదాపు రూ.1.23 కోట్లు, అలాగే మరొకటి మకాన్ ఎలక్ట్రిక్ వెహికల్ 4ఎస్ వేరియంట్. దీని ధరను దాదాపు రూ.1.39 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. అలాగే దీనితో మరో వేరియంట్ కూడా ఉంది. అదే మకాన్ ఈవీ టర్బో వేరియంట్. కంపెనీ ఈ వేరియంట్‌ ధరను రూ.1.65 కోట్ల నుంచి రూ.1.69 కోట్లు పెంచింది. కాగా పోర్స్చే మకాన్ బేస్ వేరియంట్ సింగిలి రియర్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంటుంది.

Advertisement

Also Read: మైలేజీ కింగ్.. 30 కి.మీ మైలేజీ ఇచ్చే మారుతి ఎస్యూవీ ఇదే.. ఆరు ఎయిర్‌బ్యాగ్స్ కూడా..!

ఈ ఎలక్ట్రిక్ మోటార్ 360 హార్స్ పవర్, 563 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుందని కంపెనీ తెలిపింది. కాగా ఈ వెహికల్ టాప్ స్పీడ్ గంటకు 220 కి.మీ అందిస్తుంది. ఇక పోర్స్చే మిడ్ లెవెల్ వేరియంట్ మకాన్ 4ఎస్ ఎలక్ట్రిక్ కార్ రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లను కలిగి ఉంటుంది. ఇది 516 హార్స్ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు 4.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుందని కంపెనీ తెలిపింది. అయితే ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 240 కి.మీ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Advertisement

ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు స్లేట్ గ్రే నియో కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. ఇది ఆప్షనల్ 20 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. ఇకపోతే పోర్స్చే మకాన్‌ వేరియంట్లు అన్నీ 100 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలోనే వస్తాయి. దీని ప్రకారం.. టాప్ వేరియంట్ మకాన్ టర్బో ఈవీ సింగిల్ ఛార్జింగ్‌పై దాదాపు 591 కి.మీ మైలేజీ అందిస్తుంది. అలాగే మకాన్ 4ఎస్ ఈవీ సింగిల్ ఛార్జింగ్‌పై 606 కి.మీ మైలేజీ అందిస్తుంది. అలాగే దీని బేస్ వేరియంట్ సింగిల్ ఛార్జింగ్‌తో 641 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇందులో అత్యాధునిక ఫీచర్లు అందించినట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఈ కారు స్టైలిష్ లుక్‌లో వాహన ప్రియులను బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఇది మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఆడి క్యూ 8, బీఎండబ్ల్యూ ఐఎక్స్, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ కార్లకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

Tags

Related News

చైనా యువకుడి అద్భుత ఆలోచన.. నెలకు రూ.14 లక్షల ఆదాయం, వ్యాపారం ఏంటో తెలుసా?

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

Big Stories

Advertisement
×