BigTV English

Maruti Suzuki Grand Vitara Mileage: మైలేజీ కింగ్.. 30 కి.మీ మైలేజీ ఇచ్చే మారుతి ఎస్యూవీ ఇదే.. ఆరు ఎయిర్‌బ్యాగ్స్ కూడా..!

Maruti Suzuki Grand Vitara Mileage: మైలేజీ కింగ్.. 30 కి.మీ మైలేజీ ఇచ్చే మారుతి ఎస్యూవీ ఇదే.. ఆరు ఎయిర్‌బ్యాగ్స్ కూడా..!

Maruti Suzuki Grand Vitara Mileage: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకికి దేశీయ మార్కెట్‌లో ఎంతటి పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కంపెనీ కార్లు సామాన్యులకు ఒక వరం. అలాగే బడా బాబులకు కూడా ఈ కంపెనీ అదిరిపోయే కార్లను అందిస్తుంది. ఆర్థిక స్థోమతకు తగ్గట్టుగా కొత్త కొత్త కార్లను రిలీజ్ చేస్తూ వాహన ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఆటో మొబైల్ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీల్లో మారుతి సుజుకి ముందు వరుసలో ఉంటుంది. అయితే ఈ కంపెనీ కార్లలో అత్యధిక మైలేజ్ ఇచ్చే మోడళ్లలో మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఒకటి.


మారుతి సుజుకి గ్రాండ్ విటారా సెప్టెంబర్ 2022లో భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఇది మిడ్ సైజ్‌లో అందించబడే శక్తివంతమైన హైబ్రిడ్ SUVగా పేరుగాంచింది. ఈ గ్రాండ్ విటారా అనేది టయోటాకి చెందిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ మాదిరి ఉంటుంది. ఈ గ్రాండ్ విటారా మోడళ్‌లో 1.5 లీటర్ 4-సిలిండర్ మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌ను అందించారు. అందువల్ల దీని హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కారణంగా.. ఈ SUV సుమారు 30 కి.మీ బలమైన మైలేజీని అందిస్తుందని కంపెనీ చెబుతుంది.

ఈ మైలేజీ దూర ప్రయాణాలు ఇష్టపడేవారికి చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇక మారుతి గ్రాండ్ విటారా ధర, వేరియంట్ల విషయానికొస్తే.. మారుతి గ్రాండ్ విటారా కాంపాక్ట్ SUV రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది సిగ్మా, డెల్టా, జీటా, జీటా+, ఆల్ఫా, ఆల్ఫా+ వంటి మొత్తం ఆరు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. దీని ప్లస్ ట్రిమ్‌లు బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఎంపికతో అందుబాటులో ఉన్నాయి. అలాగే డెల్టా, జీటా ట్రిమ్‌ల మాన్యువల్ వేరియంట్‌లు ఇప్పుడు CNG ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే మారుతి గ్రాండ్ విటారా ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీంతోపాటు డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.


Also Read: ఏంది మామ ఈ క్రేజ్.. ఈ కారును ఏంటి ఇలా కొంటున్నారు.. అసలు కథ ఇదేనేమో!

ఈ వెహికల్‌లో మొత్తం 6 ఎయిర్‌బ్యాగ్‌లు అందించారు. అందువల్ల ఈ ఎయిర్‌బ్యాగ్‌లు ప్రమాద సమయంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), EBDతో కూడిన ABS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది కాకుండా ఇందులో 360-డిగ్రీ కెమెరా, హిల్ డీసెంట్ కంట్రోల్, ISOFIX చైల్డ్-సీట్ యాంకర్‌లను కూడా కలిగి ఉంది. ఇకపోతే హైబ్రిడ్ కార్ల విషయానికొస్తే.. ఈ హైబ్రిడ్ కార్లు ఎక్కువ మైలేజీని ఇస్తాయి.

ఈ హైబ్రిడ్ కార్లు పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటాయి. అదీకాకపోతే పై రెండు వ్యవస్థలు వాహనాన్ని నడపడానికి కలిసి పని చేస్తాయి. అయితే కొన్నిసార్లు ఈ కార్లు ఎలక్ట్రిక్ మోటారుపై మాత్రమే నడుస్తాయి. అందువల్ల అలాంటి సమయంలో దీని ప్రయాణానికి తక్కువ ఇంధనం అవుతుంది. ఇక హైబ్రిడ్ టెక్నాలజీ విషయానికొస్తే.. ఈ టెక్నాలజీలో (ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మినహా), బ్యాటరీ (ఎలక్ట్రిక్ మోటారును నడుపుతుంది) ఇంటర్నల్ సిస్టమ్ నుండి ఛార్జ్ చేయబడుతుంది. అందువల్ల బ్యాటరీకి ప్రత్యేక ఛార్జింగ్ అవసరం లేదు. అందువల్ల మంచి మైలేజీ కార్‌కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇది చాలా బెటర్ అని చెప్పొచ్చు.

Tags

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×