E-Paper
Advertisement

Paytm-RBI: పేటీఎంకు రిలీఫ్.. మార్చి 15వరకు లావాదేవీలకు ఒకే చెప్పిన ఆర్బీఐ..

Paytm-RBI: పేటీఎంకు రిలీఫ్.. మార్చి 15వరకు లావాదేవీలకు ఒకే చెప్పిన ఆర్బీఐ..
Advertisement
Paytm-RBI

Paytm-RBI (india today news):

పేటీఎంకు ఆర్బీఐ రిలీఫ్ ఇచ్చింది. మార్చి 15 వరకు లావాదేవీలకు కొనసాగించేందుకు కొంతకాలం వరకు సడలింపును ఇచ్చింది. పేటీఎమ్ కస్టమర్ల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై విధించిన నిషేధాన్ని మార్చి 15కు సడలించినట్లు ఆర్బీఐ ప్రకటించింది.

Advertisement

క‌స్ట‌మ‌ర్ ఖాతాలపై టాప‌ప్, క్రెడిట్ లావాదేవీలు, డిపాజిట్ల సేక‌ర‌ణ‌, వాలెట్లు, ఫాస్టాగ్ ఖాతాల నిర్వ‌హ‌ణ నిలిపివేత గ‌డువును ఆర్బీఐ పొడగించింది. మ‌ర్చంట్ల‌తోపాటు క‌స్ట‌మ‌ర్ల ప్ర‌యోజనాల‌ను దృష్టిలో పెట్టుకుని 15 రోజుల గ‌డువు పెంచిన‌ట్లు ఆర్బీఐ ప్రకటించింది.

ఈ నెల 29 త‌ర్వాత ఖాతాదారుల నుంచి డిపాజిట్ల సేక‌ర‌ణ‌,టాప‌ప్ రుణాలు, క్రెడిట్ లావాదేవీలు, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌, వాలెట్లు, ఫాస్టాగ్ ఖాతాలు, నేష‌న‌ల్ కామ‌న్ మొబిలిటీ కార్డుల లావాదేవీలు నిర్వ‌హించొద్ద‌ని ఆర్బీఐ గ‌త నెల 31న పీపీబీఎల్‌ను ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌జ‌ల విశాల ప్ర‌యోజ‌నాల దృష్ట్యా మ‌ర్చంట్ల‌తోపాటు ఖాతాదారుల‌కు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయ‌డానికి పేటీఎం మ‌రికొంత స‌మ‌యం కేటాయించాలని నిర్ణ‌యించిన‌ట్లు ఆర్బీఐ తెలియజేసింది. పీపీబీఎల్ కస్టమర్లు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా నగదు విత్ డ్రా చేసుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.

Advertisement

పేటీఎం వాలెట్లు, పేమెంట్స్ ద్వారా రూ.కోట్లలో మోసపూరిత లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలను ఎదుర్కొంది. దీనిపై బయటి ఆడిటర్లు ఇచ్చిన అడిట్ నివేదిక ఆధారంగా పేటీఎం అనుబంధ పీపీబీఎల్ పై చర్యలు తీసుకున్నది. పీపీబీఎల్‌లో పర్యవేక్షణా లోపాలు ఉన్నాయని తేలడంతోనే దానిపై మరింత రెగ్యులేటరీ చర్యలు చేపట్టాల్సి వచ్చిందని ఆర్బీఐ వివరించింది.

Tags

Related News

ఇల్లు కొనే వారికి గుడ్ న్యూస్.. మార్కెటింగ్ పేరుతో మోసం చేసే బిల్డర్లను హెచ్చరించిన సుప్రీంకోర్టు

SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ATM నిబంధనలో మార్పు, శాలరీ ఖాతాదారులైతే..

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

Big Stories

Advertisement
×