BigTV English

Finger Nails : పొడవాటి గోళ్లు అంటే ఇష్టమా.. షాకింగ్ నిజాలు..!

Finger Nails : పొడవాటి గోళ్లు అంటే ఇష్టమా.. షాకింగ్ నిజాలు..!
Finger Nails Health

Finger Nails Health (health news today):


పొడవాటి గోళ్లు పెంచుకోవడం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. అది ముఖ్యంగా అమ్మాయిల అందంగా ట్రెండీగా కనిపించేందుకు గోళ్లను పొడవుగా పెంచుకుంటారు. కానీ పొడవాటి గోళ్లను పెంచడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనిషి పొడవైన గోళ్ల కింద 32 రకాల బ్యాక్టీరియాలు, 28 కంటే ఎక్కువ ఫంగస్ జాతులు వృద్ధి చెందుతాయని చెబుతున్నారు.

అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ డీసీకి చెందిన శాస్త్రవేత్తలు గోళ్లపై జరిపిన పరిశోధనల ప్రకారం.. పొడవాటి గోళ్లలో స్టాఫ్ ఆరియస్ అనే బ్యాక్టీరియా గుర్తించారు. ఇది స్కిన్ ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాగా తేలింది. ఈ బ్యాక్టీరియా కేవలం గోరు కింద మాత్రమే ఉంటుంది. పొడవాటి గోళ్లతో వస్తువులను తాకడం వల్ల ఈ బ్యాక్టీరియా గోళ్ల కిందకు చేరుతుంది.


Read More :  రెండు తమలపాకులు నమిలితే..!

గోళ్ల కింద ఉండే బ్యాక్టీరియా మరియు ఫంగస్‌లను కంటితో చూడలేము. కాబట్టి తెలియని ప్రమాదం పొవడాటి గోళ్ల కింద ఉందని గుర్తుంచుకోవాలి. మనల్ని మనం అప్రమత్తం చేసుకోవాలి. అమెరికా శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో ఈ ప్రమాదం గురించి అప్రమత్తం చేశారు.

గోళ్లలోకి బ్యాక్టీరియా మరియు ఫంగస్‌లు ఎలా వ్యాపిస్తాయి. ఏ రకమైన గోర్లు ప్రమాదాన్ని పెంచుతాయి? ఏ లక్షణాల గురించి అప్రమత్తం అవ్వాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

మనం రోజు మొత్తంలో మన చేతులను ఎక్కువగా ఉపయోగిస్తాము. వాటితో మన శరీర భాగాలను తాకుతాము. కానీ మీ అందమైన గోళ్ల క్రింద లక్షలాది సూక్ష్మ జీవులు నివసిస్తాయి. గోళ్ల కింద 32 రకాల బాక్టీరియా, 28 రకాల ఫంగస్‌లు ఉన్నాయని ఓ పరిశోధనలో వెల్లడైంది.

ఈ పరిశోధన 2021లో జరిగింది. అమెరికన్ పాడియాట్రిక్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో కూడా ముద్రించపడింది. పరిశోధకులు కొందరి గోళ్ల కింద నుంచి శాంపిల్స్ తీసుకుని వాటిని పరిశీలించగా అందులో 32 రకాల బ్యాక్టీరియా, 28 రకాల ఫంగస్‌లు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 50 శాతం నమూనాలలో బ్యాక్టీరియా, 6.3 శాతం ఫంగస్‌లు ఉన్నాయి. 43.7 శాతం బ్యాక్టీరియా మరియు ఫంగస్‌ల మిశ్రమ సమూహాన్ని కలిగి ఉంది.

Read More : వావ్.. గాలి నుంచి నీరు తీస్తున్నారు..!

గోళ్ల కింద ఉండే బ్యాక్టీరియా, ఫంగస్‌లు హానిచేయవని పరిశోధకులు చెబుతున్నారు. అయితే.. కొన్ని సందర్భాల్లో ఈ సూక్ష్మజీవులు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో లేదా గోళ్లలో ఏదైనా గాయమైన వారిలో ఇన్ఫెక్షన్‌‌కు కారణమవుతాయి. దీనివల్ల గోర్లు రంగు మారడం, వాపు, నొప్పి మరియు చీము కారడం వంటివి జరుగుతాయి.

గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం ఎలా..?

  • మీ చేతులు మరియు గోళ్లను సబ్బు లేదా నీటితో కనీసం రోజుకు రెండుసార్లు కడగాలి
  • గోళ్ల కింద మురికి పేరుకుపోకుండా ఉండేందుకు సాఫ్ట్ బ్రష్ ఉపయోగించడం మంచిది
  • పొడవాటి గోళ్లు ఉంచుకోవడం మానుకోండి
  • పొడవాటి గోళ్ల వల్ల ధూళి మరియు క్రిములు సులభంగా పేరుకుపోతాయి
  • గోళ్లను క్రమం తప్పకుండా కత్తిరించండి
  • గోళ్లలో ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా ఏదైనా అసాధారణత కనిపించినట్లయితే వైద్యుడిని సంప్రదించండి
  • గోళ్లలో దుమ్ము, బాక్టీరియా నివాసంగా మారకుండా వాటిని చిన్నగా ఉంచుకోండి

Disclaimer : ఈ కథనం మెడికల్ జర్నల్స్ ఆధారంగా రూపొందించబడింది.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×