E-Paper
Advertisement

ఆర్‌బీఐ కీలక అడుగు.. విదేశాల నుంచి 165 టన్నుల పసిడి రాక, దేశానికి మరింత బలం

ఆర్‌బీఐ కీలక అడుగు.. విదేశాల నుంచి 165 టన్నుల పసిడి రాక, దేశానికి మరింత బలం
Advertisement

RBI On Gold: ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తోంది ఆర్బీఐ. దీంతో విదేశాల్లో కొనుగోలు చేసిన బంగారాన్ని విడతల వారీగా దేశానికి తీసుకొస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి బంగారం ధర ఆకాశాన్ని తాకుతుందని ఆర్థిక నిపుణుల అంచనాల నేపథ్యంలో వేగంగా అడుగులు వేస్తోంది.

బంగారం విషయంలో ఆర్‌బీఐ కీలక అడుగు

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో దాదాపు 60 టన్నుల బంగారాన్ని దేశానికి తిరిగి తీసుకువచ్చింది ఆర్బీఐ. వచ్చిన బంగారంతో దేశీయంగా తన నిల్వల వాటా 84 శాతానికి పైగానే పెంచుకుంది. నవంబర్ 25న విడుదల చేసిన అర్ధ వార్షిక నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించింది ఆర్బీఐ. గతేడాది సెప్టెంబర్ నుంచి పరిశీలిస్తే ఏకంగా 165 టన్నుల బంగారాన్ని తీసుకొచ్చింది.

Advertisement

ఇటీవల కాలంలో ఆర్‌బిఐ వద్ద బంగారు నిల్వలు పెరిగాయి. మార్చి 2021లో 695.31 టన్నుల నుండి సెప్టెంబర్ 2026 నాటికి 880.52 టన్నులకు చేరింది. సుమారు 26.6 శాతం పెరుగుదలను సూచిస్తోంది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌, బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్మెంట్స్ వద్ద భారత్ కు చెందిన 140.39 టన్నుల బంగారం ఉంది. విదేశీ మారకద్రవ్య నిల్వల్లో గోల్డ్ వాటా గతేడాది సెప్టెంబర్‌లో 13.92 శాతం ఉండేది.

విదేశాల నుంచి 165 టన్నుల పసిడి రాక

ఈ ఏడాది మార్చి నాటికి 16.70 శాతానికి చేరింది. బంగారం ధరలు, ఇతర రిజర్వ్ ఆస్తుల విలువలో మార్పుల కారణంగా సెప్టెంబర్ 2026 నాటికి అది పాక్షికంగా 14.38 శాతానికి తగ్గింది.  2021 మార్చితో పోల్చితే.. ఆ సమయంలో ఆర్‌బిఐ వద్ద బంగారు నిల్వలు కేవలం 42.04 శాతం ఉంది. విదేశాల్లో 57.96 శాతం నిల్వ ఉన్నాయి. బంగారం నిల్వలు అధిక వాటాను స్వదేశంలో ఉంచుకోవడం వల్ల ఆర్‌బిఐకి వాటిపై ప్రత్యక్ష నియంత్రణ ఉంటుంది.

Advertisement

విదేశీ కస్టోడియన్లపై ఆధారపడటం తగ్గుతుంది. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ సమయంలో లభ్యత మెరుగుపడుతుంది. విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించి, రిజర్వ్ ఆస్తిపై నియంత్రణను బలోపేతం చేస్తుంది. బంగారాన్ని విదేశాలలో నిల్వ చేయడం భౌగోళిక వైవిధ్యాన్ని అందిస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది. కాకపోతే భద్రత-ద్రవ్యత తమ రిజర్వ్ నిర్వహణ వ్యూహం జంట లక్ష్యాలుగా ఉంటాయని ఆర్‌బిఐ మాట.

ALSO READ: టెక్కీలకు ఐబీఎం బిగ్ షాక్.. యూఎస్ వీసా స్పాన్సర్‌షిప్ బంద్! డెడ్‌లైన్ కూడా ఇచ్చేసింది

ప్రపంచంలోని టాప్- 10 బంగారు నిల్వదారులలో భారతదేశం ఒకటిగా ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నవంబర్ 2026 నివేదిక ప్రకారం.. దేశంలో సుమారు 881 టన్నుల అధికారిక బంగారు నిల్వలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అమెరికా- 8133 టన్నులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జర్మనీ-3349 టన్నులతో తర్వాతి స్థానంలో ఉంది. ఇటలీ-2452, ఫ్రాన్స్-2437, చైనా-2410, రష్యా-2264, స్విట్జర్లాండ్-1040 టన్నుల బంగారం ఉంది.

Related News

టెక్కీలకు ఐబీఎం బిగ్ షాక్.. యూఎస్ వీసా స్పాన్సర్‌షిప్ బంద్! డెడ్‌లైన్ కూడా ఇచ్చేసింది

ఈక్విటీ, బంగారం, డెట్‌… 10 లక్షల పెట్టుబడి ఎక్కడ పెట్టాలి ?

PPFపై లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా ? 5 సంవత్సరాల పాటు 1.5 లక్షలు జమ చేస్తే ఎంత తీసుకోవచ్చు ?

10 లక్షల ఇన్వెస్ట్మెంట్ తో కోటీశ్వరులు అవ్వడానికి ఎన్నేళ్ళు పడుతుందో తెలుసా ?

అటల్ పెన్షన్ స్కీమ్.. రూ.577 కడితే జీవితాంతం రూ.5,000 పెన్షన్.. నామినీకి రూ.8.5 లక్షలు!

20 సంవత్సరాలలో 2 కోట్లు సంపాదించాలంటే ప్రతి నెలా ఎంత SIP చేయాలి ?

ఇకపై మార్కెట్లోకి ప్రయోగశాలలో పెంచిన బంగారం… ల్యాబ్ గ్రోన్ గోల్డ్ అంటే ఏమిటి ?

Big Stories

Advertisement
×