Best wireless music system: ఇంట్లో రిలాక్స్ అవుతున్నప్పుడో.. లేదా వీకెండ్‌లో ఫ్రెండ్స్‌తో.. పార్టీ చేసుకుంటున్నప్పుడో.. మంచి మ్యూజిక్ ఉంటే ఆ వైబే వేరు. పాత కాలం నాటి పెద్ద పెద్ద వైర్లు, కేబుల్స్ గందర గోళం లేకుండా ఇప్పుడంతా..వైర్‌లెస్ మ్యూజిక్ సిస్టమ్స్ ట్రెండ్ నడుస్తోంది. ఒక్క క్లిక్‌తో.. మీ లివింగ్ రూమ్‌ను లైవ్ కన్సర్ట్ హాల్‌లా మార్చే, క్రిస్టల్ క్లియర్ సౌండ్, డీప్ బేస్ అందించే టాప్ 5 వైర్‌లెస్ మ్యూజిక్ సిస్టమ్స్, వాటి ధరల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఇళ్లలో ఇంటీరియర్ అందం చెడి పోకుండా నీట్‌గా ఉండాలంటే.. వైర్ లెస్ స్పీకర్లే బెస్ట్ ఛాయిస్. బ్లూటూత్, వై-ఫై కనెక్టివిటీతో..వచ్చే ఈ స్పీకర్లను ఫోన్, టీవీ లేదా ల్యాప్ టాప్‌కు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా.. వీటిని ఇంట్లోని ఏ రూమ్‌లోకైనా, బాల్కనీలోకైనా ఈజీగా మార్చుకునే వీలుంటుంది. మార్కెట్‌లో..అద్భుతమైన ఆడియో క్వాలిటీని అందిస్తున్న 5 బెస్ట్ మోడల్స్..
ఇంట్లోనే డిజే పార్టీ వైబ్ కోరుకునే వారికి.. జేబీఎల్ పార్టీ బాక్స్ 120 ఒక అద్భుతమైన ఆప్షన్. ఇందులో 160 వాట్ల పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్, ఏఐ సౌండ్ బూస్ట్ టెక్నాలజీ.. ఉండటం వల్ల వాల్యూమ్ పూర్తిగా పెంచినా సౌండ్ అస్సలు పగిలి పోదు. పాటల బీట్‌కు తగ్గట్టుగా..మారే లైట్ షో, మైక్, గిటార్ కనెక్ట్ చేసుకునే.. అవకాశం కూడా ఇందులో ఉన్నాయి. ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. 12 గంటల వరకు నాన్ స్టాప్ మ్యూజిక్ ప్లే అవుతుంది. దీని ధర సుమారు రూ.24,999 నుంచి రూ.27,999 మధ్య ఉంది.
సోనీ సిగ్నేచర్ బ్యాలెన్స్‌డ్ సౌండ్ , పవర్ ఫుల్ బేస్ ఇష్ట పడే..వారికి ఈ స్పీకర్ చక్కగా సరి పోతుంది. 240 వాట్ల ఆడియో పవర్‌తో ..పెద్ద రూమ్‌లకు సైతం తన సౌండ్‌తో ..నింపేస్తుంది. ఇందులో ఎక్స్-బ్యాలెన్స్‌డ్ స్పీకర్ యూనిట్ ఉండటం వల్ల వోకల్స్ చాలా స్పష్టంగా వినిపిస్తాయి. సుమారు 25 గంటల బ్యాటరీ లైఫ్, కరోకే ఫీచర్, టచ్ కంట్రోల్ ప్యానెల్ దీని ప్రత్యేకతలు. ఇండియన్ మార్కెట్‌లో దీని ధర సుమారు రూ.29,990గా అందుబాటులో ఉంది.
క్లాసిక్ రెట్రో లుక్‌తో పాటు రూమ్ షేక్ చేసే సౌండ్ కావాలనుకునే.. వారికి మార్షల్ స్టాన్‌మోర్ 3 బెస్ట్ ఛాయిస్. 80 వాట్ల స్టీరియో ఛానల్ అవుట్ పుట్‌తో..వచ్చే ఈ స్పీకర్ వైడ్ సౌండ్ స్టేజ్‌ను అందిస్తుంది. పైన ఉండే.. అనలాగ్ నాబ్స్ ద్వారా బేస్, ట్రెబుల్‌ను మన అభి రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లివింగ్ రూమ్ డెకరేషన్‌కు ఇది ఒక ప్రీమియం లుక్ తెస్తుంది. ఆన్‌లైన్, రిటైల్ స్టోర్లలో దీని ధర సుమారు రూ.37,999 నుంచి రూ.41,999 మధ్య ఉంది.
తక్కువ బడ్జెట్‌లో.. స్మార్ట్ ఫీచర్లతో కూడిన 360-డిగ్రీ స్పేషియల్ ఆడియో కావాలనుకునే.. వారికి ఎకో స్టూడియో అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో.. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ..ఉండటం వల్ల పాట వింటున్నప్పుడు మ్యూజిక్ నలు వైపుల నుంచి వినిపిస్తున్న ఫీల్ కలుగుతుంది. బిల్ట్-ఇన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ద్వారా.. కేవలం మాటతోనే.. పాటలు మార్చొచ్చు. దీని ప్రస్తుత ధర సుమారు రూ.23,999గా ఉంది.
Also Read: బిగ్ స్క్రీన్ మ్యాజిక్..ఇండియాలో హిసెన్స్ E7S మినీ ఎల్ఈడీ టీవీలు లాంచ్!
బడ్జెట్ ధరలోనే.. భారీ సౌండ్ కావాలనుకునే.. మ్యూజిక్ బోట్ పార్టీపాల్ 500 మంచి విలువను అందిస్తుంది. 200 వాట్ల పవర్‌ఫుల్ అవుట్ పుట్, వైబ్రెంట్ ఆర్జీబీ ఎల్ఈడీ లైట్లు.. వైర్ లెస్ కరోకే మైక్ సపోర్ట్‌తో.. ఇది వస్తుంది. బ్లూటూత్‌తో.. పాటు యూఎస్‌బీ, ఆక్స్, మెమరీ కార్డ్ ద్వారా కూడా పాటలు ప్లే చేసుకోవచ్చు. ఆఫర్లలో.. ఇది సుమారు రూ.11,999 నుంచి రూ.14,999 ధరలో ఈజీగా లభిస్తుంది.
వైర్ లెస్ మ్యూజిక్ సిస్టమ్ ఎంచుకునేటప్పుడు.. మీ రూమ్ పరిమాణాన్ని బట్టి వాటేజ్ ఎంచుకోవాలి. చిన్న బెడ్‌రూమ్‌లకు 60 నుంచి 100 వాట్లు సరి పోతుంది. కానీ.. పెద్ద హాల్ కోసం 150 వాట్లకు పైగా ఉన్న మోడల్స్ తీసుకోవడం బెస్ట్. అలాగే..లేటెస్ట్ బ్లూ టూత్ వెర్షన్ లేదా వై-ఫై సపోర్ట్ ఉంటే ఆడియో లాగ్ లేకుండా.. హై-క్వాలిటీ మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు.