E-Paper
Advertisement

కొలంబో స్కూల్ పిల్ల‌ల చేతిలో ఐపీఎల్ స్టార్లు చిత్తుగా ఓడిపోయారు..షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం

కొలంబో స్కూల్ పిల్ల‌ల చేతిలో ఐపీఎల్ స్టార్లు చిత్తుగా ఓడిపోయారు..షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం
Advertisement

Shahid Afridi Statement On IND VS SL: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నమెంట్ లో (ACC Men’s Asia Cup Rising Stars 2026 ) భాగంగా సెమీ ఫైనల్స్ లో లంక చేతిలో టీమిండియా జూనియర్స్ చిత్తుగా ఓడారు. దీంతో టీమిండియా ఇంటి దారి పట్టగా… శ్రీలంక దర్జాగా ఫైనల్ లో అడుగు పెట్టింది. అయితే టీమిండియా ఘోరంగా ఓడిపోవడంపై పాకిస్తాన్ మాజీలు రెచ్చిపోయి రియాక్ట్ అవుతున్నారు. టీమిండియా పరువు తీస్తూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.

కొలంబో స్కూల్ పిల్ల‌ల చేతిలో ఐపీఎల్ స్టార్లు చిత్తుగా ఓడిపోయారు

ఫ్లాట్ మైదానాలకు అలవాటైన‌ వాళ్లు ఇలానే ఓడిపోతారని.. కేవలం పసికూనలపై మాత్రమే పంజా విసురుతారని విమర్శలు చేస్తున్నారు. లేటెస్ట్ గా టీమిండియా ఓటమిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi On IND VS SL) కూడా స్పందించాడు. కొలంబో స్కూల్ పిల్లల చేతిలో ఐపీఎల్ స్టార్లు చిత్తుగా ఓడారని హేళన చేశాడు. ఐపీఎల్ లో హైవేలపైన ఆడిన టీమిండియా క్రికెటర్లు.. శ్రీలంక బచ్చాగాళ్ల‌ చేతిలో ఓడిపోయి పరువు తీసుకున్నారని బాంబు పేల్చాడు. టీమిండియా ప్రదర్శన ఇలాగే కొనసాగితే.. ఉగాండా కంటే అద్వానంగా తయారవుతుందని హెచ్చరించారు.

Advertisement

Basit Ali Reaction On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: అంపైర్లు, బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు చేసినా పాకిస్తానే గెలిచింది.. త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌నం!

న‌ఖ్వీని రెండు సార్లు అవ‌మానించారు.. అందుకే ఇంటి దారి ప‌ట్టారు

ఆసియా కప్ టోర్నమెంట్ 2026 ఎప్పుడు జరిగినా టీమిండియాతో పెద్ద పంచాయతీ నడుస్తోందని షాహిద్ అఫ్రిది ఫైర్ అయ్యాడు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే సూర్య కుమార్ యాదవ్ అటు హర్మన్ ప్రీత్ కౌర్ తమ జట్లను ఛాంపియన్ గా నిలుపుకున్నార‌ని గుర్తు చేశాడు. కానీ ఈ ఇద్దరు కెప్టెన్లు మొహ్సిన్ నఖ్వీని అవమానిస్తూ రెండు ట్రోఫీలను తీసుకోకుండానే ఇండియాకు పారిపోయారని మండిపడ్డాడు.

Advertisement

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోబోమని అతన్ని అవమానించాలని ఫైర్ అయ్యాడు. ఇలాంటి పాపాల నేపథ్యంలోనే ఇప్పుడు టీమిండియా జూనియ‌ర్ టీమ్ ఎలిమినేట్ అయిందని బాంబు పేల్చాడు. భవిష్యత్తులో తాము కూడా ఐసీసీ టోర్నమెంట్ ఏదైనా గెలిస్తే, జై షా చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోబోమని తేల్చి చెప్పాడు. ఇది ఇలా ఉండ‌గా, టీమిండియా జ‌ట్టుపై గెలిచిన శ్రీలంక ఫైన‌ల్ చేరింది. ఇవాళ పాక్, బంగ్లా మ‌ధ్య రెండో సెమీస్ ఉంది. ఇందులో గెలిచిన జ‌ట్టుతో లంక త‌ల‌ప‌డ‌నుంది.

 

Kamran akmal On India A vs Pakistan A, 8th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: ఒరేయ్ వెధ‌వ‌ల్లారా…ఒక్క మ్యాచ్ కే సంబ‌రప‌డిపోకండి, ఫైన‌ల్ లో టీమిండియా ప్ర‌తాపం చూపిస్తుంది

Related News

ఫైన‌ల్ లో పాక్ చేతిలో ఓడిపోవాల్సి వ‌స్తుంద‌ని, తెలివిగా సెమీస్ నుంచే భార‌త్ నిష్క్రమించింది

హ‌ర్షిత్ రాణా శ‌నిలా దాపురించాడు, వాడు చేసిన పాపాలు…టీమిండియాను ముంచుతున్నాయి

టీమిండియా కొంప‌ముంచిన అంపైర్లు…న‌ఖ్వీ డ‌బ్బుల‌కు అమ్ముడుపోయారంటూ!

క‌ళ్ల‌జోడు పెట్టుకుని క‌న్నీళ్ల‌ను మ‌హ్మ‌ద్ సిరాజ్ క‌వ‌ర్ చేస్తున్నాడు..!

గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా బూతు పురాణం.. బ్యాన్ వేయాలంటూ డిమాండ్లు

శ్రీలంకపై వైభవ్ సెంచరీ చేసుంటే ట్రోలింగ్ ఆపేవాళ్లం, కానీ ఇప్పుడు రెచ్చిపోతాం

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అంపైర్ నితిన్ మీనన్..? సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాములుగా లేదుగా

Big Stories

Advertisement
×