Amazon Mobile Discount Offers: ప్రస్తుతం మొబైల్ ఫోన్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ కి అట్రాక్ట్ అవుతున్నారు. రకరకాల మోడళ్లను కంపెనీలు తీసుకు వస్తుండగా.. వాటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు . మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు అదిరిపోయే ఫీచర్స్ తో కొత్త కొత్త మోడల్స్ ను తీసుకు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ మొబైల్ వినియోగం బాగా పెరిగిపోయింది. మార్కెట్ లోకి కొత్త కొత్త మోడల్స్ దర్శనమిస్తున్నాయి. ఫోన్ ప్రియులను ఆకట్టుకునేందుకు అదిరిపోయే డిజైన్, సూపర్ డూపర్ ఫీచర్స్ తో అట్రాక్ట్ చేస్తున్నాయి. కాగా లాంచ్ సమయంలో మొబైల్ ధరలు భారీగా ఉండటంతో వీటిని కొనేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నారు.
కొనాలని కోరిక ఉన్నా అధిక ధర కారణంగా తమ ప్లాన్ ను మార్చుకుంటున్నారు. అలాంటి సమయంలో కంపెనీ అధికారిక వెబ్సైట్లు లేదా ప్రముఖ ఈ కామర్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తదితర కంపెనీలు కొత్త ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించే వరకు ఎదురు చూస్తుంటారు. అలాగే బ్యాంక్ ఆఫర్స్, ఎక్సేంజ్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తారు. అలాంటి వారికి ఇప్పుడొక అధిరిపోయే గుడ్ న్యూస్.
Also Read: Infinix Note 40 Pro 5G Series: ఇన్ఫినిక్స్ న్యూ స్మార్ట్ ఫోన్.. మరే ఫోన్‌లో లేని ఫీచర్‌తో లాంచ్!
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో 5g ఫోన్ పై అద్భుతమైన డిస్కౌంట్ లభిస్తుంది. 4g ఫోన్ పై విరక్తి చెందిన వారు 5g కొనుక్కోవాలని ప్లాన్ చేస్తుంటే అలాంటి వారికి ఈ ఆఫర్ బాగా యూజ్ అవుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో శామ్సంగ్ కంపెనీకి చెందిన శాంసంగ్ గెలాక్సీ ఎం 14 5g మొబైల్ పై ఎవరు ఊహించని డిస్కౌంట్ ఆఫర్ పొందొచ్చు. ఈ ఆఫర్ తో ఫోన్ ని అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఈ 5g ఫోన్ రెండు వేరియంట్ లలో అందుబాటులోకి వచ్చింది. 4జీబి ర్యాం, 128 జీబి స్టోరేజ్.. అలాగే 6 జిబీ ర్యాం, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ లలో అందుబాటులోకి వచ్చింది. ఇది మూడు కలర్ ఆప్షన్ లలో వచ్చింది.
4జీబి ర్యాం, 128 జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17990గా ఉంది. అయితే ఇప్పుడు అమెజాన్ లో ఈ మొబైల్ వేరియంట్ చాలా తక్కువ ధరకే లిస్ట్ అయింది. ఇప్పుడు కేవలం రూ.9990లకే అందుబాటులో ఉంది. అలాగే 6 జిబి రామ్, 128 జైబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,990 గా ఉంది. ఇప్పుడు దీనిని అమెజాన్ లో రూ.10,990లకే సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ పై భారీ బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి. వన్ కార్డ్ క్రెడిట్ కార్డు నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన పై రూ.250 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే బందన్ బ్యాంక్ డెబిట్ కార్డు పై రూ. 750 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అప్పుడు మరింత తక్కువ ధరకే ఈ 5g ఫోన్ ను కొనుక్కోవచ్చు. అలాగే దీనిపై భారీ ఎక్సేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.9,450 వరకు భారీ ఎక్సేంజ్ డిస్కౌంట్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ తో శాంసంగ్ గెలాక్సీ ఎం 14 5g మొబైల్ ను మరింత తక్కువ ధరకే కొనుక్కోవచ్చు.
Also Read: POCO M6 Pro @ Rs 1999: బంపరాఫర్.. బడ్జెట్ స్మార్ట్ వాచ్ ధరకే 5జీ మొబైల్.. ఆఫర్ మిస్ చేయకండి
ఈ ఆఫర్ తో ఈ మొబైల్ కేవలం రూ. 540 లకే కొనుక్కోవచ్చు. 5g ఫోన్ కొనుక్కోవాలి అని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ స్మార్ట్ ఫోన్ నీ ఒక నార్మల్ షర్ట్ ధర కంటే తక్కువ ధరకే కొనుక్కోవచ్చు అన్నమాట. అయితే ఈ ఎక్సేంజ్ ఆఫర్ మొత్తం పొందాలంటే పాత ఫోన్ కండేషన్ మంచిగా ఉండాలి. ఎలాంటి డామేజ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఈ ఆఫర్ మొత్తం వర్తిస్తుంది. లేదంటే మరింత ఎక్కువ మొత్తంలో అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం అనే చెప్పాలి. ఇది మంచి కెమెరా పనితనం, బ్యాటరీ సామర్థ్యం అందిస్తుంది.