Big Stories

Royal Enfield 750 Twins: పవర్‌ఫుల్ ఇంజన్‌తో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైకులు.. ఇదంతా వాటి కోసమే!

Royal Enfield 750 Twins: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు జనాల్లో బీభత్సమైన క్రేజ్ ఉంది. రోడ్డు పై ఆ బైక్ వెళుతుంటే వచ్చే డుగ్గు డుగ్గు మనే శబ్థం వేరే లెవల్లో ఉంటుంది. ముఖ్యంగా యువత ఈ బైక్ అంటే పిచ్చెక్కిపోతారు. ఈ క్రమంలోనే ఎన్‌ఫీల్డ్ త్వరలో తన 650 మోడల్ ట్విన్స్ బైక్‌ల మాదిరిగానే కొత్త 750 ట్విన్స్ బైక్‌లను విడుదల చేయబోతుంది.

- Advertisement -

నివేదిక ప్రకారం రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 650సీసీ సెగ్మెంట్ బైక్‌ల తరహాలో కొత్త 750సీసీ ట్విన్స్ బైక్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దేశీయ,అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంటర్‌సెప్టర్ 650,కాంటినెంటల్ GT బైక్‌లు రెండూ సూపర్‌హిట్ వేరియంట్‌లుగా ఉన్నాయి.

- Advertisement -

Also Read : కియా నుంచి బుజ్జి ఎలక్ట్రిక్ SUV.. మే 23న లాంచ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ బైక్‌లు వాటి లుక్, పర్ఫామెన్స్ కారణంగా చాలా ఇష్టపడతారు. అయితే దాని విభాగంలో అత్యుత్తమంగా ఉన్నప్పటికీ పవర్‌ట్రెయిన్ ముందు భాగంలో ఇది కొంచెం వెనుకబడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్ బైక్ మోడల్‌కు ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900 బైక్‌తో పోటీ ఉంది. అటువంటి పరిస్థితిలో కంపెనీ స్పీడ్ ట్విన్ 900కి పోటీగా తన బైక్‌ను మరింత పటిష్టం చేయబోతోంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త 750 ట్విన్స్ బైక్‌లను తీసుకురావడానికి కారణం ఇదే. ట్రయంఫ్ స్పీడ్ ట్విన్‌లో 900 cc ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ SOHC మోటార్ ఉపయోగించారు. ఇది గరిష్టంగా 64.1 bhp పవర్‌ని,80 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అదే సమయంలో 650 ట్విన్ ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ పవర్‌ట్రెయిన్ సామర్ధ్యం కలిగి ఉండదు. దీని కారణంగా రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు 750 సిసి మోటార్ సైకిల్‌ను విడుదల చేయాలని భావిస్తోంది.

ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్ బైక్‌లు విభాగంలో పవర్‌ఫుల్ బైకులు. కంపెనీ 650 బైక్‌లను రాయల్ ఎన్‌ఫీల్డ్ 750 ట్విన్ మోటార్‌సైకిల్‌తో భర్తీ చేయాలని కూడా యోచిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్‌లలో మరింత శక్తివంతమైన 750cc ట్విన్ ఇంజన్ ఉపయోగిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 60bhp పవర్, 55Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Also Read : రూ.10 లక్షల్లో పవర్‌ఫుల్ కారు కొనాలా?.. అయితే ఈ లిస్ట్ మీ కోసమే!

అయితే డిజైన్ ,ఫీచర్ల పరంగా 750 ట్విన్ 650 ట్విన్ బైక్‌తో సరిపోతుందిని భావిస్తున్నారు.ముఖ్యంగా ఆధునిక ఫీచర్ల విషయానికి వస్తే రెండూ 99 శాతం సమానంగా ఉంటాయని తెలుస్తోంది. LED హెడ్‌లైట్‌లు, అల్లాయ్ వీల్స్,స్ట్రక్చర్డ్ బాడీ ప్యానెల్‌లు మొదలైనవి రాయల్ ఎన్‌ఫీల్డ్ 750 ట్విన్స్‌లో ప్రీమియం ఫీచర్లుగా చూడవచ్చు. త్వరలోనే ఈ బైక్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News