BigTV English

Adah Sharma’s Bastar OTT release: కేరళ స్టోరీ బ్యూటీ కొత్త చిత్రం ఓటిటీలోకి.. ఎక్కడ చూడొచ్చు అంటే.. ?

Adah Sharma’s Bastar OTT release: కేరళ స్టోరీ బ్యూటీ కొత్త చిత్రం ఓటిటీలోకి.. ఎక్కడ చూడొచ్చు అంటే.. ?

Adah Sharma’s Bastar OTT release: సెలవనుకో మరి ఏడవకే మనసా అంటూ కుర్రకారుకు హార్ట్ ఎటాక్ తెప్పించిన బ్యూటీ అదా శర్మ. పూరి పరిచయం చేసిన బ్యూటీ అవ్వడంతో అమ్మడికి ఎక్కడలేని స్టార్ డమ్ వస్తుందని అందరూ చాలా ఊహించేసుకున్నారు. కానీ, ఈ సినిమా తరువాత అవకాశాలు వచ్చినా అదాకు మాత్రం విజయాలు దక్కలేదు. దీంతో ఈ చిన్నది తెలుగుకు ఫుల్ స్టాప్ పెట్టి .. హిందీలో సెటిల్ అయ్యింది. అక్కడ వరుస సినిమాలతో బిజీగా మారింది.


ఇక కేరళ స్టోరీ ఈ చిన్నదాని కెరీర్ నే మార్చేసింది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఆ తరువాత అన్ని వివాదాస్పద సినిమాలే చేద్దామని ఫిక్స్ అయ్యిందో ఏమో తెలియదు కానీ.. కేరళ స్టోరీ తరువాత అదా.. అదే డైరెక్టర్ తో బస్తర్: ది నక్సల్ స్టోరీ అనే సినిమాలో నటించింది. నక్సల్ గా ఇందులో నటనను కూడా అదరగొట్టింది. అయితే లక్ అన్నిసార్లు కలిసిరాదు అన్నట్లు ఈ సినిమా అట్టర్ ప్లాప్ టాక్ ను అందుకుంది.

మార్చి 15 న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. అసలు చాలామందికి ఈ సినిమా రిలీజ్ అయ్యింది అన్న విషయం కూడా తెలియదు. ఇక దాదాపు రెండు నెలల తరువాత ఈ చిత్రం ఓటిటీ బాట పట్టింది. తాజాగా ఈ సినిమా ఓటిటీ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా హక్కులను జీ5 సొంతం చేసుకుంది. మే 17 నుంచి ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. థియేటర్ లో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటిటీ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×