The Raja Saab Trailer : సినిమా రిలీజ్ అవుతుందంటే… మేకర్స్ అందరూ ఆ సినిమాపై బజ్ పెంచడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తారు. ఆడియన్స్‌ను ప్రసన్నం చేసుకోవడానికి ఆ సినిమాలోని పాటలను, టీజర్లు, ట్రైలర్లను బాగా కట్ చేస్తారు. అన్నింటికంటే, ట్రైలరే వారికి పెద్ద ఆయుదం. అయితే అలాంటి ఆయుదాన్ని రాజా సాబ్ మేకర్స్ సరిగ్గా వాడుకోలేదా అంటే.. అవును అనే ఆన్సర్ వస్తుంది.
ట్రైలర్ రిలీజ్ అవ్వకముందు… రాజా సాబ్ మూవీపై మంచి అంచనాలు ఉండేవి. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, అప్పట్లో వచ్చిన ఓ టీజర్ మంచి హైప్ ఇచ్చింది. దీంతో మారుతికి పాజిటివ్ స్పీడ్ బ్యాక్ వచ్చింది. క్రిటిక్స్ నుంచి సినిమా గేమ్ ఛేంజర్ ఆఫ్ ది టాలీవుడ్ అనేలా ఉండొచ్చు అనే టాక్ వచ్చింది. ఇప్పుడు ఆ మాటలను అన్నింటినీ సోమవారం వచ్చిన ట్రైలర్ చంపేసింది. ట్రైలర్ తర్వాత గేమ్ ఛేంజర్ ఆఫ్ ది టాలీవుడ్ కాదు… గేమ్ ఛేంజర్ రిజల్టే వచ్చేలా ఉంది అని అంటున్నారు.
ట్రైలర్‌లో కొత్తదనం కొంత వరకు ఉన్నా… వీఎఫ్ఎక్స్ మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఆదిపురుష్ కంటే దారుణమైన వర్క్ దీంట్లో ఉంది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. వీక్ వీఎఫ్ఎక్స్ అంటూ నిర్మాతపై ఫైర్ అవుతున్నారు.
కొన్ని రోజుల క్రితం ఇదే బ్యానర్‌లో వచ్చిన మిరాయ్ మూవీ వీఎఫ్ఎక్స్‌తో అందరినీ ఇంప్రెస్ చేసింది. నిజానికి సినిమాకు ఆ పాజిటివ్ టాక్ రావడంలో వీఎఫ్ఎక్స్ పాత్ర చాలా ఉంది. అత్యంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి హై వీఎఫ్ఎక్స్ ఇవ్వడంపై నిర్మాతలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకు ప్రశంసలు కూడా దక్కాయి.
మరి రాజా సాబ్ కి వీళ్లు చేసిన వర్క్ ఏంటి ? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రభాస్ మూవీకి ఇలాంటి వర్క్ ఇస్తారా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
థమన్ లెటెస్ట్ మూవీ ఓజీ. ఆ సినిమాకు ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పొచ్చు. పవన్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు థమన్‌ను దేవుడిని చేసేశారు. కానీ, ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్.. ఇదే థమన్‌ను దెయ్యంలా చూస్తున్నారు.
ట్రైలర్‌లో ఒక్కటి అంటే ఒక్క షాట్ మ్యూజిక్ బాగుంది అన్నట్టు చెప్పేలా లేదు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. థమన్ శక్తి అయిపోయిందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. థమన్ నుంచి ఇలాంటి వర్క్ ను వాళ్లు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ప్రభాస్ ఫ్యాన్స్.
ట్రైలర్‌లో ప్రభాస్‌ను చూశాం అనే కారణం తప్పా… వేరేది ఏదీ కూడా తమకు నచ్చలేదు అంటూ ప్రభాస్ ఫ్యాన్సే అంటున్నారు. అసలు ట్రైలర్ రిలీజ్ చేయకుండ ఉండాల్సిందని, ట్రైలర్ ప్లేస్‌లో సినిమా నుంచి ప్రభాస్ మరో పోస్టర్ రిలీజ్ చేస్తే సరిపోయేది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక నార్మల్ ఆడియన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు.
ట్రైలర్ రిలీజ్‌కు ముందు… రాజా సాబ్ బిజినెస్ పై చాలా మాటలు వినిపించాయి. తెలుగు రాష్ట్రాల్లోనే 200 కోట్ల వరకు బిజినెస్ అవ్వొచ్చు అనే టాక్ వచ్చింది ఇండస్ట్రీ వర్గాల నుంచి. కానీ, ఇప్పుడు ట్రైలర్ ఆ హైప్‌ను కిల్ చేసింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కనీసం 100 కోట్ల బిజినెస్ అయినా… అవుతుందా అని అంటున్నారు.