Gadwal: జోగులాంబ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం ఇటిక్వాలపాడు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి బృందంతో వెళ్తున్న డీసీఎం ఎదురుగా ఉన్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో డీసీఎంలో 100 మంది ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరి కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే స్థానికులు 108 ని సంప్రదించగా ఘటన స్థలికి చేరుకొని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.