SBI PLAN: తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి కోసం ఎదురు చూస్తున్నారా..? మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి లాభాలను ఇచ్చే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారి కోసమే ఎస్బీఐ సూపర్ అవకాశం కల్పిస్తొంది. పెట్టిన పెట్టుబడికి అరవై రెట్ల లాభాలను ఇచ్చే ఫండ్స్‌ను తీసుకొచ్చింది ఎస్బీఐ.
మధ్య తరగతి ప్రజల జీవితాల్లో కూడా లక్షలు సంపాదించే అద్బుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది భారతీయ స్టేట్ బ్యాంక్. షేర్ మార్కెట్ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌ను ప్రారంభించిది. ఇందులో మీరు పెట్టే పెట్టుబడికి అరవై రెట్లు అధిక లాభాలను అందుకోవచ్చు.. అయితే ఆ స్కీం ఏంటి అందులో ఎంత ఇన్వెస్ట్ మెంట్ చేస్తే ఎంత వస్తుందో అంచనాల ప్రకారం తెలుసుకుందాం.
ఎస్బీఐ పిల్లల భవిష్యత్తు కోసం తీసుకొచ్చిందే ఎస్బీఐ చిల్ర్డన్ బెనిఫిట్ ఇన్వెస్ట్‌మెంట్ డైరెక్ట్ ప్లాన్ ఈ ప్లాన్ ను 2020 సంవత్సరంలో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ హౌస్ ఈ స్కీంను లాంచ్ చేసింది. ఎస్బీఐ టోటల్ మ్యూచువల్ ఫండ్ వ్యాల్యూ 8.87 లక్షల కోట్లు.. ఇక ఈ స్కీం చిల్డ్రన్ బెనిఫిట్ స్కీం వాల్యూ 3500 కోట్లగా ఉంది. ఈ స్కీంలో ఒక సంవత్సరం నుంచి 18 సంవత్సరాల వయసు వరకు ఉన్న వాళ్లు పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో రెండు రకాల పెట్టుబడులు పెట్టొచ్చు. ప్రతి నెల డిపాజిట చేయాలనుకుంటే.. సిప్ ద్వారా ప్రతి నెల మినిమం 500 నుంచి అమౌంట్ పే చేయోచ్చు. అయితే ఇది ప్రతి నెల ఒకే తేదీన కట్టాలి. మీ అకౌంట్ లో డబ్బులు ఉంటే అకౌంట్ నుంచే డబ్బులు కట్ అవుతాయి. ఇక రెండో విధానం లంసమ్ అమౌంట్ డిపాజిట్ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో మినిమం డిపాజిట్ 5వేల రూపాయలు మాగ్జిమం ఎంతైనా చేసుకోవచ్చు. ఇందులో మొదటి ఐదు సంవత్సరాలు లాక్ ఫీరియడ్ ఉంటుంది. అంతే ఐదేళ్ల వరకు డబ్బులు తీసుకోవడానికి వీలుండదు.
ఈ స్కీంలో ప్రతినెల వెయ్యి రూపాయలు సిప్ చేసకుంటూ వెలితే ఐదు సంవత్సరాలకు రూ.98704 వస్తాయి. అదే పది సంవత్సరాలకు అయితే అసలు లక్షా ఇరవై వేల రూపాయలు, వడ్డీ రెండు లక్షల ఇవరై నాలుగు వేల మూడు వందల పదకొడు రూపాయలు వస్తుంది. మొత్తం మూడు లక్షల నలబై నాలుగు వేల మూడు వందల పదకొండు రూపాయలు వస్తాయి. ఇక పదిహేను సంవత్సరాలు సిప్ చేస్తే.. తొమ్మిది లక్షల యాభై అయిదు వేల నాలుగు వందల అరవై రూపాయలు వస్తాయి. ఇక ఇరవై సంవత్సరాలు సిప్ చేస్తే.. ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట తొంభై నాలుగు రూపాయలు వస్తాయి. ఇక ఇరవై అయిదు ఏండ్ల వరకు సిప్ చేస్తే.. మొత్తం 62లక్షల రూపాయలు రిటర్న్ వస్తాయి.
ఇక ఒకేసారి ఐదు వేల రూపాయలు లంసమ్ కడితే ఐదు సంవత్సరాలకు పన్నెండు వేల రూపాయలు, పది సంవత్సరాలకు ముఫ్పై వేల రూపాయలు, పదిహేను సంవత్సరాలకు 77 వేల రూపాయలు, ఇరవై సంవత్సరాలకు లక్షా తొంభై వేల రూపాయలు, ఇరవై అయిదు సంవత్సరాలకు నాలుగు లక్షల డెబ్బై రూపాయలు వస్తాయి.
ఇదే లెక్కన మీరు సిప్ చేసే అమౌంట్ కానీ లంసమ్ అమౌంట్ కానీ పెంచుకుంటూ పోతే మీకు రిటర్న్ కూడా ఎక్కువగానే వస్తాయి.
పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇవి మార్కెట్‌కు అనుగుణంగా మారతూ ఉండొచ్చు.