దేశంలో అగ్రగామి బ్యాంక్ గా కొనసాగుతున్న SBI.. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది కస్టమర్లకు ఆర్థిక సేవలను అందిస్తున్నది. రోజు రోజుకు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ మెరుగైన ఫైనాన్సియల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నది. దేశ వ్యాప్తంగా అత్యధిక మంది కస్టమర్లను కలిగి ఉన్న SBIకి తాజాగా రెండు ప్రతిష్టాత్మకమైన అవార్డులు దక్కాయి. వరల్డ్ బ్యాంక్/IMF వార్షిక సమావేశాల సందర్భంగా జరిగిన గ్లోబల్ ఫైనాన్స్ అవార్డు ప్రదానోత్సవంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు అవార్డులను అందుకుంది. వరల్డ్స్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ 2025, బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా 2025 అవార్డులను దక్కించుకుంది. ఈ రెండు అవార్డులు కస్టమర్లకు అందిస్తున్న నాణ్యమైన సేవల కారణంగా దక్కాయని SBI ప్రకటించింది. బ్యాంకింగ్ దిగ్గజంగా మరింత బలోపేతం అయ్యేందుకు ఈ అవార్డులు దోహదపడుతాయని వెల్లడించింది.
దేశంలోని అన్ని ప్రాంతాలకు తమ సేవలను విస్తరిస్తూ.. బ్యాంకింగ్ రంగంలో లీడర్ కొనసాగుతున్నట్లు SBI తెలిపింది. తన విస్తృతమైన కస్టమర్ బేస్ కు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ అనుభవాలను అందించడంలో బ్యాంక్ సాధించిన విజయానికి గుర్తుగా ఈ అవార్డులు వరించాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు సెట్టి వెల్లడించారు. “SBI కస్టమర్లకు నిబద్ధతతో అందిస్తున్నసర్వీసులను గ్లోబల్ ఫైనాన్స్ గుర్తించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. 520 మిలియన్ల మంది కస్టమర్లకు సేవ చేయడం, ప్రతిరోజూ 65,000 మంది కొత్త కస్టమర్లను జోడించడం కోసం సాంకేతికత, డిజిటలైజేషన్‌లో గణనీయమైన పెట్టుబడి అవసరం. ‘డిజిటల్ ఫస్ట్, కన్స్యూమర్ ఫస్ట్’ బ్యాంక్ గా, మా ఫ్లాగ్ షిప్ మొబైల్ అప్లికేషన్ 10 మిలియన్ల మంది రోజువారీ యాక్టివ్ యూజర్లతో 100 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తుంది” అని చల్లా తెలిపారు. అటు కేంద్రమంత్రి పియూష్ గోయెల్ SBIకి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బ్యాంకు కుటుంబ సభ్యులు అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. దేశీయ బ్యాంకింగ్ రంగంలో మరెన్నో ఉన్నత స్థానాలకు చేరాలని, దేశ ప్రజలకు మరిన్ని సేవలను అందించాలని ఆయన ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
World's Best Consumer Bank & Best Bank in India, @TheOfficialSBI 🇮🇳
Proud to see our very own State Bank of India honoured with two prestigious titles by Global Finance, New York, at the 2025 Best Bank Awards Ceremony for its outstanding service & customer trust worldwide.… pic.twitter.com/JqT5gD4LZG
— Piyush Goyal (@PiyushGoyal) October 23, 2025
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా అతిపెద్ద వాణిజ్య బ్యాంకుగా గుర్తింపు తెచ్చకుంది. ఇది దేశంలోని అతిపెద్ద తనఖా రుణదాతలలో ఒకటిగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల మంది భారతీయ కుటుంబాల ఇంటి కొనుగోలు కలలను నెరవేర్చింది. ఈ బ్యాంకు హౌస్ లోన్ పోర్ట్ ఫోలియో రూ. 8.5 లక్షల కోట్లు దాటింది. జూన్ 2025 నాటికి ఈ బ్యాంకు రూ. 54.73 లక్షల కోట్లకు పైగా డిపాజిట్ బేస్ కలిగి ఉంది. ప్రపంచంలోనే 4వ అత్యంత విశ్వసనీయ బ్యాంకుగా ర్యాంక్ పొందిన SBI, గృహ రుణాలు 27.7 శాతం, ఆటో రుణాలు 19.03 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. SBI దేశంలో 22,980 శాఖలను కలిగి ఉంది.
Read Also: ఈ ఏడాది హ్యాపీయెస్ట్ కంట్రీస్ లిస్ట్ వచ్చేసింది, ఆ దేశానికి మళ్లీ ఫస్ట్ ర్యాంక్!