E-Paper
Advertisement

Flight Ticket: జస్ట్ రూ. 1550కే ఫ్లైట్ జర్నీ.. ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Flight Ticket: జస్ట్ రూ. 1550కే ఫ్లైట్ జర్నీ.. ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!
Advertisement

Air India Express Flight Tickets: వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను తీసుకొచ్చే ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, తాజాగా మరో క్రేజీ అనౌన్స్ మెంట్ చేసింది. జస్ట్ బస్సు టికెట్ ధరలో విమాన ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. ఇందుకోసం ఎక్స్ ప్రెస్ మోర్ సేల్ పేరుతో స్పెషల్ సేల్ ను ప్రారంభించింది. ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ ద్వారా కేవలం రూ.1550కే దేశీయంగా ఎంపిక చేసిన మార్గాల్లో ఫ్లైట్ టికెట్స్ ను అందిస్తుంది.

డొమెస్టిక్ టికెట్ కు రూ. 1550, ఇంటర్నేషనల్ టికెట్ కు రూ. 6510

తాజాగా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ప్రకటించిన లిమిటెడ్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. సమ్మర్ హాలీడేస్ తో పాటు వర్షాకాలంలో పర్యాటక ప్రదేశాలకు వెళ్లేలా ఈ ఆఫర్ ఉపయోగపడనుంది. ఇప్పుడు టికెట్లు బుక్ చేసుకుంటే ఏకంగా 20 శాతం వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. అదే సమయంలో జీరో పర్సెంట్ కన్వీనియెన్స్ ఫీజు, ఒకసారి ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశం అందిస్తోంది. ఈ ఆఫర్ సమయంలో టికెట్లు బుక్ చేసుకునే వారికి డొమెస్టిక్ ఫ్లైట్స్ లో వన్ వే ప్రయాణానికి రూ.1550 నుంచి టికెట్ ధర ప్రారంభం అవుతుంది. ఇంటర్నేషనల్ విమానాల్లో ఎంపిక చేసిన మార్గాల్లో వన్ వే టికెట్ ధర రూ.6510 నుంచి ప్రారంభం అవుతుందని కంపెనీ ప్రకటించింది.

ఫిబ్రవరి 1 నుంచి ఎక్స్‌ ప్రెస్ మోర్ సేల్ ప్రారంభం

Advertisement

ఇక ఎయిర్ ఇండియా ఎక్స్‌ ప్రెస్ తీసుకొచ్చిన ఈ స్పెషల్ సేల్ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం అయ్యింది. ఫిబ్రవరి 5 అర్థరాత్రి వరకు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఎయిర్ ఇండియా ఎక్స్‌ ప్రెస్ అధికారిక వెబ్‌ సైట్, మొబైల్ యాప్ ద్వారా బుకింగ్స్ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కాగా, ఇరత వెబ్ సైట్స్, యాప్స్ లో ఫిబ్రవరి 2 నుంచి బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆఫర్ వేళ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు ఫిబ్రవరి 11 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈ ఆఫర్ లో భాగంగా టికెట్ బేస్ ప్రైస్,  ట్యాక్సులు, ఎయిర్‌ పోర్ట్ ఛార్జీలు కలిపే ఉంటాయి. కన్వీనియెన్స్ ఫీజ్, యాన్సిలరీ సర్వీసెస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

అందుబాటులో 50 లక్షల సీట్లు

ఇక ఈ ఆఫర్ గురించి ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కీలక వివరాలు వెల్లడించింది. ఈ ఆఫర్ లో భాగంగా 50 లక్షల సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇదో లిమిటెడ్ ఆఫర్.. ముందుగా బుక్ చేసుకున్న వారికి అవకాశం ఉంటుందని తెలిపింది. అదే సమయంలో అన్ని డేట్లలో, అన్ని మార్గాల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉండదని తెలిపింది. ఎంపిక చేసిన తేదీల్లో అందుబాటులో ఉంచే విమానాల్లోనే ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ముందుగానే ప్రయాణీకులు ఈ ఆఫర్ వర్తించే విమానాలు, ప్రయాణ తేదీల గురించి తెలుసుకోవాలని సూచించింది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఎలాంటి రీఫండ్ ఉండదని తెలిపింది.

Advertisement

Read Also: హైస్పీడ్ రైల్ హబ్ గా హైదరాబాద్.. చెన్నై, బెంగళూరు, ముంబై బుల్లెట్ ట్రైన్ కారిడార్ల లింక్ ఇక్కడే!

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×