BigTV English

Tata Curvv EV Launched: టాటా కర్వ్‌ ఈవీ విడుదల.. సింగిల్ ఛార్జింగ్‌పై 585 కి.మీ మైలేజ్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..!

Tata Curvv EV Launched: టాటా కర్వ్‌ ఈవీ విడుదల.. సింగిల్ ఛార్జింగ్‌పై 585 కి.మీ మైలేజ్.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే..!

Tata Curvv EV Launched: వాహన ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న టాటా కర్వ్ ఎట్టకేలకు దేశీయ మార్కెట్‌లో ఇవాళ (ఆగస్టు 7) విడులైంది. ఈ టాటా కర్వ్ అందరూ భావించినట్లుగానే ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇది మూడు వేరియంట్లలో రిలీజైంది. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్‌లను అందించారు. అందులో మిడ్ రేంజ్ 45 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ, మరొకటి లాంగ్ రేంజ్ 55 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వచ్చాయి. ఇవి వరుసగా 502 నుంచి 585 కి.మీ మైలేజీని అందిస్తాయని కంపెనీ తెలిపింది.


ఈ ఎలక్ట్రిక్ కారులోని 123 కెడబ్లూహెచ్ మోటారు కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 స్పీడ్‌ను అందుకుంటుంది. అలాగే ఇది గంటకు 160 కి.మీ టాప్ స్పీడ్‌తో పరుగులు పెడుతుంది. ఇక దీని స్పెసిఫికేషన్లు, ఫీచర్ల విషయానికొస్తే.. ఈ టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారులో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, టచ్ క్లైమేట్ కంట్రోల్‌తో ఒక డాష్‌బోర్డ్ ఉంటుంది. అలాగే ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ క్లస్టర్ ఉంది. ఇది కాకుండా దీని టాప్ వేరియంట్‌లో వెంటిలేడెట్ ఫ్రంట్ సీట్లు, లెథెరెట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 320వాట్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

Also Read: ఏంటి భయ్యా ఈ అరాచకం.. హ్యుందాయ్ కార్లపై రూ.90 వేల వరకు డిస్కౌంట్స్..!


ఇది మూడు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అందులో ఎకో, సిటీ, స్పోర్ట్ వంటివి ఉన్నాయి. అలాగే ఇది వి2వి, వి2ఎల్ ఛార్జింగ్‌ ఆప్షన్‌తో వస్తుంది. ఇక దీని వీల్స్ విషయానికొస్తే.. ఇందులో 18 ఇంచుల వీల్, 190ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, 450 ఎంఎం వాటర్ వేడింగ్ డిప్త్ వంటివి కలిగి ఉన్నాయి. అలాగే ఇందులో సేఫ్టీ విషయానికొస్తే.. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఈఎస్‌పీ, ఆల్‌వీల్ డిస్క్ బ్రేక్స్‌తో సహా మరెన్నో ఫీచర్లు ఇందులో అందించారు.

ఇందులో చెప్పుకోదగ్గ మరో సేఫ్టీ ఫీచర్ ఏదన్నా ఉంది అంటే అది అలర్ట్ సౌండ్ సిస్టమ్. ఈ సిస్టమ్ ప్రకారం.. ఎవరైనా కారుకు దగ్గరగా వస్తే శబ్దాలు చేస్తుంది. అంతేకాకుండా ఇందులో లెవెల్ అడాస్ టెక్నాలజీ ఉంది. ఈ టాటా కర్వ్ ఐసీఈ ఇంజిన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. కాగా ఈ వెహికల్‌లో రెండు పెట్రోల్ ఇంజిన్‌లు, ఒక డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. అలాగే ఇందులో కొత్త హైపెరియన్ జిడిఐ ఇంజిన్ కూడా ఉంది. ఇక వీటి ధరల విషయానికొస్తే.. కంపెనీ టాటా కర్వ్ ఈవీని రూ.17.49 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అలాగే దీని టాప్ వేరియంట్ రూ.21.99 లక్షల ధరతో తీసుకొచ్చింది. అయితే కంపెనీ దీని ఐసీఈ వెర్షన్ ధరలను సెప్టెంబర్ 2వ తేదీన వెల్లడించనున్నట్లు తెలిపింది.

Related News

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

Big Stories

×