E-Paper
Advertisement

Unstoppable: అన్ స్టాపబుల్ 4 వచ్చేస్తుంది.. ఎప్పటినుంచి అంటే.. ?

Unstoppable: అన్ స్టాపబుల్ 4 వచ్చేస్తుంది.. ఎప్పటినుంచి అంటే.. ?
Advertisement

Unstoppable: నందమూరి బాలకృష్ణ మొట్ట మొదటిసారి హోస్ట్ గా వ్యవహరించిన షో అన్ స్టాపబుల్. ఈ షో అనౌన్స్ చేసినప్పుడు అందరి మైండ్స్ లో ఒకటే ఆలోచన. బాలయ్య యాంకర్ అంటే ఎలా ఉంటుంది. ఆయనకు వచ్చే కోపం హ్యాండిల్ చేయడం కష్టం. అందరితో నవ్వుతూ మాట్లాడగలడా.. ? సెలబ్రిటీలను నవ్వించగలడా.. ? వారితో ఆటలు ఆడించగలడా.. ? అని.

కానీ, నందమూరి బాలకృష్ణ ఎందులోనైనా దిగనంతవరకే.. ఒక్కసారి దిగితే చరిత్ర రిపీట్ అవ్వడమే అని నిరూపించాడు. అసలు బాలయ్య హోస్టింగ్ చూసి అభిమానులు ముక్కున వేలేసుకున్నారు. ఆ ఎనర్జీ, వాక్చాతుర్యం, సరదాగా ఆటపట్టించే విధానం నెక్ట్స్ లెవెల్ అని చెప్పొచ్చు. అలా అన్ స్టాపబుల్ సీజన్ 1 తో మొదలై మూడు సీజన్స్ వరకు విజయవంతంగా పూర్తిచేసుకుంది.

Advertisement

మొదటి సీజన్స్ కేవలం సెలబ్రిటీలు మాత్రమే రాగా.. రెండో సీజన్ పొలిటికల్ లీడర్లు కూడా సందడి చేశారు. ఇక మూడో సీజన్.. చాలా లిమిటెడ్ ఎడిషన్ గా మొదలు పెట్టి త్వరగానే ముగించారు. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 4 కు రంగం సిద్ధం చేశారు ఆహా మేకర్స్. నాలుగో సీజన్.. ముందున్న మూడు సీజన్స్ కు మించి ఉండేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.

ఇక ఈ సీజన్ ను దసరా కానుకగా స్ట్రీమింగ్ చేయాలనీ చూస్తున్నారట. ఇప్పటికే గెస్ట్ లిస్ట్ ను కూడా ఫైనల్ చేశారని చెప్పుకొస్తున్నారు. ఈసారి చిరంజీవి, నాగార్జున కూడా ఈ షోకు వచ్చే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మరి ఈసారి బాలయ్య.. వచ్చే గెస్టులను ఎలా ఆడుకుంటాడో చూడాలి.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×