Hyundai Car Discounts In August: ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ కార్ల సేల్స్ పెంచుకునేందుకు తరచూ డిస్కౌంట్లు ప్రకటింస్తుంటాయి. ప్రతి నెలా ఏదో ఒక మోడల్‌పై ఆఫర్లు అందించి వాహన ప్రియులను అట్రాక్ట్ చేస్తుంటాయి. గత నెల జూలైలో ప్రముఖ కంపెనీలు తమ కార్లపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించి సేల్స్ పెంచుకున్నాయి. ఇక ఇది ఆగస్టు నెల కాబట్టి.. ఈ నెలలో కూడా పలు కంపెనీలు తమ వాహనాలపై తగ్గింపులు అందిస్తున్నాయి. అందులో హ్యుందాయ్ కంపెనీ ఒకటి. దేశీయ మార్కెట్‌లో హ్యుందాయ్ కార్లకు సూపర్ డూపర్ క్రేజ్ ఉంది.
ఈ కంపెనీ వచ్చిన కార్లు ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అంతేకాకుండా సేల్స్ కూడా హ్యుందాయ్ దుమ్ముదులిపేస్తుంది. అయితే త్వరలో పండుగ సీజన్ మొదలవబోతుంది కాబట్టి ఇప్పటి నుంచే ఆఫర్లు ప్రకటించడం మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే తాజాగా తమ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపింది. క్రెటా, క్రెటా ఎన్ లైన్, ఐ20 ఎన్‌లైన్, అల్కాజర్, టక్సన్, వెర్నా వంటి మోడళ్లపై కళ్లుచెదిరే తగ్గింపులు ప్రకటించింది.
అల్కాజర్
ఆగస్టు నెలలో హ్యుందాయ్ అల్కాజర్ పెట్రోల్, డీజిల్ మోడల్ కొనుగోలుపై గరిష్టంగా రూ.90,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఈ మోడల్ 6 సీటర్ అండ్ 7 సీటర్ ఆప్షన్లలో ఉంటుంది.
టక్సన్
Also Read: స్కూటర్ ధరలు తగ్గాయ్.. తొందరగా కొనేయండి బాసు.. మళ్లీ ఇలాంటి ఆఫర్ కష్టమే..!
హ్యుందాయ్ టక్సన్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌పై అదిరిపోయే తగ్గింపు ఉంది. పెట్రోల్ వేరియంట్‌పై రూ.25,000 డిస్కౌంట్, డీజిల్ వేరియంట్‌పై రూ.50,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఇది 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, అలాగే 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో ఉంది.
వెర్నా
వెర్నా మోడల్‌పై హ్యుందాయ్ కంపెనీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ మోడల్‌పై రూ.40,000 తగ్గింపు అందిస్తుంది. అందులో క్యాష్ డిస్కౌంట్ రూ.15,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000, స్క్రాపేజ్ బోనస్ రూ.5000 పొందొచ్చు.
ఐ 20
హ్యుందాయ్ ఐ20 మోడల్ కొనుగోలుపై రూ.50,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. సీవీటీ వేరియంట్ కొనుగోలు పై రూ.35,000 వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. దీని ధర విషయానికొస్తే.. ఇది రూ.7.04 లక్షల నుంచి రూ.11.21 లక్షల మధ్యలో లభిస్తుంది.
వెన్యూ అండ్ వెన్యూ ఎన్ లైన్
Also Read: బంపర్ డిస్కౌంట్లు.. హోండా కార్లపై కొనసాగుతున్న ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.96 వేలు పొందొచ్చు..!
వెన్యూ అండ్ వెన్యూ ఎన్ లైన్ మోడళ్లపై మంచి తగ్గింపు ఆఫర్లు ఉన్నాయి. వెన్యూ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్‌పై రూ.60,000 ప్రయోజనాలు పొందొచ్చు. అలాగే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ డీసీటీ వేరియంట్‌పై రూ.55,000 డిస్కౌంట్ లభిస్తుంది. 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ వేరియంట్‌పై రూ.50,000 ప్రయోజనాలు పొందొచ్చు. అదే సమయంలో వెన్యూ ఎన్ లైన్ వేరియంట్‌పై రూ.55,000 డిస్కౌంట్ లభిస్తుంది.
గ్రాండ్ ఐ10 నియోస్
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్ కొనుగోలు పై కూడా తగ్గింపు పొందవచ్చు. ఈ మోడల్‌పై దాదాపు రూ.53,000 ప్రయోజనాలు లభిస్తున్నాయి. అదే సమయంలో ఆరా మోడల్ కొనుగోలుపై రూ.48,000 వరకు ప్రయోజనాలు పొందొచ్చు. వీటితో పాటు హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొనుగోలు పై కూడా తగ్గింపు ఉంది. ఏకంగా రూ.20,000 వరకు భారీ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవన్నీ ఈ ఆగస్టు నెల వరకు మాత్రమే లభిస్తాయి. వీటికి సంబంధించి మరిన్ని వివరాల కోసం సమీపంలోని షోరూమ్‌ను సందర్శించాల్సి ఉంటుంది.