BigTV English

Kia Seltos X Line : సేల్స్‌లో దుమ్ము దులిపేసిన కియా సెల్టోస్.. ఇప్పుడు మరో కొత్త కలర్‌లో వచ్చేసింది..!

Kia Seltos X Line : సేల్స్‌లో దుమ్ము దులిపేసిన కియా సెల్టోస్.. ఇప్పుడు మరో కొత్త కలర్‌లో వచ్చేసింది..!

Kia Seltos X Line black color: ప్రస్తుతం ఆటో మొబైల్ మార్కెట్‌లో వాహనాలకు ఫుల్ డిమాండ్ ఉంది. అందులోనూ దేశీయ మార్కెట్‌లో కార్లపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు కారు కొనాలంటే ఎంతగానో ఆలోచించే వారు ఇప్పుడు పలు ఆప్షన్లలో కొనుక్కుంటున్నారు. అందువల్లనే మార్కెట్‌లో కార్లకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రముఖ కంపెనీలు కొత్త కొత్త కార్లను లాంచ్ చేస్తూ వాహన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా తన లైనప్‌లో సేల్స్‌లో దూసుకుపోతున్న ఓ కారును ఇప్పుడు కొత్త కలర్ వేరియంట్‌లో తీసుకొచ్చింది.


కార్ల తయారీ కంపెనీ కియా రిలీజ్ చేసిన సెల్టోస్ ఎస్యూవీ మార్కెట్‌లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలో ఎక్కువ సేల్స్ నమోదు చేసిన ఎస్యూవీగా కూడా ఇది దేశీయ మార్కెట్‌లో సత్తా చాటింది. అయితే ఇప్పుడు కంపెనీ కియా సెల్టోస్‌ను కొత్త అప్‌డేట్‌లతో భారతదేశంలో లాంచ్ చేసింది. సెల్టోస్ ఎస్యూవీ ప్రస్తుతం మిడ్ సైజ్ ఎస్యూవీ ఎక్స్ లైన్ వెర్షన్‌లో కొత్త కలర్‌లో లాంచ్ చేయబడింది. తాజాగా బ్లాక్ కలర్‌లో పరిచయం అయింది. ఈ కలర్‌లో సెల్టోస్ ఎస్యూవీ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇప్పటి వరకు సెల్టోస్ ఎక్స్ లైన్ గ్రే కలర్‌ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు బ్లాక్ కలర్‌లో కూడా లభిస్తుంది. ఈ కొత్త కలర్ వేరియంట్‌లో కేవలం ఎక్ట్సీరియర్‌‌లో మాత్రమే కాకుండా ఇంటీరియర్‌లో కూడా కొన్ని మార్పులు చేశారు. దీని క్యాబిన్ విషయానికొస్తే.. సెల్టోస్ ఎక్స్ లైన్ క్యాబిన్ బ్లాక్, స్ప్లెండిడ్ సేజ్ గ్రీన్ 2టోన్ కాంబినేషన్‌లో డిఫరెంట్ కలర్‌లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా రియర్ స్కిడ్ ప్లేట్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా, ఫాక్స్ ఎగ్జాస్ట్, వెనుక బంపర్‌పై ఫ్రంట్, ఔటర్ రియర్ మిర్రర్లు, టెయిల్ గేట్ గార్నిష్ తో సహా మరికొన్ని ఇందులో ఉన్నాయి.


Also Read: అప్‌డేటెడ్ ఫీచర్లతో సిట్రోయెన్​ సీ3.. ధరలు పెరిగాయ్.. ఎంతంటే..?

అంతేకాకుండా సెల్టోస్ ఎక్స్ లైన్‌లో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఎక్స్ లైన్ బ్యాడ్జ్‌లను అందించారు. అయితే ఇవన్నీ కస్టమర్లను ఆకట్టుకునేందుకు కంపెనీ తీసుకొచ్చింది. అయితే ఈ కలర్‌ వేరియంట్‌లో కారును ఎందుకు తీసుకొచ్చారో కంపెనీ తెలిపింది. సెల్టోస్ డిమాండ్, ఫీడ్ బ్యాక్ ఆధారంగానే దీనిని బ్లాక్ కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చినట్లు కియా ఇండియా చీఫ్ సేల్స్ ఆఫీసర్ తెలిపారు. ఇకపోతే కియా సెల్టోస్ ఫేస్‌లిఫస్ట్ ఎస్యూవీలో టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్, టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ వంటివి ఉన్నాయి.

అయితే ఈ ఇంజిన్‌లు 6స్పీడ్ మాన్యువల్ ట్రాన్ష్‌మిషన్‌తో వస్తాయి. అలాగే సివిటి యూనిట్, 6స్పీడ్ ఐఎంటీ యూనిట్, 6 స్పీడ్ డ్యూయల్ ట్రాన్సమిషన్‌ ఆప్షన్లను కలిగి ఉన్నాయి. సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 113 bhp పవర్, 144nm గరిష్ట టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో పలు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. అవి 1.5 లీటర్, టర్బోచార్జ్డ్, డీజిల్ ఇంజిన్ వంటివి ఉన్నాయి.

Related News

D-Mart: కొనేది తక్కువ, దొంగతనాలు ఎక్కువ.. డి-మార్ట్ యాజమాన్యానికి కొత్త తలనొప్పి!

JIO Super Plans: జియో నుంచి సూపర్ ఆఫర్లు.. ఏది ఫ్రీ, ఏది బెస్ట్ అంటే?

SEBI – Foreign Funds: భారతీయ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. విదేశీ ఫండ్స్‌కి SEBI గ్రీన్ సిగ్నల్

ICICI Bank New Rules: కస్టమర్లకు ICICI బిక్ షాక్.. కనీస బ్యాలెన్స్ రూ.10 వేలు కాదు.. అంతకుమించి.. పేదోళ్ల సంగతి ఏంటో?

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Big Stories

×