Tata New Curvv: మన దేశంలో ఆటోమొబైల్ రంగం రోజురోజుకూ వేగంగా మారుతోంది. కొత్త కొత్త మోడళ్లతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రతి కంపెనీ ప్రత్యేకమైన ప్రయోగాలు చేస్తోంది. అలాంటి సందర్భంలో టాటా మోటార్స్ నుంచి మరో అద్భుతమైన వాహనం మార్కెట్లోకి వచ్చింది. అదే కొత్త టాటా కర్వ్ #డార్క్ ఎడిషన్. SUV లకు భారత మార్కెట్లో ఎంతటి క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. యూత్ నుంచి ఫ్యామిలీ వరకు అందరూ SUV వైపు ఆశక్తి చూస్తున్నారు. ఆ క్రమంలోనే టాటా మోటార్స్ తన కొత్త SUV కర్వ్‌ను ఆధునిక డిజైన్‌తో, విలాసవంతమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది.. ధర విషయానికి వస్తే ఈ SUV ధర రూ.9.99 లక్షల నుండి ప్రారంభమవుతుంది. మధ్యస్థ SUV విభాగంలో లభించే ఈ వాహనం, లుక్‌లో కానీ, ఫీచర్లలో కానీ, సేఫ్టీలో కానీ ఏ మాత్రం రాజీ పడలేదు.
ఈ కారు ప్రత్యేకత
ముందుగా చెప్పుకోవలసినది సేఫ్టీ. ఈ కారు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. అంటే డ్రైవర్, ప్యాసింజర్లకు మంచి భద్రత లభిస్తుంది. ఇండియన్ రోడ్ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే, సేఫ్టీకి టాటా ఇచ్చిన ప్రాధాన్యత నిజంగా అభినందనీయం అని చెప్పాలి.
Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. కస్టమర్లకు పండగే!
కారు డిజైన సూపర్
డిజైన్ విషయానికి వస్తే.. SUV అయినప్పటికీ కూపే స్టైల్ రూపకల్పన, స్లీక్ బాడీ లైన్స్, సూపర్ లుక్స్ ఈ కర్వ్‌కి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ముఖ్యంగా డార్క్ ఎడిషన్ అయితే రోడ్డుపై ఒకసారి కనబడితే తప్పక అందరి చూపునీ తనవైపు తిప్పుకునేలా ఉంటుంది. కారు వర్క్ విషయానికి వస్తే.. ఈ కర్వ్ హైపీరియన్ GDi పెట్రోల్ ఇంజిన్‌తో పాటు క్రయోజెట్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. అంటే ఎక్కువ శక్తి కావాలా, లేక మెరుగైన మైలేజ్ కావాలా అన్నది పూర్తిగా కస్టమర్ చేతుల్లో ఉంటుంది. డ్రైవింగ్ అనుభవం ఉత్సాహంగా, ఆనందంగా ఉండేలా టాటా ఇంజినీర్లు ప్రత్యేకంగా రూపొందించారు.
కేవలం ఇంజిన్ మాత్రమే కాదు, కార్ లోపలి భాగాలను కూడా అత్యాధునికంగా డిజైన్ చేశారు. విలాసవంతమైన ఇంటీరియర్స్, పెద్ద టచ్‌స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ క్లస్టర్, కనెక్టివిటీ సౌకర్యాలు అన్నీ డ్రైవర్‌కి మరింత సులభతరం చేస్తాయి. మరొక ముఖ్యమైన అంశం ఏమింటంటే కారులో స్పేస్. SUV అంటే ఫ్యామిలీ ట్రావెల్స్ కోసం ఎక్కువ స్థలం కావాలి. ఈ కర్వ్ ఆ అంచనాలకు తగ్గట్టుగానే వెనుక సీట్లోనూ, బూట్ స్పేస్‌లోనూ సరిపడా స్థలాన్ని కలిగి ఉంది.
ఇక టాటా మోటార్స్ నుంచి వచ్చినందువల్ల నమ్మకం, మన్నిక, తక్కువ నిర్వహణ ఖర్చు అనే హామీతో వస్తోంది. ఈ SUV ప్రత్యేకంగా యువతకు, అలాగే ఫ్యామిలీ యూజ్ కోసం కూడా సరిపోయేలా రూపొందించబడింది. మొత్తానికి చెప్పుకోవలసిందేమంటే, రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో లభించే టాటా కర్వ్ SUV, స్టైల్, సేఫ్టీ, పవర్, ప్రీమియం ఫీచర్లన్నీ కలిసిన ప్యాకేజీ. రోడ్డు మీద ఒకసారి చూసే వారు తల తిప్పి చూడాల్సిందే. ఇక ఈ SUV బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరి మీరు కూడా ఒక కొత్త SUV కొనాలనుకుంటే, టాటా కర్వ్‌ని తప్పక పరిశీలించాలి.