OTT Movies: మీకు మాంచి యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీ చూడాలని ఉందా? అయితే, తప్పకుండా ‘ది గర్ల్ నెక్ట్స్ డోర్’ (The Girl Next Door – 2004) మూవీ చూడండి. ఈ జనరేషన్ వాళ్లకు పెద్దగా ఈ మూవీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ, అప్పట్లో ఈ మూవీ ఒక ఊపు ఊపేసింది. ప్రస్తుతం ఇది ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇదీ కథ:
అంబిషియస్ హైస్కూల్ సీనియర్ మాథ్యూ కిడ్‌మన్ (Emile Hirsch) జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందుతాడు. కానీ ట్యూషన్ ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడతాడు. అయితే, వాడికో మంచి బుద్ధి ఉంది. మాథ్యూ క్లాస్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు $25,000 సమకూర్చి తనతో పాటు చదువుకొనే బ్రిలియంట్ కాంబోడియన్ స్టూడెంట్ సామ్‌నాంగ్ (Ulysses Lee) చదుకొనేందుకు సాయం చేస్తాడు. కానీ హైస్కూల్ జీవితం మాత్రం ఏమీ ఎక్సైటింగ్ లేదని భావిస్తుంటాడు. అతడి స్నేహితులు ఎలి (Chris Marquette), క్లిట్జ్ (Paul Dano)లు గ్రాడ్యుయేషన్ ముందు కొన్ని రిస్కులు తీసుకోవాలని, క్రేజీగా ఉండాలని అంటాడు. కానీ, ఎవరూ అతడిని పట్టించుకోరు.
పక్కటి అమ్మాయితో లైఫే మారిపోద్ది
అప్పుడే.. మాథ్యూ జీవితంలోకి ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఆమే.. అతడి పక్కింటి అమ్మాయి డానియెల్ (Elisha Cuthbert). ఆమెను ఒక్కసారి చూస్తే.. చూపు తిప్పుకోలేరు. ఓ రోజు ఆమె బట్టలు మార్చుకుంటున్నప్పుడు చాటుగా చూసేస్తాడు మాథ్యూ. కానీ, డానియెల్ అతడిని కనిపెట్టేస్తుంది. దీంతో ఓ రోజు మాథ్యూను కారులో ఎక్కించుకొని టౌన్ చుట్టూ డ్రైవ్ చేస్తుంది. ఆ తర్వాత మాథ్యూను వీధిలో బట్టలు విప్పమని ప్రోత్సహిస్తుంది. తర్వాత అతడి బట్టలు దొంగిలించి కారులో వెళ్లిపోతుంది. తనను దుస్తులు లేకుండా చూసినందుకు ప్రతీకారంగా డానియల్ అలా చేస్తుంది.
అయితే.. మొదట్లో కాస్త పోట్లాడుకున్నా.. తర్వాత ఫ్రెండ్స్ అయిపోతారు. ఒక క్లాస్‌మేట్ ఇచ్చిన పార్టీలో మాథ్యూకు ముద్దు పెట్టబోతాడు డానియెల్. అందుకు మాథ్యూ హర్ట్ అవుతుంది. కానీ, అతడి ఫ్రెండ్ ఎలీ.. ఓ షాకింగ్ న్యూస్ చెబుతుంది. డానియల్ ఒక అడల్ట్ యాక్ట్రెస్ అని, నీకు ఆ పని ఈజీ అయిపోతుందని సలహా ఇస్తుంది. దీంతో మాథ్యూ ఒక రోజు డానియెల్‌ను మోటెల్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆమెను సెక్స్ వర్కర్‌లా ట్రీట్ చేస్తాడు. డానియెల్ అవమానం చెంది, వారి రిలేషన్‌షిప్‌ను అకస్మాత్తుగా ముగించేస్తుంది. గతం నుంచి బయటపడటం అంత సులభం కాదని, తిరిగి అడల్ట్ ఇండస్ట్రీకి వెళ్లిపోతుంది డానియల్. ఈ విషయం తెలిసి మాథ్యూ, ఎలి, క్లిట్జ్ కలిసి.. డానియల్‌ను వెతికేందుకు లాస్ వేగాస్‌లోని అడల్ట్ ఫిల్మ్ కన్వెన్షన్‌కు వెళ్తారు. అక్కడ డానియల్ మాజీ బాయ్ ఫ్రెండ్, అడల్ట్ సినిమాల నిర్మాత కెల్లీ (Timothy Olyphant)ని కలుస్తారు. డానియల్ కోసం వచ్చామని చెప్పగానే.. తమ బిజినెస్‌లో వేలు పెట్టొద్దని మాథ్యూను హెచ్చరిస్తాడు కెల్లి.
ఇక్కడి నుంచి అసలు కథ మొదలు
మాథ్యూ మీద ఉన్న ప్రేమ వల్ల.. డానియల్ అడల్ట్ ఫిల్మ్‌లో నటించలేకపోతుంది. దాని వల్ల కెల్లికి 30 వేల డాలర్ల నష్టం వాటిల్లుతుంది. ప్రతీకారంగా మాథ్యూను ఎత్తుకుపోయి దాడి చేస్తాడు. ఆ నష్టాన్ని నువ్వు భర్తీ చేయాలని.. ఇందుకు తన మాజీ బిజినెస్ పార్టనర్ హ్యూగో పోష్ (James Remar) ఇంటి నుంచి ఒక అవార్డ్‌ను దొంగిలించాలని చెబుతాడు. ఇందుకు మాథ్యూ అంగీకరిస్తాడు. పోష్ ఇంట్లోకి మాథ్యూ ఎంటర్ కాగానే.. కెల్లీ పోలీస్‌లకు కాల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. కానీ, కెల్లీ మాత్రం మాథ్యూని వదిలిపెట్టడు. స్కూల్‌లో తలెత్తుకోలేని పరిస్థితికి మాథ్యూను దిగజార్చుతాడు. మరి.. మాథ్యూ అతడికి డబ్బులు చెల్లించగలుగుతాడా? తిరిగి డానియల్ ప్రేమను పొందగలుగుతాడా అనేది బుల్లితెరపైనే చూడాలి. ప్రస్తుతం ఈ మూవీ Jio Hotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, పిల్లలతో చూడొద్దు. విపరీతమైన అడల్ట్ కంటెంట్ సీన్లు ఉంటాయి.