TATA Motors Offer: ఆర్‌బీఐ వడ్డీ రేట్లు తగ్గించడంతో వినియోగదారులపై దృష్టి పెట్టాయి వివిధ రంగాలు. రియల్టర్ కాకుండా కార్ల కంపెనీలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ జాబితాలో ముందుంది టాటా మోటార్స్. తాజాగా కస్టమర్లకు అదిరిపోయేలా ఆఫర్లు ప్రకటించింది. దాదాపు లక్ష వరకు ఇచ్చింది. వెంటనే కొనుగోలు చేసేందుకు వినియోగదారులు రెడీ అవుతున్నారు.
టాటా మోటార్స్ తన వాహనాలపై ఊహించని బెనిఫిట్స్ ఇచ్చింది. టాటా పంచ్, టాటా నెక్సాన్, టాటా కర్వ్, టాటా టియాగో ఎలక్ట్రిక్ కార్లపై దాదాపు లక్ష వరకు ప్రయోజనాలను ప్రకటించింది. అందులో గ్రీన్ బోనస్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు సైతం ఉన్నాయి. దీన్ని కొంతవరకు పరిమితం చేసింది. ఆఫర్లు కేవలం స్టాక్ ఉన్నంతవరకు మాత్రమే. జూన్ నెల 30 వరకు మాత్రమే ఉండనున్నాయి.
టాటా కర్వ్ ఈవీ 2024 ఏడాది వాహనాలపై 70 వేల వరకు ఆఫర్ ప్రకటించింది. గ్రీన్ బోనస్ కింద 50 వేలు, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ ఇన్సెంటివ్ కింద మరో 20 వేలు ఇవ్వనుంది. కర్వ్ ఈవీ రేటు రూ .17.49 లక్షల నుండి రూ .22.24 లక్షల మధ్య ఉంది. అయితే రెండు ఎక్స్-షోరూమ్ ధర మాత్రమే. ఈ ఏప్రిల్‌లో కొత్త డార్క్ ఎడిషన్‌ను ఈ లైనప్‌లో చేర్చారు.
టాటా బెస్ట్ సెల్లింగ్ నెక్సాన్ ఈవీ. జూన్ ఆఫర్‌లో దీనికి ప్రయోజనాలు ఇచ్చింది. గతేడాది వేరియంట్లపై గరిష్టంగా 40 వేలు తగ్గింపు పొందవచ్చు. 20 వేలు గ్రీన్ బోనస్, 20 వేలు ఎక్స్ఛేంజ్ లభిస్తుంది. నెక్సాన్ ఈవీ రెండు బ్యాటరీ ఎంపికలతో ఉంటుంది. ఎక్స్ షోరూమ్‌లో ఆ వాహనాలకు సంబంధించి రూ.12.49 నుంచి రూ.17.19 లక్షల వరకు ధరలు ఉన్నాయి. నెక్సాన్ ఈవీ ఎంజీ విండ్సర్, మహీంద్రా ఎక్స్యూవీ400 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ALSO READ: దిగొస్తున్న బంగారం ధరలు.. పండగే పండగ
ఇతర మోడల్స్‌తో కంపేర్ చేస్తే టియాగో ఈవీపై డిస్కౌంట్లు భారీగా ఉన్నాయి. ఎంవై-2024 స్టాక్‌పై బేస్ ఎక్స్ ఈ వేరియంట్‌కు 55 వేలు ఆఫర్ ఇచ్చింది. ఎక్స్ జెడ్ ప్లస్, ఎక్స్ జెడ్ ప్లస్, టెక్ లక్స్ ఏసీఎఫ్సీ (7.2 కిలోవాట్) వంటి హై-ఎండ్ వెర్షన్లకు 70 వేల వరకు డిస్కౌంట్. మిడ్ లెవల్ ఎక్స్ టీ ఎల్ఆర్ వేరియంట్ పై అత్యధికంగా లక్ష వరకు ఆఫర్ ఇచ్చింది. కొత్త ఎంవై-2025 యూనిట్లలో అన్ని వేరియంట్లకు 40 వేలు డిస్కౌంట్లు ఇచ్చింది.
టాటా టియాగో ఈవీ. ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు ధర రూ .7.99 లక్షల నుండి రూ .11.14 లక్షలు. పైన చెబుతున్న ధరలన్నీ ఎక్స్-షోరూమ్ కి సంబంధించినవి మాత్రమే. అందులో 19.2 కిలోవాట్, 24 కిలోవాట్ల సామర్థ్యంతో రెండు బ్యాటరీలను అందిస్తుంది.
టాటా పంచ్ ఈవీపై డిస్కౌంట్లు బాగానే ఉన్నాయి. సంవత్సరాన్ని బట్టి వాహనాల మోడళ్లు మారుతూ ఉంటాయి. ఎంవై2024 లాంగ్ రేంజ్ ఏసీఎఫ్సీ వేరియంట్లపై 90 వేల వరకు ఆఫర్ ఇచ్చింది. ఎంట్రీ లెవల్ స్మార్ట్, స్మార్ట్ ప్లస్ వేరియంట్లకు 45 వేలు. ఇతర వేరియంట్లపై 70 వేలు వరకు తగ్గింపు ఇచ్చింది. టాటా పంచ్ ఈవీ ధర రూ .9.99 లక్షల నుండి రూ .14.44 లక్షల మధ్య ఉంటుంది. 25 కిలోవాట్, 35 కిలోవాట్లు అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి.