Intinti Ramayanam Today Episode june 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవనిని రాజేంద్రప్రసాద్ అరుస్తాడు. ఎందుకమ్మా నువ్వు ఇలా చేశావు. ఇప్పుడు ఏదైనా జరిగితే ఏంటి ఎవరు సమాధానం చెప్తారు అని అంటాడు.. మీరు ఇలా చేయకపోతే నన్ను ఖచ్చితంగా ఏదో అనుకుంటారు ఇప్పుడు నా మీద మరో నిందల్ని వేస్తారు అని అవని అంటుంది. అవని చెప్పిన సమాధానం విని రాజేంద్రప్రసాద్ మౌనంగా ఉంటాడు. ఉదయం లేవగానే అక్షయ్ ఆస్తులన్నీ జప్తు చేశారు అన్న విషయాన్ని కమల్ పేపర్ తీసుకొని వచ్చి చెప్తాడు.. ఆమాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ కు గురవుతారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది ఏమైంది అని అనగానే కమల్ ఆ పేపర్ చూపించి మీకు ఈ విషయం తెలియదా రాజేంద్రప్రసాద్ ఆస్తులు కంపెనీ వ్యవహారాలని కొలప్స్ అయిపోయాయి.
రాత్రికి రాత్రే ప్లేట్ తిప్పేసారంటూ టీవీలో కూడా వార్తలు వస్తున్నాయి చూడండి అంటూ అంటాడు. దానికి ఇంట్లోని వాళ్ళందరూ టీవీ చూసి షాక్ అవుతారు.. ఏంట్రా ఇలా అయింది ఈ విషయం వినగానే నాకు కాళ్లు చేతులు ఆడడం లేదు అని పార్వతి అంటుంది. అయితే పల్లవి మాత్రం నేను ఇన్నాళ్లు వెయిట్ చేసినా గుడ్ న్యూస్ ని ఈరోజు విన్నానని ఫుల్ ఖుషి అవుతూ ఉంటుంది. వెంటనే పల్లవి తన తండ్రి దగ్గరికి వెళ్తుంది. అందరూ ఈ మాట విని షాక్ అవుతారు.. ఆఫీసర్లు వెంటనే ఇంటిని ఖాళీ చేయాలని ఆర్డర్ పాస్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ గారు కంపెనీ కోసం తీసుకున్న 85 కోట్లు మాకు తిరిగి చెల్లించాలి. మీరు ఇప్పటివరకు చెల్లించలేదు అంటే ఏంటిది మేము చెప్తే చేస్తున్నాం. మీరంతా వెంటనే ఖాళీ చేసి మీరు బయటకు వెళ్ళండి అంటూ షాక్ ఇస్తారు.. అప్పుడే అవని ఎక్స్క్యూజ్మీ ఆఫీసర్స్ అని అక్కడికి వస్తుంది. ఇంటి నమ్మి అధికారం ఎవరికీ లేదు అని చెప్తుంది. ఆ మాట విన్న పల్లవి షాక్ అవుతుంది.. ఆస్తులు గురించి అవని ఆఫీసర్స్ తో మాట్లాడుతుంది వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ ఆస్తిలో సగం వాటాన్ని నా పెద్ద కోడలు పేరుమీద రాశాను ఇదిగోండి డాక్యుమెంట్స్ అని రాజేంద్రప్రసాద్ చెప్తాడు.
అవని పేరు మీద ఇల్లు ఉన్న డాక్యుమెంట్స్ ని ఆఫీసర్లకి చూపిస్తారు.. ఆ బ్యాంకు మేనేజర్ అవని గారి పేరు మీద ఏంటి డాక్యుమెంట్స్ ఉన్నాయండి మాకు ఎటువంటి రైట్లు లేవు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అవని ఇల్లు దేవాలయం లాంటిది.ఈఇంటిని వదిలి వెళ్ళమని హక్కు ఎవరికీ లేదు. ఇది మావయ్య గారు ఎంతో కష్టపడి ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు మనందరికీ ఇది ఒక దేవాలయం అన్న సంగతి మర్చిపోవద్దు అని అవని అందరితో అంటుంది.. నేనుండగా మీరు ఎప్పుడూ ఇలాంటి కష్టాలను ఎదురుకోకూడదు అని అవని అంటుంది.
ఇంట్లో మీరు నిరభ్యంతరంగా ఉండవచ్చు ఎవరు మిమ్మల్ని బయటకు పంపించే హక్కు లేదు. ఆ డాక్యుమెంట్స్ కూడా మీకు పంపిస్తాను అత్తయ్య అని అవని అంటుంది. అయితే అవని చెప్పిన మాటలు విని కమల్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. వదిన చెప్పినట్టే ఈ ఇల్లు దేవాలయం లాంటిది ఇంట్లో ఎవరున్నా లేకపోయినా నేను మాత్రం వెళ్ళను అని ఎమోషనల్ అవుతాడు. అప్పుడే పల్లవి అక్కడికి వచ్చి ఏంటి బావ కన్నీళ్లు పెట్టుకుంటున్నావ్ ఏంటి అని అడుగుతుంది.
వదిన చెప్పినట్టు ఈ ఇల్లు దేవాలయం లాంటిది. ఎవరు ఉన్నా లేకపోయినా నేను ఇంట్లో ఉంటాను. తప్ప ఇంట్లోంచి బయటికి వెళ్లే ప్రసక్తే లేదు అని అంటాడు. పల్లవి నాకు ఒక తింగరోడు దొరికాడు అత్తయ్య బావగారు అందరూ వెళ్లిపోవాలనుకుంటున్నారు నేను మాత్రం బావతోనే ఉంటానని ఇక్కడే ఉండిపోతానని పల్లవి అనుకుంటుంది. అటు శ్రేయ కూడా ఏంటిని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు.. ఎవరు వెళ్ళిపోయినా సరే నేను ఇక్కడే ఉంటాను. లేదంటే మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను తప్ప.. వీళ్లతో పాటు వెళ్లి బయట రోడ్లమీద కష్టాలు పడలేను అని మనసులో అనుకుంటుంది.
అప్పుడే శ్రీకర్ అక్కడికి వస్తాడు. ఏంటి ఇంట్లోంచి వెళ్లిపోవాలి ఇలాగే సద్దాం అని చెప్పడానికి వచ్చావా అని శ్రియ అంటుంది. ఇంట్లోంచి వెళ్ళిపోతానని నీకెవరు చెప్పారు అని శ్రీయా అంటుంది. ఆ మాట వినగానే శ్రియ కూల్ అవుతుంది. ఇక అక్షయ్ అవని పేరు మీద ఇల్లు ఉంటే ఆ ఇంట్లో నేను ఉండను అని.. అందరూ ఇంట్లోంచి బయటికి వెళ్లిపోదామని అందర్నీ పిలుస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..