Gold Rate Today: పసిడి ప్రియులకు పండగే పండగ.. గత కొద్దిరోజుల నుంచి భారీగా దిగొస్తున్నాయి. తాజాగా బంగారం ధరలు.. గడిచిన మూడు రోజుల్లో సుమారు రూ.2000 తగ్గింది.
మంగళవారం ఉదయం నమోదు అయిన వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,450 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,580 వద్ద కొనసాగుతోంది. భారతదేశంలో బంగారం ధరలు డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం.. డాలర్ విలువ తగ్గడం, ప్రభుత్వం విధించే పన్నులు వంటి.. అనేక అంశాల ద్వారా నిర్ణయించబడతాయి. మన దేశంలో బంగారం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు, సంప్రదాయం, పండుగలతో కూడా ముడిపడి ఉంటుంది.
ముఖ్యంగా వివాహాలు, పండుగ సీజన్లలో దాని డిమాండ్ అకస్మాత్తుగా పెరుగుతుంది. దీని కారణంగా ధరలు కూడా పెరుగుతాయి. తాజాగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం వలన పెట్టుబడిదారులు డాలర్ వైపు మళ్లారు. దీని వల్ల బంగారం వాల్యూ తగ్గింది. చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం తగ్గుతోందన్న అంచనాలు.. పెట్టుబడిదారుల్లో భయం తగ్గించాయి. స్టాక్ మార్కెట్లు, క్రిప్టో కరెన్సీలు లాంటి ఇతర పెట్టుబడి మార్గాల్లో లాభదాయక అవకాశాలు కనిపించడంతో బంగారంపై ఆసక్తి తగ్గింది.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.89,450 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,580 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,450 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,580 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,450 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,580 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,450 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,580 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,450 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,580 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.89,450 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.97,580 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: దూసుకుపోతున్న భారత్ జిడిపీ.. సంతోషించాల్సిన విషయం కాదు.. నిపుణుల హెచ్చరిక
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాత్రం తగ్గుముఖం పడుతుంటే.. వెండి ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,19,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,09, 000 వద్ద ట్రేడ్ అవుతోంది.