BigTV English

Hair on Toes: కాలివేళ్లపై వెంట్రుకలు ఉన్నవారి జీవితం ఎలా ఉంటుందో చెబుతున్న సాముద్రిక శాస్త్రం

Hair on Toes: కాలివేళ్లపై వెంట్రుకలు ఉన్నవారి జీవితం ఎలా ఉంటుందో చెబుతున్న సాముద్రిక శాస్త్రం

కొంతమంది కాలివేళ్లపై వెంట్రుకలు కనిపిస్తాయి. అందరికీ ఇలా పెరగాలని లేదు. అలాగే చేతులపై, వేళ్ళపై వెంట్రుకలు పెరగడం కనిపిస్తూ ఉంటాయి. కాలివేళ్ళ పై వెంట్రుకలు పెరగడం అనేది సాముద్రిక శాస్త్ర ప్రకారం మంచిదో కాదో తెలుసుకుందాం.


సాముద్రిక శాస్త్రం చెబుతున్న ప్రకారం సాధారణంగా ప్రజల కాలివేళ్ళ మీద వెంట్రుకలు పెద్దగా ఉండవు. కానీ కొంతమందికి మాత్రం విపరీతంగా పెరుగుతాయి. ఇలా వెంట్రుకలు పెరగడం అనేది సాధారణ విషయం కాదు. ఒక ప్రత్యేకమైన అంశం గానే చెప్పుకోవాలని అంటోంది సాముద్రిక శాస్త్రం ఇలా కాలి వేళ్ళపై జుట్టు పెరిగే వారి భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉంటుందని వివరిస్తోంది.

వీరికి అంతా మంచే
సాముద్రిక శాస్త్రం చెబుతున్న ప్రకారం కాలి బొటన వేలుపై వెంట్రుకలు ఉన్నవారు చాలా కష్టపడి పనిచేసే తత్వం కలవారు. అలాంటి వ్యక్తి తమ లక్ష్యాలను ప్రత్యేకంగా నిర్దేశించుకుంటారు. జీవితాంతం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కష్టపడి పనిచేస్తారు. వారికి అదృష్టం కూడా దక్కుతుంది. అదృష్టము, కష్టము కలిసి వారిని తమ లక్ష్యానికి చేరువ చేస్తాయి. అలాంటి వ్యక్తులు పక్కనున్న ఇతరులను కూడా ప్రభావితం చేస్తారు.


కాలివేళ్లపై వెంట్రుకలు అధికంగా ఉండే వారి వ్యక్తిత్వం చాలా గంభీరంగా ఉంటుంది. వారికి స్వీయ జ్ఞానం ఎక్కువ. ప్రతి విషయాన్ని లోతుగా శోధించేందుకు ప్రయత్నిస్తారు. యోగా, ధ్యానం, ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంటుంది. వారు చాలా తక్కువగా మాట్లాడతారు. కానీ మాట్లాడిన ఆ తక్కువ మాటల్లోనే జీవిత సత్యాలు ఉంటాయి. వారికి ఆలోచించే శక్తి కూడా ఎక్కువ. ఎదుటివారిని అర్థం చేసుకునే మనసు కూడా ఎక్కువగానే ఉంటుంది.

సాముద్రిక శాస్త్రం ప్రకారం కాలివేళ్ళ మీద వెంట్రుకలను కలిగి ఉన్న వ్యక్తి జీవితంలో అన్ని సౌకర్యాలు, విలాసాలను పొందుతాడు. అన్ని విజయాలను అనుభవిస్తాడు. ఆ వ్యక్తి జీవితంలో ఆర్థికంగా చాలా బలంగా ఉంటాడు. బాధ్యతాయుతంగా ముందుకు సాగుతాడు. ఆయనకి నాయకత్వ సామర్థ్యం కూడా అధికంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఏమాత్రం వెనకాడరు.

సాముద్రిక శాస్త్రం అనేది భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ఒక భాగం. ఇది శరీరం, ముఖం, ఇతర శరీర లక్షణాలను పరిశీలించి ఆ వ్యక్తి జీవితం భవిష్యత్తు, స్వభావం ఎలా ఉంటుందో అంచనా వేసి చెప్పే శాస్త్రం. దీనిలో హస్త సాముద్రిక శాస్త్రం కూడా ఒకటి. ఇది అరచేతిలోని గీతలను పరిశీలించి ఆ వ్యక్తి భవిష్యత్తును అంచనా వేస్తుంది.

సాముద్రిక శాస్త్రం కేవలం తెలుగువారికే కాదు అనేక భాషల్లోని వారికి కూడా పరిచయమే. పురాతన మానుస్క్రిప్ట్ లో ఆధారంగా హిందీ, రాజస్థానీ, గుజరాతి, మరాఠీ, ఒడియా, తమిళం, మలయాళంలో ఉన్న అనేక సాముద్రిక శాస్త్ర మానుస్క్రిప్ట్ లను కనుగొన్నారు.

హిందువులు, బౌద్ధులు, జైనులు ఈ సాముద్రిక శాస్త్రాన్ని నమ్ముతారని చెప్పుకుంటారు. దీని ప్రకారం శారీరక గుర్తులు ఆధారంగా అతడి మనస్తత్వాన్ని అంచనా వేస్తారు. సాముద్రిక శాస్త్రంలో హస్త సాముద్రికం ప్రధానమైనది. అలాగే ముఖ పఠనం అంటే ముఖంలోని లక్షణాలను చూసి చెప్పే శాస్త్రం కూడా ప్రధానమైనదే. ఇక కపాల సాముద్రిక శాస్త్రం… దీన్నే ఫ్రినాలజీ అని అంటారు. సాముద్రిక శాస్త్రం గురించి పురాతన హిందూ గ్రంథమైన గరుడ పురాణంలో కూడా ప్రస్తావించారు.

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×