Tecno Pova Slim 5G: ప్రపంచంలో ప్రతిసారీ కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌లు వస్తూనే ఉంటాయి. కానీ, ఈసారి టెక్నో కంపెనీ తెచ్చిన పోవా స్లిమ్ 5జీ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని 3డీ కర్వ్‌డ్ 5జీ స్మార్ట్‌ఫోన్ అని టెక్నో మొబైల్ ఇండియా ప్రకటించింది.
అందమైన డిజైన్
పోవా స్లిమ్ 5జీ కేవలం 5.95 మిల్లీమీటర్ల మందం మాత్రమే కలిగి ఉంది. బరువు కూడా కేవలం 156 గ్రాములు మాత్రమే. అంటే చేతిలో పట్టుకున్నప్పుడు చాలా తేలికగా, స్మూత్‌గా ఉంటుంది. ఇంకా దానిని మరింత స్టైలిష్‌గా మార్చేది డైనమిక్ మూడ్ లైట్ డిజైన్. ఈ లైట్ నోటిఫికేషన్లు వచ్చినప్పుడు, కాల్స్ వచ్చినప్పుడు, అంతే కాదు యూజర్ మూడ్ బట్టి కూడా వెలుగుతుంది. ఫోన్ వాడుతున్న అనుభూతికి ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
డిస్‌ప్లే విషయానికి వస్తే
పోవా స్లిమ్ 5జీలో 6.78 అంగుళాల 1.5కే 3డీ కర్వ్‌డ్ అమోలేడ్ స్క్రీన్ ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 144హెచ్2, దీన్ని టచ్ చేసినప్పుడు శబ్దాన్ని డిజిటల్‌గా రికార్డ్ చేసే వేగం 240హెచ్2. గరిష్టంగా 4500 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. అంటే మీరు గేమ్స్ ఆడటానికి, వెబ్ బ్రౌజింగ్ చేయడానికి,వీడియోలు చూడడానికి ఈ ఫోన్ ఉపయోగపడుతుంది.
ఉపయోగం ఉంటుందా?
ఇంత సన్నగా ఉన్న ఫోన్ ఎక్కువ రోజులు వాడుకోవడానికి ఉపయోగంగా ఉంటుందా అని చాలా మంది ప్రశ్న. దీనిపై ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, దీని కోసం టెక్నో మంచి భద్రతా ఫీచర్లను ఇచ్చింది. ఈ ఫోన్‌లో కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 7ఐ, మిలిటరీ గ్రేడ్ ఎంఐఎల్-ఎస్టీడీ 810హెచ్ సర్టిఫికేషన్‌తో పాటు, ఇంకా ఐపీ64 రేటింగ్ ఉన్నాయి. అంటే నీటి చినుకులు పడినా, చిన్న మట్టి ధూళి తగిలినా, కొంచెం షాక్ తగిలినా కూడా ఇది బలంగా నిలబడగలదు.
Also Read: Sleeping Needs: ఏంటి నిజమా? నిద్ర తగ్గితే మెదడుకు ప్రమాదమా?
ప్రత్యేక ఏమిటి?
ఇక ఈ ఫోన్‌లో మరో ప్రత్యేకత ఇల్లా ఏఐ. ఇది టెక్నో రూపొందించిన ప్రత్యేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్. ముఖ్యంగా భారతీయ భాషల్లో పనిచేస్తుంది. దీనితో మీరు ఏఐ కాల్ అసిస్టెంట్, ఏఐ రైటింగ్, ఏఐ ఇమేజ్ ఎడిటింగ్, సర్కిల్ ద్వారా వెతకడం, వ్యక్తిగత వివరాలు వంటి ఎన్నో ఫీచర్లను ఉపయోగించుకోవచ్చు. అంటే సాధారణ వినియోగదారుకు ఈ ఫోన్ మరింత తెలివిగా, వ్యక్తిగత సహాయకుడిలా పనిచేస్తుంది.
16జీబీ ర్యామ్ – 128జీబీ స్టోరేజ్
కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇక్కడ 5జీ ముఖ్యమైన అంశం. పోవా స్లిమ్ 5జీలో 5జీ ప్లస్ క్యారియర్ అగ్రిగేషన్, 4×4 మిమో, డ్యూయల్ సిమ్ డ్యూయల్ యాక్టివ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. అలాగే టీయూవీ రీన్‌ల్యాండ్ ధృవీకరణ కూడా ఉంది. అంటే మీరు ఎక్కడ ఉన్నా మంచి నెట్‌వర్క్ పనితీరును అనుభవించవచ్చు. ఈ ఫోన్‌లో 16జీబీ ర్యామ్ (8జీబీ ఫిజికల్ ర్యామ్ + 8జీబీ వర్చువల్ ర్యామ్) అందించారు. అలాగే 128జీబీ స్టోరేజ్ ఉంది. దీని వలన మల్టీ టాస్కింగ్ చాలా సులభంగా అవుతుంది. గేమ్స్ ఓపెన్ చేసినా, యాప్‌లు రన్ చేసినా, ఎంటర్ టైన్‌మెంట్‌కి వాడినా ఎలాంటి ఎక్కువ సమయం తీసుకోకుండా స్మూత్‌గా పనిచేస్తుంది.
ధర ఎంతంటే?
ఇక ధర విషయానికి వస్తే, పోవా స్లిమ్ 5G 8జీబీ ర్యామ్+ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ మూడు కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. స్కై బ్లూ, స్లిమ్ వైట్, కూల్ బ్లాక్. సెప్టెంబర్ 8 నుంచి దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్స్‌లో లభ్యం అవుతుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.