BigTV English

BSNL Offers: రూ. 329కే 1000 జీబీ డేటా, BSNL బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్లు ఇంత బాగున్నాయా?

BSNL Offers: రూ. 329కే 1000 జీబీ డేటా, BSNL బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్లు ఇంత బాగున్నాయా?

BSNL Broadband Plans:

BSNLకు చెందిన భారత్ ఫైబర్ బ్రాడ్‌ బ్యాండ్ దేశంలో అత్యంత సరసమైన ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లు పలు రకాల డేటా అవసరాలు, బడ్జెట్లకు అనుగుణంగా రూపొందించింది. హైస్పీడ్ ఫైబర్ టు ది హోమ్(FTTH) కనెక్షన్లను అందిస్తుంది. ఈ ప్లాన్లు సాధారణంగా అన్ లిమిటెడ్ డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్,OTT సబ్‌ స్క్రిప్షన్లను కూడా అందిస్తోంది.


BSNL భారత్ ఫైబర్ బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్లు  

1.ఎంట్రీ-లెవెల్ ప్లాన్‌లు:

⦿ రూ. 249 ప్లాన్: నెలకు 25 Mbps వేగంతో 10 GB డేటా లభిస్తుంది. ఆ తర్వాత 2 Mbps స్పీడ్ తో నెట్ వస్తుంది. దేశంలో ఏ నెట్‌ వర్క్‌ కైనా అపరిమిత లోకల్, STD కాల్స్ చేసుకోవచ్చు. వ్యాలిడిటీ 1 నెల ఉంటుంది. ఇది గ్రామీణ ప్రాంతాల కోసం రూపొందించబడింది.


⦿ రూ. 299 ప్లాన్: నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. 20 GB వరకు 25 Mbps వేగంతో డేటా లభిస్తుంది. ఆ తర్వాత 2 Mbps స్పీడ్ తో వస్తుంది. అపరిమిత లోకల్, STD కాల్స్ చేసుకోవచ్చు.

⦿ రూ. 329 ప్లాన్: నెల వ్యాలిడిటీ ఉంటుంది. 1000 GB డేటా వరకు 20 Mbps స్పీడ్ తో వస్తుంది. ఆ తర్వాత  4 Mbps స్పీడ్ తో వస్తుంది. అపరిమిత లోకల్, STD కాల్స్ చేసుకోవచ్చు. కేరళలోని  కొన్ని ప్రాంతాల్లో IPTV బండిల్ ఆప్షన్ ఓటీటీ సేవలు అందుబాటులో ఉన్నాయి.

2.పాపులర్ ప్లాన్‌లు:

⦿ రూ. 399 ప్లాన్: నెల వ్యాలిడిటీ 1400 GB డేటా లభిస్తుంది. 40 Mbps వేగంతో డేటా లభిస్తుంది.  అపరిమిత లోకల్,  STD కాల్స్ చేసుకోవచ్చు.

⦿ రూ. 449 ప్లాన్: నెల రోజుల వ్యాలిడిటీ 3300 GB డేటా లభిస్తుంది. 30 Mbps వేగంతో 3300 GB వరకు డేటా లభిస్తుంది. అపరిమిత లోకల్, STD కాల్స్ చేసుకోవచ్చు.

⦿ రూ. 599 ప్లాన్: నెల రోజుల వ్యాలిడిటీతో 3300 GB డేటా లభిస్తుంది. 60 Mbps స్పీడ్ తో డేలా లభిస్తుంది. అపరిమిత లోకల్, STD కాల్స్ చేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో  Disney+ Hotstar Super Plan అందుబాటులో ఉంది.

3.ప్రీమియం ప్లాన్‌లు:

⦿ రూ. 999 ప్లాన్: 3 నెలల వ్యాలిడిటీతో నెలకు 1200 డేటా లిస్టుంది. 25 Mbps నెట్ స్పీడ్ ఉంటుంది. అపరిమిత లోకల్,  STD కాల్స్ చేసుకోవచ్చు.

⦿ రూ. 1799 ప్లాన్: నెల రోజుల వ్యాలిడిటీతో 4000 GB డేటా లభిస్తుంది. 300 Mbps స్పీడ్ తో డేటా లభిస్తుంది. అపరిమిత లోకల్, STD కాల్స్ చేసుకోవచ్చు. Zee5, Sony LIV, Disney+ Hotstar, Voot Select, Hungama Music, Hungama Play, YuppTV Live, Shemaroo Me, Lions Gate ఓటీటీ సేవలు లభిస్తాయి.

⦿ రూ. 4799 ప్లాన్: నెల రోజుల వ్యాలిడిటీతో 6500 GB లభిస్తుంది. 300 Mbps స్పీడ్ తో నెట్ లభిస్తుంది. అపరిమిత లోకల్, STD కాల్స్ చేసుకోవచ్చు. Sony LIV Premium, Disney+ Hotstar Super, Zee5 Premium, Voot Select, Hungama Music, Hungama Play, YuppTV Live, Shemaroo Me, Lions Gate సేవలు అందుబాటులో ఉన్నాయి.

4.లాంగ్-టర్మ్ ప్లాన్‌లు:

⦿ రూ. 1999 ప్లాన్: 6 నెలల వ్యాలిడిటీతో  నెలకు 1400 GB డేటా లభిస్తుంది. 40 Mbps స్పీడ్ నెట్ సౌకర్యం ఉంటుంది. అపరిమిత లోకల్,  STD కాల్స్ చేసుకోవచ్చు.

⦿ రూ. 2694 ప్లాన్: 6 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. నెలకు 3300 GB డేటా లభిస్తుంది. 30 Mbps స్పీడ్ ఉంటుంది. అపరిమిత లోకల్,  STD కాల్స్ చేసుకోవచ్చు.

⦿ రూ. 5940 ప్లాన్: ఏడాది వ్యాలిడిటీ ఉంటుంది. 30 Mbps స్పీడ్ తో నెలకు 3300 GB డేటా లభిస్తుంది. అపరిమిత లోకల్, STD కాల్స్ చేసుకోవచ్చు.

BSNL భారత్ ఫైబర్ బ్రాడ్‌ బ్యాండ్ వివరాలు  

⦿ ఇన్‌ స్టాలేషన్ ఛార్జీలు: ఫైబర్ కనెక్షన్‌లకు సాధారణంగా రూ. 500 ఇన్‌స్టాలేషన్ ఛార్జీ వసూలు చేస్తారు. అయితే, 2026 మార్చి 31 వరకు ఈ ఛార్జీలు మాఫీ చేయబడ్డాయి. లాంగ్ టర్మ్ ప్లాన్లలో ఉచిత ఇన్‌స్టాలేషన్ అందుబాటులో ఉంది.

⦿ OTT బండిల్స్: కొన్ని ప్లాన్‌లు Disney+ Hotstar, Zee5, Sony LIV, Voot Select, Hungama Music, Hungama Play, YuppTV Live, Shemaroo Me, Lions Gate వంటి OTT సబ్‌స్క్రిప్షన్‌లను కలిగి ఉంటాయి. రూ. 599, అంతకంటే ఎక్కువ ప్లాన్స్ లో ఉంటాయి.

⦿ డిస్కౌంట్లు, ఆఫర్లు: Amazon Pay, ICICI క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేస్తే క్యాష్‌ బ్యాక్,  డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

Read Also:  డిమార్ట్ సొంత బ్రాండ్ రేట్లు అంత తక్కువా? మిగతా బ్రాండ్ల ధరలతో ఉన్న తేడా ఏంటీ?

Related News

Tecno Pova Slim 5G: ప్రపంచంలోనే సన్నని 5జీ ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

CIBIL Score: క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ చేస్తే సిబిల్‌ స్కోరు తగ్గుతుందా? పూర్తి వివరాలు!

Jio Data Offer: జియో సంచలన ఆఫర్.. రూ.11 తో 10GB డేటా ప్లాన్ పూర్తి వివరాలు ఇదిగో!

Gold Rate Dropped: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా దిగొస్తున్న బంగారం ధరలు..

New Gst: కొత్త జీఎస్టీ అమలు అప్పటినుంచే.. భారీగా తగ్గనున్న ఆ వస్తువుల ధరలు, ఇది కదా కోరుకున్నది!

Big Stories

×