Rain Alert: ఉదయం ఎండ.. మధ్యాహ్నం వాన.. ఇదే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితి.. ఉదయం ఎండ దంచికొడుతుంది. దీంతో ప్రజలందరు వారి పనులకు వెళ్తున్నారు. కానీ మధ్యాహ్నం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకోని వర్షం దంచికొడుతుంది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏపీకి అల్పపీడనం ముప్పు..
ఏపీలో మరో 48 గంటల్లో ఉపరితల ఆవర్తనం (UAC) ఉత్తర తమిళనాడు తీరం వైపు కదులుతూ క్రమంగా బలపడుతోంది. దీని కారణంగా రాబోయే 24 గంటల్లో దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయి, ఆ తర్వాత బుధవారం నుండి మొత్తం తీర ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో నెల్లూరు, తిరుపతి, కాకినాడ, విజయవాడ, చిత్తూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, అనకాపల్లి, విశాఖపట్నం, గుంటూరు, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మిగతా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు.
Also Read: చిరు వ్యాపారులను కలిసిన సీఎం చంద్రబాబు.. జీఎస్టీ సంస్కరణ ఫలితాలపై ఆరా
తెలంగాణలో మళ్లీ వర్షాలు..
తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలవుతున్నాయి. నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. నేడు మళ్లీ వర్షం కురుస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా అక్టోబర్ 23 నుంచి 26 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మెదక్, కామారెడ్డి, యాదాద్రి – భువనగిరి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, ములుగు, వరంగల్లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బయటకు వెళ్లకూడాదని సూచిస్తున్నారు.