Thanuja: బిగ్ బాస్ సీజన్ 9.. చదరంగం కాదు రణరంగం అని మొదలయ్యింది. ఏదో చేద్దామనుకొని బిగ్ బాస్ యాజమాన్యం ఇంకేదో చేసింది. కామనర్స్ ను దింపింది. ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ వచ్చింది. ఫెయిర్.. అన్ ఫెయిర్ అని చూడకుండా.. ప్రేక్షకుల ఓట్లకు విలువ ఇవ్వకుండా వారికి నచ్చనివారిని ఎలిమినేటీ చేస్తూ.. నచ్చినవారిని వైల్డ్ కార్డ్స్ లో పంపిస్తూ ఏదో చేస్తూ వచ్చింది.
ఇక ఇదంతా వదిలేస్తే.. ఉన్నా కొద్దీ హౌస్ లో ఉన్నవారి నిజ స్వరూపాలు బయటపడుతున్నాయి. మొదటి నుంచి బాండింగ్ తో నెట్టుకొచ్చిన భరణి ఎట్టకేలకు ఎలిమినేట్ అయ్యాడు. కుటుంబం.. అన్నగారి కుటుంబం అంటూ పాటలు పాడే అవకాశం ఇక హౌస్ లో లేదు. మొదటి నుంచి నాన్న.. నాన్న అంటూ ఇల్లంతా కలియతిరిగిన తనూజ.. నాన్న వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అనుకున్నారు. కానీ, నాన్న అనే పదాన్ని అమ్మడు కేవలం గేమ్ కోసమే పెట్టుకుంది అని బయటపడింది.
నాన్న వెళ్లిపోతుంటే.. కూతురు ముఖంలో బాధ లేదు. ఏడుపు.. భరణి వెళ్లెవరకు తప్ప ఆ తరువాత కనిపించలేదు. అంత బాండింగ్ ఉంటే ఒక మనిషి వెళ్ళాకా ఎంత లేదనుకున్నా ఆ ప్రజెన్స్ ను ఒక రోజు అయినా మిస్ అవుతారు. భరణి అలా వెళ్ళాడో లేదో.. ఇలా ప్లేట్ మార్చేసి నవ్వడం మొదలుపెట్టింది. ఇంతోటి దానికి నాన్న లేకపోతే నేను లేను.. నాన్న తప్ప నాకు సపోర్ట్ ఎవరు లేరు అని అనడం అంతా డ్రామా అని తెలిసిపోయింది.
ఇవన్నీ పక్కన పెడితే.. అసలు తనూజకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉందా.. సిగ్గు అనేది ఉందా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా ఏ మనిషి అయినా కూడా తన క్యారెక్టర్ గురించి తక్కువ చేసి మాట్లాడినా.. తప్పుగా చూపించాలకున్నవారిపై కోపం ఉంటుంది. నా గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నారు. వీరికి దూరంగా ఉండాలి అని అనుకుంటారు. కానీ, తనూజ మాత్రం సిగ్గు అనేది లేకుండా ఆత్మాభిమానం అనేది లేకుండా మళ్లీ వెళ్లి వాళ్ళతోనే మాట్లాడడం అనేది గేమ్ స్ట్రాటజీ. ఆమెకు సిగ్గు అనేది లేదు అని కొందరు చెప్పుకొస్తున్నారు.
అసలేం జరిగింది అంటే.. దివ్వెల మాధురి, రమ్య మోక్ష.. వచ్చి రాగానే తనూజ – కళ్యాణ్ మధ్య ఉన్న బాండింగ్ ను తప్పు పట్టారు. కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు అన్నారు.తనూజ ఆ చనువు అతనికి ఇస్తుంది అనిచెప్పుకొచ్చారు. అంతేకాకుండా మాధురి అయితే తనూజ ది కూడా తప్పు ఉంది, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని చెప్పింది. ఈ వీడియోను నాగార్జున.. తనూజకు చూపించాడు కూడా.
ప్రేక్షకులు నమ్మడం, నమ్మకపోవడం పక్కన పెడితే.. తన మీద తనకు నమ్మకం ఉంది అని చెప్పడం బావుంది. కానీ, అంతగా తన క్యారెక్టర్ ను దిగజార్చి మాట్లాడిన మాధురితో మళ్లీ ఎలా అంత చనువుగా ఉండగలుగుతుంది. అమ్మ.. అమ్మ అంటూ చుట్టూ ఎలా తిరగగలుగుతుంది. సిగ్గు అనేది లేదా.. ? ఒక్క మాట అంటేనే నోరేసుకొని పడిపోయే ఆమె.. అంత పెద్ద మాట అన్నా కూడా ఎలా నవ్వుతూ మాట్లాడుతుంది. ఇదంతా ఒక గేమ్ స్ట్రాటజీ. తనూజ రియల్ క్యారెక్టర్ ఇదే. గొడవపడి సాధించడం కన్నా.. సైలెంట్ గా ఉండి అందరితో మంచిగా నటించి.. తనవైపు శత్రువులు రాకుండా చూసుకుంటుంది. కానీ, ఆమె బిహేవియర్ బయట నెగిటివిటిని తీసుకొస్తుంది. మరి ఈ వారం అమ్మడి ఆట ఎలా ఉండబోతుందో చూడాలి.