Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్.. ఇండస్ట్రీ మొత్తానికి దివాళీ పార్టీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇలాంటి బాష్ లు ఎక్కువ బాలీవుడ్ లో కనిపిస్తాయి. ఒక సెలబ్రిటీ తమ ఇంట్లో పార్టీ ఏర్పాటు చేయడం, ఇండస్ట్రీ మొత్తం ఆ పార్టీకి అటెండ్ అవ్వడం లాంటివి చేస్తారు. దీనివలన ఇండస్ట్రీ మొత్తం ఒక్కటిగా కలిసి ఉన్నట్లు కనిపిస్తుంది. సత్సంబంధాలు పెరుగుతాయి. ఇప్పుడు బండ్ల కూడా అదే పని చేశాడు.
గత కొంతకాలంగా బండ్లన్న ఇండస్ట్రీలో యాక్టివ్ గా లేడు. ఒకప్పుడు హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆయన ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్లి చేతులు కాల్చుకున్నాడు. ఇక ఇవన్నీ మనకు సెట్ కావు అని తెలుసుకొని రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చి తన వ్యాపారం ఏదో తాను చేసుకుంటూ వస్తున్నాడు. సినిమాలకు దూరమైనా కూడా బండ్ల ఎప్పుడు అభిమానులకు దూరం కాలేదు. నిత్యం సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగానే ఉంటున్నాడు. అంతేకాకుండా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెడుతూ ఉంటాడు.
తాజాగా బండ్ల గణేష్ తన ఇంట్లో ఇండస్ట్రీ మొత్తానికి ఒక పెద్ద పార్టీ ఇచ్చాడు. ఇండస్ట్రీ మొత్తం ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు, హీరోయిన్లు.. ఒకరని చెప్పలేం.. దాదాపు అందరూ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేశాడు. చిరు రావడం.. ఈ పార్టీకి పెద్ద అస్సెట్ గా నిలిచింది. ఇక చిరు రావడంతో బండ్ల ఆనందానికి అవధులు లేవు. ఆయనకంటూ ఒక సపరేట్ చైర్ ను కూడా తయారుచేయించి అందులో కూర్చోబెట్టాడు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక ఈ పార్టీకి బండ్లన్న బాగానే ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం అటుఇటుగా ఈ పార్టీకి బండ్ల రూ. 2 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఏంటి నిజమా.. అంటే నిజమే. అయితే అసలు ఇంత భారీ పార్టీ బండ్లన్న ఎందుకు ఇస్తున్నట్లు.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే చర్చ. అయితే ఇది బండ్ల భారీ ప్లాన్ అని అంటున్నారు.
అసలు బండ్ల ఈ పార్టీ ఎందుకు ఇచ్చినట్లు అంటే.. నిర్మాతగా గ్యాప్ ఇచ్చిన బండ్ల గణేష్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు. తాను మళ్లీ ఇండస్ట్రీకి వస్తున్నాను అని చెప్పడానికి ఈ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు అందరినీ ఒకే వేదికపై ఉంచి.. అందరికీ తాను కూడా ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని, ఇకనుంచి ఏ హీరో, డైరెక్టర్ అయినా కూడా తన వద్దకు రావచ్చని హింట్ ఇచ్చేశాడు. మరి ఈ బండ్లన్న ప్లాన్ సక్సెస్ అయ్యిందా.. లేదా.. అనేది తెలియాలంటే కొద్దిగా ఎదురుచూడాలి. రీఎంట్రీలో బండ్ల.. ఏ హీరోతో వస్తాడో చూడాలి.