Bandla Ganesh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా.. నటుడిగా.. కమెడియన్ గా తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బండ్ల గణేష్ (Bandla Ganesh) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిత్యం కాంట్రవర్సీ మాటలతో వార్తల్లో నిలిచే ఈయన.. ఒకవైపు పొలిటికల్ గా.. మరొకవైపు నటుడిగా కూడా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ సినిమాలలో నటించకపోయినా.. మూవీ ఈవెంట్స్ లో మాత్రం పాల్గొంటూ తన మాటలతో సోషల్ మీడియాలో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పలు రకాల కామెంట్లు చేస్తూ.. అసలు ఎవరిని ఉద్దేశించి ఆ కామెంట్లు చేస్తున్నారో కూడా తెలియని కోణంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.
అలా నిత్యం అందరిలో తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్న బండ్ల గణేష్.. తాజాగా టాలీవుడ్ సెలబ్రిటీలందరికీ కూడా తన ఇంట్లో దీపావళి సందర్భంగా పార్టీ ఇచ్చారు. ముఖ్యంగా ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈయనతో పాటు శ్రీకాంత్ (Srikanth), నిర్మాత నవీన్ ఎర్నేని (Naveen yerneni), వెంకటేష్ (Venkatesh) ఇలా చాలామంది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పెద్దలు, యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు అందరూ కూడా హాజరై దీపావళి పండుగను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మెగాస్టార్ చిరంజీవి కోసం బండ్ల గణేష్ ప్రత్యేకంగా సింహాసనాన్ని ఏర్పాటు చేయించి మరీ అందులో చిరంజీవిని కూర్చోబెట్టడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ వేడుక చాలా అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో ఈ వేడుకకు ఎంత ఖర్చయింది అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ALSOREAD:Hansika Motwani: ఇంటి పేరు తొలగించిన హన్సిక.. విడాకులకు సిద్ధమయ్యిందా?
ఇకపోతే సాధారణంగా బండ్ల గణేష్ పార్టీ ఇస్తున్నారు అంటే అది మామూలుగా ఉండదు. అరేంజ్మెంట్స్ ఊహించని లెవెల్ లో ఉంటాయి. డెకరేషన్ దగ్గర నుంచి గెస్ట్ లను రిసీవ్ చేసుకోవడం వరకు ప్రతిదీ ఒక స్పెషల్ అని చెప్పవచ్చు. అంతేకాదు ఆయనే స్వయంగా సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ లోపలికి తీసుకెళ్లడం.. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అదిరిపోయే సెట్స్ తో గ్రాండ్గా దీపావళి వేడుకలు సెలబ్రేట్ చేశారు బండ్ల గణేష్. ఇకపోతే ఈ పార్టీలో విందును ప్రత్యేకంగా ఏర్పాటు చేయించినట్లు తెలుస్తోంది. ఇక్కడ సెలబ్రిటీల కోసం ఏర్పాటు చేయించిన విందులో ఒక్కో ప్లేట్ ధర సుమారుగా 15,000 నుండి 20వేల వరకు ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా 2 కోట్ల వరకు పార్టీ ఖర్చు అయినట్లు సమాచారం.
ఈ ఈవెంట్ కి ఎవరెవరు సెలబ్రిటీలు హాజరయ్యారు అనే విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ , వెంకటేష్, సిద్దు జొన్నలగడ్డ, తేజ సజ్జ తో పాటు అగ్ర దర్శకులు , అగ్ర నిర్మాతలు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.