BigTV English

Team India: మ‌గాళ్ల‌తో స‌మాన జీతం…మీరు క్రికెట్ ఆడ‌టం దండ‌గే..మ‌హిళ‌ల టీమిండియాపై బ్యాన్ ?

Team India: మ‌గాళ్ల‌తో స‌మాన జీతం…మీరు క్రికెట్ ఆడ‌టం దండ‌గే..మ‌హిళ‌ల టీమిండియాపై బ్యాన్ ?
Advertisement

Team India:   వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో మహిళల టీమిండియా జట్టు అత్యంత దారుణంగా విఫలమవుతోంది. ఇండియాలో జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో మనోళ్లు అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తున్నారు. దీంతో టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లే మార్గాలు క్రమక్రమంగా మూసుకుపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మహిళల టీమిండియా జట్టు పై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పురుషులతో సమానంగా జీతాలు తీసుకుంటున్న మహిళల జట్టు ప్లేయర్లు క్రికెట్ ఆడడం దండగా అంటున్నారు. వెంటనే టీమిండియా మహిళలు ఘటన తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఫాన్స్. వీళ్ళకి ఇచ్చే జీతాలు పేద ప్రజలకు పంచితే వాళ్లైనా కడుపునిండా భోజనం చేస్తారని అంటున్నారు. నిన్న ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో ఈ ట్రోలింగ్స్ మొదలయ్యాయి.


Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండ‌టం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే ప‌నులు ?

పురుషులతో సమానంగా మహిళలకు జీతాలు..దండ‌గే అంటూ ట్రోలింగ్స్‌

టీమిండియా మహిళల జట్టు తీసుకుంటున్న జీతాలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ మొదలయ్యాయి. పురుషులతో సమానంగా జీతాలు తీసుకుంటూ, ఆటలో మాత్రం దారుణంగా విఫలమవుతున్నారని అంటున్నారు. టీమిండియా పురుషుల జట్టు ప్లేయ‌ర్లు ఒక్కో టెస్ట్ మ్యాచ్ కు 15 లక్షలు తీసుకుంటున్నారు. వన్డేలకు ఆరు లక్షలు ఒక్క మ్యాచ్ కు తీసుకుంటున్నారు. టి20 లో ఆడితే కచ్చితంగా మూడు లక్షలు చెల్లించాల్సిందే. అదే సమయంలో టీమిండియా మహిళల జట్టు కూడా ప్రతి మ్యాచ్ కు, పురుషులలాగే తీసుకుంటోంది. టెస్టులకు 15 లక్షలు, వన్డేలకు ఆరు లక్షలు అలాగే టి20 లకు మూడు లక్షలు టీమిండియా మహిళల జట్టుకు చెందిన ప్లేయ‌ర్లు తీసుకోవడం జరుగుతోంది.


డబ్బులు సరిగ్గా తీసుకుంటున్నారు కానీ ఆటలో మాత్రం అత్యంత దారుణంగా విఫలమవుతున్నారు. అటు సంవత్సరానికి ఏ-గ్రేడ్ కింద 50 లక్షలు ప్లేయర్లు దక్కించుకుంటున్నారు. అలాగే బీ-గ్రేడ్ కింద 30 లక్షలు అటు సీ-గ్రేడ్‌ కింద పది లక్షలు మహిళ జట్టుకు అందుతున్నాయి. ఇన్ని డబ్బులు వచ్చినా కూడా టీమిండియా ప్లేయర్లు మాత్రం వరల్డ్ కప్ లో పెద్దగా రాణించడం లేదు. వీళ్లకు డబ్బులు పెట్టడం దండగా అంటూ ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. ఆ డబ్బులను పేదవాళ్లకు పంచాలని అంటున్నారు. ఇటీవల కాలంలో చెన్నైకి చెందిన శ్రీనివాసన్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు.

సెమీస్ కు వెళ్లే ఛాన్స్ ఇంకా ఉందా ?

వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో నిన్న ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయినప్పటికీ సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశాలు టీమిండియాకు స్పష్టంగా ఉన్నాయి. న్యూజిలాండ్ అలాగే బంగ్లాదేశ్ జట్లతో తన తర్వాతి మ్యాచ్ ల‌లో కచ్చితంగా టీమిండియా గెలవాలి. అలా చేస్తే ఎవరితో సంబంధం లేకుండా నేరుగా సెమీ ఫైనల్ కు వెళుతుంది టీమిండియా. అలా కాదని న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి బంగ్లాదేశ్ చేతిలో గెలిస్తే రన్ రేట్ ప్రకారం కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి. కానీ న్యూజిలాండ్ మళ్లీ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా అన్ని ఓడిపోవాలి.

Also Read: INDW vs ENGW: స్మృతి , హర్మన్ పోరాటం వృధా…సెమీస్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్..టీమిండియాకు ఇంకా ఛాన్స్‌

Related News

Virat Kohli: వాళ్ల టార్చ‌ర్ భరించ‌లేక‌..లండ‌న్ లో సెటిల్ కావ‌డంపై కోహ్లీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

IND VS PAK: 95, 195, 295 పరుగుల వద్ద సిక్స‌ర్ కొట్టిన ఏకైక మొన‌గాడు..పాకిస్థాన్ కు వెన్నులో వ‌ణుకు పుట్టించాడు

IND VS AUS: బుమ్రాకు రెస్ట్‌, కుల్దీప్ ను ప‌క్క‌కు పెట్టారు…తొలి వ‌న్డేలో ఓట‌మికి 100 కార‌ణాలు

Womens World Cup 2025: నేడు శ్రీలంక‌, బంగ్లా మ‌ధ్య ఫైట్‌…టీమిండియా సెమీస్ చేరాలంటే ఇలా జ‌రుగాల్సిందే?

INDW VS ENGW: స్టేడియంలో ఎక్కి ఎక్కి ఏడ్చిన‌ స్మృతి మందాన..ఫోటోలు వైర‌ల్‌

Ban On Pakistan: అఫ్ఘ‌నిస్తాన్ దెబ్బ అద‌ర్స్‌.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాకిస్తాన్ ఔట్ ?

Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండ‌టం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే ప‌నులు ?

Big Stories

×