BigTV English

Hansika Motwani: ఇంటి పేరు తొలగించిన హన్సిక.. విడాకులకు సిద్ధమయ్యిందా?

Hansika Motwani: ఇంటి పేరు తొలగించిన హన్సిక.. విడాకులకు సిద్ధమయ్యిందా?
Advertisement

Hansika Motwani: సాధారణంగా పెళ్లయిన తర్వాత ప్రతి అమ్మాయి ఇంటిపేరు మారుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే చాలామంది హీరోయిన్లు వివాహం జరిగిన తర్వాత తమ భర్త పేరును లేదా భర్త ఇంటి పేరును తమ ఇంటి పేరుగా మార్చుకొని.. సోషల్ మీడియా ఖాతాలో చలామణి అవుతూ ఉంటారు. అయితే అనుకోకుండా ఆ ఇంటి పేరును తొలగిస్తే మాత్రం పలు రకాల రూమర్స్ వినిపిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఎవరైతే తమ భర్తల నుండి దూరం కాబోతున్నారో అలాంటివారు ముందస్తు హింట్ ఇస్తూ ఇంటిపేరు తొలగించి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.


విడాకులకు హింట్ ఇచ్చిన హన్సిక..

ఇప్పటికే అలా ఎంతోమంది మొదట సోషల్ మీడియా ఖాతాలో ఇంటిపేర్లు తొలగించి.. విడాకులకు హింట్ ఇచ్చి ఆ తర్వాత కొంతకాలానికి నిజంగానే విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ హన్సిక మోత్వానీ కూడా ఇంస్టాగ్రామ్ నుండి ఇంటిపేరును మార్చడంతో.. ఇక ఈమె విడాకులకు సిద్ధమవుతోందా అంటూ సరికొత్త రూమర్ తెరపైకి వచ్చింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రూమర్స్ నిజమేనా?

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వచ్చిన ‘దేశముదురు’ సినిమాతో తొలిసారి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది హన్సిక. మొదటి సినిమాలోనే అమాయకత్వంతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ సొట్టబుగ్గల సుందరి.. తెలుగు, తమిళ్లో వరుసగా హిట్ చిత్రాలలో నటించి మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. హిందీ సినీ రంగంలోకి కూడా అడుగుపెట్టి అక్కడ కూడా పలు చిత్రాలు చేసింది. కెరియర్ పీక్స్ లో ఉండగానే 2022లో వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాతో ఏడు అడుగులు వేసింది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకే హన్సిక ఒంటరిగా తన తల్లితో కలిసి జీవిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్న వేళ ఇప్పుడు సడన్ గా ఈమె సోషల్ మీడియా ఖాతా నుండి ఇంటి పేరును కూడా తొలగించడంతో ఈ రూమర్స్ నిజమేనని అందరూ నమ్ముతున్నారు.


ALSO READ:Jabardast: 200 కోట్ల ఆస్తికి అధిపతి.. ఒక్క దెబ్బతో క్లారిటీ ఇచ్చి జబర్దస్త్ కమెడియన్!

అసలు విషయం ఏమిటంటే?

అసలు విషయంలోకి వెళ్తే.. చాలామంది హీరోయిన్స్ న్యూమరాలజీ ప్రకారం తమ పేర్లను మార్చుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తన ఇంటి పేరులోని మోత్వానీ స్పెల్లింగ్ మార్చింది. న్యూమరాలజీ ఆధారంగా తన ఇంటిపేరులో స్పెల్లింగ్ మార్చుతూ.. Motwani నుంచీ Motwanni గా మార్చుకుంది. న్యూమరాలజీ ప్రకారం ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు తమ పేర్లలో మార్పులు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఈమె కూడా మార్పు చేసుకోవడం జరిగింది.

హన్సిక కెరియర్..

హన్సిక కెరియర్ విషయానికొస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. షక లక బూమ్ బూమ్ వంటి హిట్ సీరియల్స్ లో కూడా నటించింది. హృతిక్ రోషన్ నటించిన కోయి మిల్ గయా అనే చిత్రంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె.. వరుస సినిమాలు చేస్తూ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.

Related News

Peddi Movie: చరణ్ బర్త్ డేకి బిగ్ అనౌన్స్ మెంట్.. పెద్దిపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

Shivaji: సాంప్రదాయినీ.. సుప్పినీ.. సుద్దపూసనీ అంటున్న శివాజీ

Nara Rohith : నారా రోహిత్ పెళ్లికి ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిందా..? గెస్టులు వీళ్లే..

Sharwandh36 Title: శర్వా 36 మూవీ టైటిల్ ఫిక్స్.. ‘బైకర్‘గా వస్తున్న ఛార్మింగ్ స్టార్

Samantha : సినిమాలు లేకున్నా నంబర్ వన్ స్థానం.. సమంత రేంజ్ మామూలుగా లేదుగా!

Pradeep Ranganathan : డైరెక్టర్ టు హీరో జర్నీ.. ప్రదీప్ రంగనాథన్ సంపాదించిన ఆస్తులు ఇవే..?

Bandla Ganesh: రూ. 2 కోట్ల పార్టీ.. బండ్ల ప్లాన్ సక్సెస్ అయ్యిందా.. ?

Bandla Ganesh: దీపావళి పార్టీ కోసం బండ్లన్న పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×