Food Safety Raids: దీపావళి సందర్భంగా నగర వ్యాప్తంగా స్వీట్స్ షాపుల్లో.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపడుతున్నారు. ఈ పండుగకు స్వీట్స్ డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ టీమ్ గత మూడు రోజులుగా.. నగరంలోని రైడ్స్ నిర్వహిస్తున్నారు. మొత్తం 45 స్వీట్స్ షాపులపై అధికారులు తనిఖీలు జరిపినట్లు తెలుస్తోంది.
తనిఖీల్లో పలు షాపుల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్వీట్స్ తయారీకి భారీగా సింథటిక్ కలర్‌లు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కలర్స్ ఆరోగ్యానికి ప్రమాదమని, ఎక్కువ మోతాదులో తీసుకుంటే లివర్, కిడ్నీలకు సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కల్తీ నెయ్యి, నాణ్యతలేని వంటనూనెలతో తయారు చేస్తున్న స్వీట్స్‌ను సీజ్ చేశారు.
అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కి పంపించారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. నిబంధనలు పాటించని షాపులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
కొన్ని దుకాణాల్లో అమ్మే వస్తువులకు లేబుల్స్, ఎక్స్‌పైరీ డేట్ వివరాలు లేకుండా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్నిప్లేస్‌లలో తయారీ విభాగం పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కిచెన్ లో ఈగలు, దోమలు తిరుగుతూ ఉండటమే కాకుండా.. ఫ్లోర్‌లు తడిగా ఉండటం, డ్రెయినేజ్ సిస్టమ్ సరైన విధంగా లేకపోవడం వంటి విషయాలు బయటపడ్డాయి.
కిచెన్‌లో పనిచేసే కార్మికులు హెడ్ క్యాప్స్, గ్లౌజ్‌లు, యాప్రాన్‌లు ధరించట్లేదని అధికారులు పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా టన్నుల కొద్దీ స్వీట్స్ తయారు చేస్తుండటంతో.. క్రాస్ కంటామినేషన్ అయ్యి, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశముందన్న అధికారులు హెచ్చరించారు.
అధికారుల బృందం స్వీట్స్ దుకాణాల్లో నిల్వ ఉంచిన పదార్థాలను కూడా తనిఖీ చేసింది. కొన్ని చోట్ల ఎక్స్‌పైర్ అయిన మిల్క్ పౌడర్, మైదా, కండెన్స్‌డ్ మిల్క్, వెన్న వంటివి వాడుతున్నట్లు తేలింది. దీపావళి గిరాకీని దృష్టిలో పెట్టుకుని అజాగ్రత్తగా తయారీ జరుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ.. సీఎం రేవంత్ దీపావళి శుభాకాంక్షలు
కలర్‌ఫుల్‌గా, మెరుస్తూ కనిపించే స్వీట్స్ ఎక్కువగా సింథటిక్ కెమికల్స్‌తో తయారై ఉంటాయి. అలాంటి స్వీట్స్ కొనడం, తినడం మానేయడం మంచిదని అధికారులు సూచించారు.
హైదరాబాద్ వ్యాప్తంగా స్వీట్ షాప్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు..
దీపావళి సందర్భంగా కంటిన్యూగా స్వీట్ షాప్స్ పై రైడ్స్
శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్ కి పంపిన అధికారులు
నగరంలో 45 స్వీట్ షాప్స్ ల్లో తనిఖీలు
భారీగా సింథటిక్ కలర్ ఉపయోగిస్తున్నట్లు గుర్తింపు
కల్తీ… pic.twitter.com/j5BeWiWYya
— BIG TV Breaking News (@bigtvtelugu) October 20, 2025